కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం... లాక్‌డౌన్ ఎత్తేసిన హుబే, త్వరలోనే వుహాన్‌లో కూడా సడలింపు

డాంగ్‌ఫెంగ్ ఫెంగ్‌షెన్ ప్లాంటులో పరస్పరం రెండు మీటర్ల దూరంలో కూర్చుని భోజనం చేస్తున్న ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాంగ్‌ఫెంగ్ ఫెంగ్‌షెన్ ప్లాంటులో పరస్పరం రెండు మీటర్ల దూరంలో కూర్చుని భోజనం చేస్తున్న ఉద్యోగులు

విశ్వ మహమ్మారి కరోనావైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ నగరంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 8 నుంచి పాక్షికంగా సడలించనున్నారు.

వుహాన్ మినహా మిగతా హుబే ప్రాంతమంతటా ఆరోగ్యంగా ఉన్నవారికి మంగళవారం అర్థరాత్రి నుంచి ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసింది.

దాదాపు వారం రోజుల నుంచీ కొత్త కరోనా కేసులేవీ బయటపడని వుహాన్‌లో మంగళవారం ఒక కొత్త కేసు నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా దేశాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. లేదంటే తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారతదేశ వ్యాప్తంగా మంగళవారం అర్థరాత్రి నుంచి 21 రోజులు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

బ్రిటన్ సైతం కొత్త చర్యలు చేపట్టింది. వీటిలో ఇద్దరికి మించి బయట గుమిగూడడంపై నిషేధం, ప్రాధాన్యం లేని సరుకులు అమ్మే దుకాణాల మూసివేత లాంటివి ఉన్నాయి.

అమెరికన్లు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఇతరులను కలవకుండా పరిమితులు విధించుకోవాలని లేదంటే దేశంలోని ఆరోగ్య సదుపాయాలను మించిపోయేలా కరోనా కేసులు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్పెయిన్‌లోని వృద్ధాశ్రమాలలో ఉన్నవారు కొందరు బెడ్ మీదే చనిపోయి కనిపించారని, కొందరు వాటి నుంచి వెళ్లిపోయారని తమ సైన్యం చెప్పినట్లు ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది. మాడ్రిడ్‌లో ఉన్న ఒక ఐస్ రింక్‌ను కోవిడ్-19 మృతులకు తాత్కాలిక మార్చురీగా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతానికి ప్రపంవ్యాప్తంగా 3 లక్షల కేసులకు పైగా నమోదవడంతో ఈ మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ వ్యూహాలను దేశాలు మరింత తీవ్రం చేయాలని కోరింది.

Sorry, your browser cannot display this map