కరోనావైరస్: స్పెయిన్‌లో దిక్కు లేకుండా మృతి చెందిన వృద్దులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం

శవాన్ని తరలిస్తున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

కరోనావైరస్ రోగులకు సహాయ చర్యలు చేపడుతున్న స్పానిష్ సైనికులకు రిటైర్మెంట్ గృహాల్లో దిక్కు లేకుండా చనిపోయి పడి ఉన్న వృద్ధుల శవాలు లభించాయి.

కరోనావైరస్ రోగులకు సహాయ చర్యలు చేపడుతున్న స్పానిష్ సైనికులకు రిటైర్మెంట్ గృహాల్లో దిక్కు లేకుండా చనిపోయి పడి ఉన్న వృద్ధుల శవాలు లభించాయని దేశ రక్షణ శాఖ తెలిపింది. కొంత మంది వృద్దులు కనీస ఆదరణ లేకుండా ఉన్నారని తెలిపింది.

సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై విచారణకు ఆదేశించినట్లు స్పెయిన్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.

దేశంలో కరోనావైరస్ సోకి, నిరాశ్రయ గృహాలలో ఉన్నవారికి సహాయం చేసేందుకు స్పెయిన్ అధికారులు మిలిటరీ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు.

కరోనావైరస్ బారిన పడి మృతి చెందిన వారి శవాలను భద్రపరచడం కోసం ఒక ఐస్ స్కేటింగ్ రింక్ ఉన్న భవంతిని తాత్కాలిక మార్చురీగా మార్చినట్లు అధికారులు తెలిపారు.

కరోనావైరస్ అత్యధికంగా ప్రబలిన యూరోపియన్ దేశాలలో స్పెయిన్ ఒకటి.

మాడ్రిడ్‌లో శవాలు

ఫొటో సోర్స్, AFP

సోమవారం నాటికి కరోనావైరస్ బారిన పడి స్పెయిన్‌లో మరణించిన వారి సంఖ్య 462గా నమోదు అయింది. మంగళవారం నాటికి స్పెయిన్ లో మొత్తం మృతుల సంఖ్య 2991కి చేరింది.

రిటైర్మెంట్ గృహాల్లో వృద్ధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీట రోబెల్స్ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

స్పానిష్ ఆర్మీ రిటైర్మెంట్ గృహాలను పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు నిరాదరణకు గురైన వృద్దులు, మృతులు మృతులను కనిపెట్టినట్లు చెప్పారు.

కరోనావైరస్ సోకినట్లు తెలియగానే రక్షణ గృహాలలో పని చేస్తున్న సిబ్బంది అక్కడ నుంచి పారిపోయారని స్పెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

సాధారణ పరిస్థితుల్లో అయితే, అంత్య క్రియలు నిర్వహించే సిబ్బంది వచ్చి మృతులను తీసుకుని వెళ్లెవరకూ కోల్డ్ స్టోరేజ్ లో ఉంచుతారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

కానీ, కరోనావైరస్ బారిన పడి కొంత మంది చనిపోయారని అనుమానం రావడంతో వారిని ఎక్కడికక్కడ వదిలేసి సిబ్బంది వెళ్లిపోయారని చెప్పారు. అధిక సంఖ్యలో మరణాలు నమోదు అయిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో శవాన్ని అంత్యక్రియలకు తీసుకుని వెళ్ళడానికి సుమారు 24 గంటలు పడుతుందని తెలిపారు.

స్పెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి సాల్వడార్ ఐలా రిటైర్మెంట్ గృహాలలో ఉండే వృద్ధుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఒక పత్రిక సమావేశంలో తెలిపారు.

ఈ గృహాల పై ఎక్కువ పర్యవేక్షణ పెడతామని ఆమె చెప్పారు.

అంబులెన్సు

ఫొటో సోర్స్, AFP

మాడ్రిడ్ లో కరోనావైరస్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే తమ దగ్గర అవసరమైన రక్షణ పరికరాలు లేకపోవడంతో వీరికి అంత్యక్రియలు నిర్వహించడం సాధ్యం కాదని , మున్సిపల్ అంత్యక్రియల కేంద్రం తెలిపింది.

అంత్యక్రియలు నిర్వహించే సిబ్బంది శవాలను తీసుకుని వెళ్లెవరకూ నగరంలో ఉన్న పలా షియో డి హీలో కాంప్లెక్స్ లో ఉన్న ఐస్ స్కేటింగ్ రింక్ లో శవాలను ఉంచుతామని అధికారులు చెప్పారు.

ఈ కాంప్లెక్స్ లో షాపులు, రెస్టారెంట్లు, బౌలింగ్ జోన్లు, సినిమా హాళ్లు ఉన్నాయి. కరోనావైరస్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఇఫెమా కాంగ్రెస్ సెంటర్ నుంచి ఈ కాంప్లెక్స్ దగ్గర్లోనే ఉంది.

కరోనావైరస్ వలన ఇటలీ తర్వాత యూరోప్ లో అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో స్పెయిన్ ఒకటి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇప్పటికి స్పెయిన్ లో నమోదు అయ్యాయి.

24 గంటల్లో కోవిడ్ 19 బారిన పడి 602 మంది చనిపోయారని ఇటలీ అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఆరు వేలు దాటింది.

అయితే, రోజువారీ చనిపోతున్నవారి సంఖ్య గురువారం నుంచి తగ్గుతూ వస్తోంది. దీనిని బట్టి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రభావం చూపిస్తున్నట్లు అర్ధం అవుతోంది.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)