కరోనావైరస్: ఆయన మరణించారు.. బంధువుల్లో 19 మందికి సోకింది.. ఇంకా 40 వేల మందికి సోకిందేమోనన్న టెన్షన్

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్‌లోని 20 గ్రామాలకు చెందిన మొత్తం జనాభా 40 వేల మందిని అక్కడి ప్రభుత్వం క్వారంటీన్‌లో పెట్టింది.
బల్‌దేవ్ సింగ్ అనే 70 ఏళ్ల వ్యక్తి కరోనావైరస్ సోకి మరణించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ వ్యక్తి మరణించిన తర్వాతే ఆయనకు కరోనావైరస్ సోకిన సంగతి తెలిసింది.

ఇటలీ నుంచి జర్మనీ మీదుగా..
మత బోధకుడైన బల్‌దేవ్ సింగ్ ఇటలీ, జర్మనీల్లో పర్యటించి పంజాబ్‌కు తిరిగివచ్చారని.. స్వీయ నిర్బంధంలో ఉండాలన్న ప్రభుత్వ సూచనను పక్కనపెట్టి బయట తిరిగారని అధికారులు బీబీసీతో చెప్పారు.
ఇప్పటివరకూ దేశంలో వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో 38 కేసులు పంజాబ్‌లో నమోదయ్యాయి.
మిగతా దేశాలతో పోలిస్తే, భారత్‌లో రోజూ చాలా తక్కువ స్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. అందుకే దేశంలో బయటపడని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
బల్‌దేవ్ సింగ్ మరణించడానికి కొంత సమయం ముందే హోలా మహల్లా అనే సిక్కుల ఉత్సవంలో పాల్గొన్నారు.
ఆరు రోజులపాటు సాగే ఈ ఉత్సవానికి రోజూ పది వేల మంది దాకా హాజరవుతుంటారు.
బల్‌దేవ్ సింగ్ మరణించిన వారం రోజుల తర్వాత ఆయన బంధువుల్లో 19 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

''ఇప్పటివరకూ ఆయనను నేరుగా కలిసిన 550 మందిని మేం గుర్తించాం. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఆయన ఉన్న ప్రాంతం చుట్టూ ఉన్న 15 గ్రామాలను పూర్తిగా మూసివేశాం'' అని ఓ సీనియర్ అధికారి బీబీసీతో చెప్పారు.
పక్క జిల్లాలో ఉండే మరో ఐదు గ్రామాలనూ అధికారులు మూసేశారు.
దేశంలో ఇంత భారీ స్థాయిలో జనాలకు క్వారంటీన్ విధించడం ఇదే తొలిసారి కాదు.
రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో ఓ రోగి ద్వారా వైద్యుల బృందానికి కరోనావైరస్ సోకింది. వారి ద్వారా వందల మందికి అది వ్యాపించి ఉండొచ్చన్న అనుమానంతో బిల్వారా చుట్టుపక్కల గ్రామాల్లోని ఏడు వేల మందిని గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనా లాక్డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’
- కరోనా వైరస్: ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకిందని కనిపెట్టడం ఎలా
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









