ఇండియా లాక్‌డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?

నరేంద్ర మోదీ
    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన వెంటనే స్వస్థలాలకు ప్రయాణమైన లక్షలాది వలస కార్మికుల వేదనల గురించి విరివిగా ప్రచారం అయిన సమాచారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాస్త ఇబ్బంది కలిగించిన అంశంగా మారింది. ఆయన ఈ పరిస్థితి పట్ల తన విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సందేశంలో వలస కార్మికులకు క్షమాపణ కూడా చెప్పారు.

వలస కార్మికుల సమస్యల పై దృష్టి పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యం అని పాలక పార్టీ బీజేపీలోని కొన్ని వర్గాలు విమర్శిస్తుంటే, ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని దిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు.

దిల్లీలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను విధుల నుంచి తప్పించిన విధానం చూస్తుంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఖరి స్పష్టం అవుతోంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోనందుకు బాధ్యులను చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇద్దరు అధికారుల్ని సస్పెండ్, మరో ఇద్దరికి షో కాజ్ నోటీసులు జారీ చేసింది.

బీజేపీలో కొన్ని వర్గాలు మాత్రం అధికారుల నిర్లక్ష్య వైఖరే ప్రధానిని ఓటమికి గురి చేసిందని అభిప్రాయపడుతున్నారు.

"ప్రధాని ఉద్దేశ్యాన్ని అనుమానించడానికి లేదు. కరోనావైరస్ వ్యాప్తిని తక్షణమే నియంత్రించడానికి అయన దగ్గర లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని, లాక్ డౌన్ విధించడం ద్వారా కొన్ని వేల మరణాలని ఆపగలిగామని" ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ప్రధాని తీసుకున్న చర్య తొందరపాటు నిర్ణయమని చాలా మంది సామాన్యుల వాదన. లాక్ డౌన్ కి సిద్ధం కావడానికి ప్రజల దగ్గర కేవలం నాలుగు గంటల సమయమే ఉందని విమర్శకులు అన్నారు. ప్రధాని మార్చి 24వ తేదీన జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం రాత్రి 8 గంటలకి మొదలై అరగంటలో ముగిసిందని, అప్పటికి ప్రజలకి లాక్ డౌన్ కి మానసికంగా గాని, మరో విధంగా గాని సంసిద్ధం కావడానికి మరో మూడున్నర గంటల సమయం మాత్రమే మిగిలి ఉందని సామాన్య ప్రజల వాదన.

భారతదేశ చరిత్రలో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సందర్భాలు లేవు. ప్రభుత్వానికి కానీ, అధికారులకి కానీ గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అనుభవం లేదు.

మోదీ 2016లో ప్రకటించిన నోట్ల రద్దు లాగే, ఈ లాక్ డౌన్ పట్ల కూడా సరైన ప్రణాళిక కొరవడిందా అనేది ఒక సందేహం వస్తోంది.

మార్చి 22 వ తేదీన ప్రధాని జనతా కర్ఫ్యూ విధించినప్పుడు ఇది మరింత పొడిగించే సూచన ఉందని, ప్రజలు సంసిద్ధం కావడానికి ఒక సూచన ఇచ్చారని, కొంత మంది బీజేపీ సభ్యులు అన్నారు.

కొంత మంది పార్టీ శ్రేణులు బహిరంగంగా చెప్పడానికి ఒప్పుకోనప్పటికీ మోదీ తన మార్చి 24వ తేదీన చేసిన ప్రసంగంలో వలస కార్మికులు, నిరాశ్రయుల కోసం ప్రభుత్వం చేపట్టనున్న విధానాలని ప్రకటించి ఉండవల్సిందని అన్నారు.

అనధికార లెక్కల ప్రకారం దేశంలో 10 కోట్ల మంది వలస కార్మికులు ఉండగా అసంఘటిత రంగంలో మరో 40కోట్ల మంది ఉన్నారు.

ఎప్పుడూ బహిరంగంగా క్షమాపణ చెప్పని మోదీ క్షమించమని అడగడం ఆయన తప్పు ఒప్పుకున్నట్లు భావించవచ్చా?

"నన్ను క్షమించండి, ఈ లాక్ డౌన్ నిర్ణయం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ నేను మీ ప్రాణాలను వైరస్ బారి నుంచి కాపాడటానికే ఇలా చేయవలసి వచ్చింది" అని మోదీ చెప్పిన మాటలు ఒక విధంగా కార్మికులకు భరోసా ఇవ్వడం లాంటిదని, మోదీ విధానాన్ని సమర్ధించే అస్సామీస్ రాజకీయ విశ్లేషకుడు రాబిన్ కొలిట అన్నారు.

"మోదీ అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మోదీ భారతదేశం మావో చైనాలోలాగా కోట్లాది మంది చనిపోతుంటే నిశ్శబ్దంగా మట్టిలో కప్పెట్టేసే దేశం కాదని" సీనియర్ పాత్రికేయులు శేఖర్ గుప్త అన్నారు.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ఆగ్రహంతో ఉన్నారు. కానీ అయన సలహాదారులతో ఆగ్రహంగా ఉన్నారా? మోదీ పాలనలో పక్కకి నెట్టేసినట్లు, ప్రాముఖ్యం లేనట్లు భావించిన ప్రభుత్వ అధికారులపై ఆగ్రహంగా ఉన్నారా? లేదా వలస కార్మికుల ఆరోగ్య బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పట్ల కోపంగా ఉన్నారా?

మరో వైపు, ట్విట్టర్లో మోదీ అనుయాయులు, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని సమర్ధించే వాళ్ళ మధ్య తప్పు మీదంటే మీదని మాటల యుద్ధం నడిచింది.

“దిల్లీలో వలస కార్మికుల పట్ల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రళయం సృష్టించిందని” కేజ్రీవాల్ విమర్శకుడు ఒకరు ట్వీట్ చేశారు. “మోదీ భక్తులు అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయమని అంటారని ఎదురు చూస్తున్నామని” కేజ్రీవాల్ ని సమర్ధిస్తూ మరొకరు ట్వీట్ చేశారు.

నిజానికి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వలస కార్మికుల సమస్యకి కేజ్రీవాల్ ప్రభుత్వం కారణమని శుక్రవారం నుంచి విమర్శించడం మొదలు పెట్టింది.

దిల్లీలో జనాలు

ఫొటో సోర్స్, Getty Images

"ఇప్పుడు జరుగుతున్న మూకుమ్మడి కార్మికుల వలసకు దిల్లీ ప్రభుత్వానిదే బాధ్యత. వాళ్లకి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకలేదు. యోగి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారిని గమ్య స్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేసింది’’ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య సలహాదారుడు మ్రిత్యుంజయ కుమార్ మార్చి 28వ తేదీన దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన ట్వీట్ కి సమాధానంగా ట్వీట్ చేశారు.

దిల్లీ ప్రభుత్వం దిల్లీలోని పేదవారికి నీటి, కరెంటు సరఫరా తీసివేయడం వలనే ఈ సమస్య ఉత్పన్నమైందని బీజేపీ వర్గాలు చేసిన ట్వీట్లకు సమాధానంగా మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. “కరోనావైరస్ ప్రజలని భయపెడుతున్న ఇటువంటి సమయంలో చవకబారు రాజకీయాలు చేయడం మంచిది కాదు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దిల్లీలోని ప్రజలకి మంచి నీరు, విద్యుత్ సరఫరాని నిలిపి వేసిందని చేస్తున్న అభియోగంలో నిజం లేదు. ఈ పరిస్థితుల్లో చవకబారు రాజకీయాలు మాని దేశాన్ని రక్షించవలసి ఉంది” అని మనీష్ సిసోడియా సమాధానం చెప్పారు.

ఇరు ప్రభుత్వాలు వలస కార్మికుల సమస్యల పై దృష్టి సారించడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న రాజకీయ విబేధాలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న దిల్లీ ప్రజలందరి క్షేమం పట్ల దృష్టి సారిస్తామని, అలాగే దిల్లీలో నివసిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ప్రజల ఆరోగ్యం గురించి కూడా దిల్లీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి లేఖ రాశారు. దీంతో సమస్య సమసిపోయినట్లే కనిపిస్తుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)