కరోనావైరస్: ప్రపంచమంతా ఇంట్లో ఉంటే... వీళ్ళు బీచ్‌లో ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టెఫనీ హెగర్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉంటే, అమెరికాలో ఫ్లోరిడాలోని మయామీ బీచ్‌లో ఈ విద్యార్థులు మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్నారు.
దీనిని బట్టి చూస్తే, కొంతమంది యువతీయువకులు కరోనావైరస్ తమను ఏమీ చేయలేదులే అనే ధీమాతో ఉన్నట్లు అనిపిస్తోంది.
కానీ, యువత మీద కూడా కరోనావైరస్ ప్రభావం చూపుతోందని అమెరికాలో జరిగిన తాజా అధ్యయనం చెబుతోంది.
"నాకు కరోనా వస్తే రానివ్వండి. దానివల్ల నేను పార్టీ చేసుకోవడం విరమించుకోను" అని ఆ బీచ్‌లో ఒక యువకుడు మీడియా ప్రతినిధితో అన్నారు. ఆ వీడియో వైరల్ అయ్యి చాలామందికి ఆగ్రహం తెప్పించింది.
ఈ వైరస్ గురించి యువత తప్పుగా అర్థం చేసుకుంటోందని, అది ప్రమాదకరమని చాలామంది అంటున్నారు.
అమెరికాలో కరోనావైరస్ కేసుల వివరాలను పరిశీలిస్తే, యువత మీద కూడా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంటోంది.

ఫొటో సోర్స్, AFP
తాజా సమాచారం ఏం చెబుతోంది?
ఈ వైరస్ ఎవరికి సోకుతోంది? దాని ప్రభావం ఎలా ఉంటోంది? అన్న విషయాలు సవివరంగా చెప్పేందుకు అవసరమైన పూర్తిస్థాయి పరీక్షలు ప్రస్తుతం జరగడంలేదు.
ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్న వారిలో యువతీయువకుల సంఖ్య తక్కువగా ఉంటోందని కొందరు పరిశీలకులు అంచనా వేశారు.
కానీ, ఆ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అమెరికాలోని సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తాజా నివేదిక చెబుతోంది.
అమెరికాలో నమోదైన 2,500 కరోనావైరస్ కేసుల వివరాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. వారిలో 20 శాతం మంది 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసువారు, 38 శాతం మంది 20 నుంచి 54 ఏళ్ల వయసు వారున్నారని సీడీసీ తెలిపింది.
అయితే, ఇప్పటి వరకు కోవిడ్-19 కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారన్నది మాత్రం వాస్తవం.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడిన 85 ఏళ్లకు పైబడిన వారిలో 14.8 శాతం కేసులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. 40 ఏళ్ల లోపు వారిలో అది 0.2 శాతంగా ఉంది.
అయితే, దీని అర్థం యువత ఈ వైరస్ బారిన పడట్లేదని, తీవ్ర అనారోగ్యానికి గురికావడంలేదని కాదు.
ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో 50, 60 ఏళ్ల వయసు వాళ్ల కంటే... 20, 30 ఏళ్ల వయసువారి సంఖ్య మరీ తక్కువేమీ లేదని సీడీసీ నివేదిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీయూలో చికిత్స
ఆ 2,500 మంది కోవిడ్- 19 బాధితుల్లో ఐసీయూలో చికిత్స అవసరమైన యువతీయువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ, కొద్దిపాటు కేసులు కూడా ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
గతవారం ఇటలీ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం, ఐసీయూలో చేరిన కేసుల్లో 12 శాతం మంది 19 నుంచి 50 ఏళ్ల వయసు వారు ఉన్నారు.
ఫ్రాన్స్‌లో కరోనావైరస్ బారిన పడుతున్నవారిలో యువతీయువకులు కూడా ఎక్కువగానే ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.
అమెరికాతో పాటు, చాలా దేశాల్లోనూ కేవలం కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, కరోనావైరస్ బాధితులతో సన్నిహితంగా మెలిగినవారికి మాత్రమే ప్రస్తుతం కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు.
సాధారణ ప్రజలకు పరీక్షలు చేయడంలేదు కాబట్టి, తాజా నివేదికలో వెల్లడించిన విషయాలపై నిపుణులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"యువతలో ఈ వ్యాధి బాధితులు తక్కువగానే ఉన్నప్పటికీ, వారిలో కొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నది సుస్పష్టం. జనాభాలో యువతీయువకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి, మొత్తంగా చూస్తే కరోనా బారిన పడే యువత సంఖ్య భారీగానే ఉంటుంది" అని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లిప్‌సిచ్ అన్నారు.
సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఆస్పత్రుల్లో చేరుతున్నవారిలో చిన్న పిల్లలు, టీనేజర్లు చాలా తక్కువ మంది ఉంటున్నారు. 19 ఏళ్ల లోపు వారిపై ఈ వైరస్ ప్రభావం పెద్దగా లేదని చాలా దేశాల గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అందుకు కారణమేంటన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.
ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే చాలావరకు అంటువ్యాధుల వ్యాప్తికి యువత, ఆరోగ్యవంతులే వాహకాలుగా మారుతున్నారు. వారి నుంచి వృద్ధులకు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి కొత్త వ్యాధులు సంక్రమిస్తుంటాయి.
ఏది ఏమైనా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు నిపుణులు ఇచ్చే ముఖ్యమైన సూచన: మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి, సామాజిక దూరం పాటించండి. జనాలు గుమిగూడే కార్యక్రమాలకు వెళ్లకండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








