ప్రజల కదలికలను స్మార్ట్ ఫోన్ల ద్వారా కనిపెడుతున్న గూగుల్.. భారతదేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక పరిస్థితిపై రిపోర్ట్

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లియో కెలియోన్
    • హోదా, టెక్నాలజీ డెస్క్ ఎడిటర్, బీబీసీ

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల కదలికలను తెలుసుకుని సమాచారాన్ని సేకరించే పనిలో గూగుల్ ఉంది.

సాధారణంగా మ్యూజియంలు, షాపులు, ఇతర పబ్లిక్ స్థలాల్లో రద్దీ ఎలా ఉందో తెలియచేసేందుకు, ఏదైనా మార్గంలో వాహనాల రద్దీని తెలిపేందుకు గూగుల్ ఈ డేటాని సేకరిస్తుంది.

అయితే, కరోనావైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు యూకేలో ఒక కౌంటీ నుంచి మరో కౌంటీకి ఎలా ప్రయాణిస్తున్నారనే సమాచారంతో పాటు భారత్ సహా 130 దేశాలలో ప్రజల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోంది.

ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని గూగుల్ ప్రణాళిక చేస్తోంది. అయితే ఈ ప్రక్రియలో ప్రజల గోప్యత కి భంగం రాకుండా చూస్తామని గూగుల్ హామీ ఇచ్చింది.

గూగుల్ మ్యాప్స్ కానీ, మొబైల్ ఫోన్లో ఉండే లొకేషన్ సేవల ఆధారంగా గాని ఈ సమాచారాన్ని సేకరిస్తామని చెబుతోంది.

వివిధ దేశాలలో లాక్ డౌన్ ప్రకటించక ముందు ఈ ప్రదేశాలు ఎంత రద్దీగా ఉన్నాయో, గూగుల్ తెలియచేస్తుంది.

  • రిటైల్ షాపులు, వినోద స్థలాలు
  • నిత్యావసర వస్తువుల దుకాణాల, మందుల షాపులు
  • పార్కులు, బీచ్ లు
  • బస్ స్టాండ్లు, సబ్ వే లు, రైల్ స్టేషన్లు
  • ఆఫీసులు
  • నివాస స్థలాలు

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ఈ సమాచారాన్ని ఉపయోగించి ప్రజా ఆరోగ్య సంస్థలు మహమ్మారిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటాయని గూగుల్ ఆశిస్తోంది.

ఈ సమాచారం ద్వారా అధికారులు కూడా తమ వృత్తిపరమైన నిర్ణయాలు, ప్రణాళికలు రచించుకునే అవకాశం ఉంటుందని, గూగుల్ తన బ్లాగ్లో తెలిపింది.

ప్రజా రవాణా సౌకర్యాల అవసరాన్ని గుర్తించి మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది.

వినియోగదారుల గోప్యతని పూర్తిగా దృష్టిలో పెట్టుకుని సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, మొబైల్ ఫోన్ వినియోగదారులు సమాచారం ఇవ్వకుండా ఉండే సౌలభ్యాన్ని ఎన్నుకోవచ్చు.

గూగుల్ సేకరిస్తున్న సమాచారం చూస్తే వినియోగదారులని ఆశ్చర్యానికి గురి చేస్తుందని బీబీసీ టెక్నాలజీ కరెస్పాండంట్ రోరి సెల్లాన్ జోన్స్ అన్నారు.

లాక్ డౌన్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సమాచారం అందిస్తుందని తెలిపారు.

ఈ సమాచారం ద్వారా ప్రజలు కూడా రద్దీగా ఉన్న ప్రాంతాలని తెలుసుకుని, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు నిర్ణయించుకోవచ్చు.

గూగుల్ మార్చ్ 29 వ తేదీన విడుదల చేసిన తొలి నివేదిక జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఉన్న డేటాతో సరి పోల్చి చూసింది. ఈ నివేదిక ప్రకారం యూకేలో వివిధ ప్రాంతాలలో రద్దీ శాతం గతంలో కంటే ఎంత తగ్గిందో పేర్కొంది.

  • రిటైల్, వినోద స్థలాల సందర్శన - 85 శాతం
  • నిత్యావసర వస్తువులు, మందుల దుకాణాలు - 46 శాతం
  • పార్కులు - 52 శాతం
  • ట్రాన్సిట్ స్టేషన్ లు - 75 శాతం
  • పని స్థలాలు - 55 శాతం
  • నివాస స్థలాలు - 15 శాతం పెరిగింది

ఫ్రాన్స్ లో తగ్గిన శాతం:

  • రిటైల్, వినోద స్థలాలు - 88 శాతం
  • గ్రోసరీ, మందులు - 72 శాతం
  • పార్కులు - 82 శాతం
  • ట్రాన్సిట్ స్టేషన్లు - 87 శాతం
  • పని స్థలాలు - 56 శాతం
  • నివాస స్థలాలు - 18 శాతం పెరిగింది

భారతదేశంలో ఇలా..

  • రిటైల్, వినోద స్థలాల సందర్శన - 77 శాతం
  • నిత్యావసర వస్తువులు, మందుల దుకాణాలు - 65 శాతం
  • పార్కులు - 57 శాతం
  • ట్రాన్సిట్ స్టేషన్ లు - 71 శాతం
  • పని స్థలాలు - 47 శాతం
  • నివాస స్థలాలు -22 శాతం పెరిగింది
గూగుల్ నివేదిక

ఫొటో సోర్స్, Google

వైరస్ ని అరికట్టడానికి టెక్నాలజీ సంస్థలు శాస్త్రజ్ఞులకు మరింత సమాచారాన్ని అందించాలని యూరోపియాన్ యూనియన్ ప్రధాన న్యాయ అధికారి వేరా జౌరోవా పిలుపునిచ్చిన తక్షణమే గూగుల్ ఈ పనిలో పడింది

తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి టెక్నాలజీ సంస్థలు కృషి చేయడం లేదని ఆమె విమర్శించారు.

“ఈ మహమ్మారి గురించి వచ్చే తప్పుడు సమాచారాన్ని ఇంకా చాలా ఆన్లైన్ సంస్థలు తమ లాభాల కోసం వాడుకుని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని” ఆమె అన్నారు

"దీనిని నిరోధించాలి. తప్పుడు సమాచారం ద్వారా లాభాలు ఆర్జించే సంస్థలకు స్వస్తి పలకాలి".

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)