కరోనావైరస్ - హైడ్రాక్సీ క్లోరోక్విన్: అమెరికాలో కోవిడ్-19 ఉద్ధృతి తగ్గించడానికి భారత్ సాయం చేస్తుందా?

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు

కోవిడ్-19పై పోరాటంలో కీలకంగా చెబుతున్న ఔషధం హెడ్రాక్సీ క్లోరీక్విన్‌ను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వినతి మేరకు ఆ దేశానికి ఎగుమతి చేసే విషయాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

డోనల్డ్ ట్రంప్ ఆదివారం భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు కావాలని కోరారు. అయితే, ఒక రోజు ముందే భారత్ ఈ ఔషధ ఎగుమతులను నిషేధించింది.

భారత్‌లో ఈ మందు పెద్ద ఎత్తున తయారుచేస్తారు. ట్రంప్, మోదీ మధ్య మంచి సంబంధాలుండడం.. ట్రంప్ ఇటీవల భారత్‌లో పర్యటించి ఘన స్వాగతం అందుకోవడం తెలిసిందే.

అయితే, భారత్ నిజంగానే అమెరికాకు సాయం చేసే స్థితిలో ఉందా? హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిజంగానే కరోనావైరస్ చికిత్సకు పనిచేస్తుందా?

ఇంతకీ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏమిటి? ఇది క్లోరోక్విన్ ఔషధం వంటిదే. మలేరియా చికిత్సకు ఉపయోగించే మందుల్లో ఇది కూడా ఒకటి.

రుమటాయిడ్ అర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధుల చికిత్సలోనూ ఉపయోగించే ఈ మందు కొన్ని దశబ్దాలుగా వైద్య పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

వైరస్ వల్ల వచ్చే వ్యాధుల చికిత్సలో ఇది పనిచేస్తుందా అనే కోణంలో పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, మోదీ, ట్రంప్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

‘చావుబతుకుల్లో ఉన్నవారికే వాడాలి’

ఈ ఔషధాన్ని కరోనావైరస్ చికిత్సలో వినియోగించడాన్ని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. అయితే, ఎఫ్‌డీఏ మాత్రం ఆయన మాటలను ఖండించింది.

ట్రంప్ ఆ తరువాత దీనిపై స్పందిస్తూ.. చావుబతుకుల్లో ఉన్న రోగులకు దీన్ని కారుణ్య పరిస్థితుల్లో వినియోగంచడానికి ఎఫ్‌డీఏ ఆమోదం ఉందని స్పష్టం చేశారు.

ప్రాణాలు పోయే అలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఈ మందును సూచించవచ్చని.. ఇది రిజిస్టర్డ్ డ్రగ్ అని ట్రంప్ చెప్పారు.

సింబాలిక్

ఫొటో సోర్స్, reuters

ఫొటో క్యాప్షన్, సింబాలిక్

మరి.. భారత్ ట్రంప్‌కు నిజంగానే సాయం చేస్తుందా?

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను నేరుగా మందుల దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చు. ఇది ఏమాత్రం ఖరీదైన ఔషధం కూడా కాదు.

అయితే, కోవిడ్-19 చికిత్సలో దీని పేరు వినిపించడం ప్రారంభమైన తరువాత దీన్ని కొనడం, వాడడంపై నియంత్రణలు పెరిగాయి.

ఆదివారం భారత్ ఈ ఔషధ ఎగుమతులపై ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తి నిషేధం విధించింది.

భారత్‌లోనూ కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీచేసింది.

కానీ, ఇప్పుడు ట్రంప్ వినతి నేపథ్యంలో భారత ప్రభుత్వం తన నిషేధ నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందుముందు మన దేశంలో ఈ ఔషధం ఎంతమేర అవసరమవుతుందన్న అంచనాలు వేసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని.. మంగళవారం నాటికి ఏదో ఒకటి నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ భారత మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

ఎగుమతి చేయగలమా?

ప్రపంచంలోనే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన భారత్ తన అవసరాలను దాటి ఇతర దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితుల్లో ఉందా? అంటే అవుననే అంటున్నారు భారత ఔషధ తయారీదారుల సంఘానికి చెందిన అశోక్ కుమార్ మదన్.

‘‘స్థానిక అవసరాలు, ప్రపంచ అవసరాలు తీర్చగలిగేటంతగా భారత్ ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేయగలిగే స్థాయిలోనే ఉంది. కానీ, దేశీయ అవసరాలకు మొదటి ప్రాధాన్యమివ్వాలి. అయితే, మనకు ఎగుమతి చేసే సామర్థ్యం మాత్రం ఉంది’’ అని బీబీసీతో చెప్పారాయన.

మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీలో వాడే ‘కీలక ఔషధ ముడిపదార్థం’ (ఏపీఐ) ఎగుమతిని చైనా నిలిపివేసిందన్న వార్తలను అశోక్ కుమార్ కొట్టిపారేశారు.

ఈ మందు తయారీలో వాడే ముడిపదార్థంలో 70 శాతం చైనా నుంచే భారత్‌కు వస్తుందన్నది నిజమేనని అంగీకరిస్తూనే ఆయన.. సముద్ర, వాయు మార్గంలో చైనా నుంచి ఈ ముడిపదార్థం ఎప్పటిలానే భారత్‌కు వస్తోందని చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌ స్పందించకపోతే ప్రతిస్పందన ఉంటుందన్న ట్రంప్

హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేయాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని భారత్ తిరస్కరిస్తే దానికి ప్రతిచర్య ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

"కోవిడ్-19పై తమ పోరాటంలో గేమ్-చేంజర్ అని భావిస్తున్న డ్రగ్ ఎగుమతిపై మా విజ్ఞప్తిని భారత్ తిరస్కరిస్తే, ఫర్వాలేదు. కానీ, దానికి తగిన ప్రతిస్పందన ఉంటుంది" అని డోనల్డ్ ట్రంప్ అన్నారు.

ట్రంప్ ఆదివారం మోదీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. భారత్ ఈ ఔషధాన్ని భారీ స్థాయిలో తయారు చేస్తుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

24 రకాల ఔషధ ముడిపదార్ధాలు, ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన భారత్

24 రకాల ఔషధ తయారీ ముడిపదార్ధాలు (ఏపీఐ), వాటితో తయారయ్యే ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు భారత్ వెల్లడించింది.

అయితే, ఈ జాబితాలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ లేదు అని భారత డ్రగ్ తయారీదారుల సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

ఇంతకీ ఇది నిజంగానే పనిచేస్తుందా?

కరోనావైరస్‌కు ఇది సరైన మందు అని ఇప్పుడే నిర్ధరణకు రావడం తొందరపాటే అవుతుందని వైరాలజిస్టులు, మరికొందరు నిపుణులు అంటున్నారు.

ప్రయోగశాల అధ్యయనాల్లో కరోనావైరస్‌ను క్లోరోక్విన్ కట్టడి చేసేలా కనిపించిందని.. ఇది కరోనావైరస్‌కు విరుగుడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కనిపించాయని కొందరు వైద్యులు చెప్పారని బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గలాగర్ అన్నారు.

అయితే, ఇది రోగులపై ఎలా పనిచేస్తుంది, మంచీచెడులేమిటనే విషయంలో పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ ఇంతవరకు జరగలేదు.

ప్రస్తుతం ఇలాంటి ట్రయల్స్ చైనా, అమెరికా, బ్రిటన్, స్పెయిన్‌లో జరుగుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు.

‘‘నిజంగానే ఇది ప్రభావం చూపితే అందుకు మన దగ్గరా తగిన ఆధారాలుండాలి. కానీ, మన దగ్గర అలాంటివి లేవు. అయితే, ఉన్నంతలో మెరుగైన ప్రభావం చూపుతుంది’’ అని సీనియర్ వైద్యులు డాక్టర్ జోయితా బసు అన్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సీనియర్ సైంటిస్ట్ రామన్ ఆర్ గంగాఖేద్కర్ దీనిపై మాట్లాడుతూ ప్రస్తుతం దీన్ని అందరికీ వాడరాదన్న ఆదేశాలున్నాయన్నారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

‘సొంత వైద్యంతో ప్రమాదం’

అయితే, దీనిపై ప్రయోగాలు ఇంకా ముగియక ముందే జనం తమకు తాము ఈ మందును తీసుకుంటున్నారు.. అలా చేయడం వల్ల కొన్నిసార్లు ప్రమాదకర పరిణామాలు సంభవిస్తున్నాయి.

సరైన మోతాదులో తీసుకోకపోతే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల ప్రమాదకరమైన దుష్ర్పభావాలు ఉంటాయని మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక కథనం హెచ్చరించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)