కరోనాపై ప్రభుత్వం ఎలా ‘యుద్ధం’ చేయబోతోంది? కంటైన్‌మెంట్ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గురుప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్ అంతా లాక్‌డౌన్ విధించినప్పటికీ ఇప్పటివరకూ 4 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇన్ని రోజుల అనుభవం తర్వాత, కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే, ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అక్కడ పనిచేయాల్సి ఉంటుందనే విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది.
దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే హాట్ స్పాట్లు గుర్తించింది. ఇప్పుడు అంతకంటే ఒక అడుగు ముందుకు వెళ్లి జిల్లా స్థాయిలో కంటైన్‌మెంట్ ప్లాన్ తీసుకుని వచ్చింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వివరాల ప్రకారం ఇప్పటివరకూ దేశంలో 274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
కంటైన్‌మెంట్ ప్లాన్ అంటే
ఇందులో ప్రాంతీయ స్థాయిలో ఎక్కడైతే ఒకేసారి ఎక్కువ కరోనా కేసులు బయటపడ్డాయో ఆయా ప్రాంతాలను గుర్తిస్తారు.
ఆ ప్రాంతం ఏదైనా గ్రామం, పట్టణం, నగరం కావచ్చు. అక్కడ మొదట ఒక చిన్న క్లస్టర్ లభించింది. కానీ ఇప్పుడు అక్కడ ఎన్నో క్లస్టర్‌లు ఏర్పడి ఉంటాయి.
తర్వాత కంటైన్‌మెంట్, బఫర్ జోన్ నిర్ణయిస్తారు.

కంటైన్‌మెంట్ అంటే కరోనా కేసులు ఎక్కువగా బయటపడిన జిల్లా, బఫర్ జోన్ అంటే ప్రభావిత జిల్లాలు లేదా గ్రామీణ జిల్లాలతో ఉన్న బ్లాక్. ఈ రెండింటికీ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు నిర్ణయిస్తారు. సులభంగా చెప్పుకోవాలంటే ఈ మొత్తం ప్రాంతాన్ని క్వారంటైన్ చేసేస్తారు.
కంటైన్‌మెంట్ కింద రోగుల కాంటాక్ట్ లిస్టింగ్, ట్రాకింగ్, వారి ఫాలోఅప్ చేస్తారు. రోగులకు దగ్గరగా వెళ్లినవారి కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తారు.
కంటైన్‌మెంట్ ఏరియాను కనీసం 28 రోజులపాటు సీల్ చేస్తారు. కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న ప్రజలందరూ హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.
కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ ప్లాన్ గురించి బీబీసీ హరియాణాలోని నోడల్ అధికారి ధ్రువ్ చౌధరితో మాట్లాడింది.
ఆయన “ఈ కంటైన్‌మెంట్ ప్లాన్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది మనం చైనాలోని వుహాన్, ఇటలీలోని మిగతా ప్రాంతాల్లో చూస్తే అర్థమవుతుంది. ఏదైనా ఒక మహమ్మారిని అడ్డుకోడానికి ఇది చాలా మంచి పద్ధతి. ఈ పద్ధతితో ప్రజలకు పెద్దగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. కానీ ‘నో పెయిన్, నో గెయిన్’ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి” అన్నారు.
“ఏ ప్రభుత్వం అయినా తన ప్రజలను ఇబ్బంది పెట్టాలని అనుకోదు. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలు అలా అసలు చేయవు. కానీ ఈ పరిస్థితిలో ఇలా చేయడం చాలా అత్యవసరం. వైరస్ వ్యాపించిన వారిని మిగతావారికి దూరంగా ఒంటరిగా ఉంచడనికి మేం ప్రయత్నిస్తున్నాం. వారి కాంటాక్టులు ట్రేస్ చేస్తాం. కంటైన్‌మెంట్ ప్లాన్ అమలు చేయడంలో మేం ఎలాంటి సడలింపు ఇవ్వకూడదు. కంటైన్‌మెంట్ ప్లాన్ ద్వారా కొత్త కేసులు రాకుండా అడ్డుకోగలమని మేం అనుకుంటున్నాం” అని ధ్రువ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హాస్పిటల్ కేర్
ఆస్పత్రులపై పడుతున్న భారం తగ్గించడానికి మూడు స్థాయిల్లో ఏర్పాట్లు చేశారు.
స్వల్ప లక్షణాలు ఉన్న కేసులను తాత్కాలిక, మేక్‌షిఫ్ట్ ఆస్పత్రుల్లో ఉంచుతారు. కోవిడ్-19 ఆస్పత్రులకు దగ్గరే ఉన్న హోటళ్లు, హాస్టళ్లు, స్టేడియంలు, గెస్ట్ హౌసులను వీరికోసం ఆస్పత్రులుగా మారుస్తారు.
కోవిడ్-19 కోసం డెడికేటెడ్ ఆస్పత్రి లేదా పెద్ద ఆస్పత్రుల్లో ఒక బ్లాక్ ఏర్పాటు చేస్తారు. కరోనా ప్రభావం మధ్యరకం నుంచి తీవ్రంగా ఉన్న కరోనా రోగులను ఈ ఆస్పత్రుల్లో చేరుస్తారు.
కొన్ని సీరియస్ కేసుల్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లేదా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరగచ్చు. వారికి క్రిటికల్ కేర్ అవసరం ఉంటుంది. కంటైన్‌మెంట్ జోన్‌లో ఈ సౌకర్యం లేకపోతే, ఆ జోన్‌కు దగ్గరగా ఉన్న ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులను గుర్తిస్తారు.
ప్రభుత్వం రూపొందించిన ఈ ప్లాన్ గురించి బీబీసీ డాక్టర్లతో మాట్లాడింది. దిల్లీలో సర్ గంగారామ్ ఆస్పత్రిలో డిపార్టుమెంట్ ఆఫ్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ ఎస్‌పీ బయోత్రా ప్రస్తుత సమయంలో అలా చేయడం చాలా అవసరం అన్నారు.
“మొదట మొత్తం దేశమంతా లాక్‌డౌన్ చేశారు. దానివల్ల ఏయే ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు బయటపడ్డాయో ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఉదాహరణకు దిల్లీలో నిజాముద్దీన్ లాంటివి. అక్కడ చాలామందికి పాజిటివ్ వచ్చింది. వారు ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాపించేలా చేశారు. అలా చేస్తే, కరోనా కమ్యూనిటీ లెవల్‌లో వ్యాపిస్తుందనే భయం ఉంటుంది. యూరప్, అమెరికాలో పరిస్థితి అంత ఘోరంగా మారడానికి కారణం అదే” అన్నారు.
“అందుకే, భారత్ సమయం ఉండగానే చర్యలు తీసుకోవాలి. అలాంటి ప్రాంతాలను గుర్తించి, వారిని ఐసొలేట్ చేయాలి. ఈ కంటైన్‌మెంట్ ప్లాన్‌తో అదే చేస్తున్నారు. ప్రాంతాలను వేరుగా చేసి క్వారంటైన్ చేస్తున్నారు. అలా ఈ వ్యాధిని మూడు నాలుగు వారాల్లో అదుపులోకిరావచ్చు. కేసులు ఏ ప్రాంతాల్లో బయటపడితే, వారిని అక్కడే ఉంచేయాలి. అలా వారు కమ్యూనిటీలో వైరస్ వ్యాపించేలా చేయకుండా అడ్డుకోవచ్చు. అలా ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది” అని బయోత్రా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసులు విపరీతంగా పెరిగితే
కంటైన్‌మెంట్ జోన్‌లో కేసులు ఎక్కువగా పెరిగితే, గుర్తించిన ఆస్పత్రుల సామర్థ్యం కూడా పెంచుతారు. ప్రైవేట్ ఆస్పత్రుల సాయం కూడా తీసుకుంటారు. కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రుల్లో కూడా పనులు మొదలుపెడతారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతారు.
ఈ కంటైన్‌మెంట్ జోన్ కోసం ప్రత్యేక పరీక్షను కూడా సిద్ధం చేశారు. దానిని రాపిడ్ యాంటీ బాడీ బేస్ బ్లడ్ టెస్ట్ అంటారు. ఒకే సమయంలో ఎక్కువమందికి పరీక్షలు చేయాల్సివస్తే, ఈ టెస్ట్ ఉపయోగించవచ్చు.
అవసరమైతే అలాంటి ప్రత్యేక టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజరీ కూడా జారీ చేస్తుంది.
కంటైన్‌మెంట్ ప్లాన్ ఎప్పటివరకూ ఉంటుంది?
చివరి కరోనా పాజిటివ్ రోగి బయటపడిన కనీసం నాలుగు వారాల తర్వాత వరకూ కొత్త కేసులు ఏవీ నమోదు కాకపోతే, ఈ ఆపరేషన్‌ను తగ్గిస్తూ వస్తారు. చివరి కరోనా రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత 28 రోజులకు కంటైన్‌మెంట్ ఆపరేషన్‌కు ముగింపు పలుకుతారు.
అయితే కంటైన్‌మెంట్ ప్లాన్ విఫలమై, కేసులు సంఖ్య పెరుగుతూ పోతుంటే.. రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని అడ్డుకడ్డ వేసే నిర్ణయం తీసుకుంటాయి. అవసరమైన చర్యలు చేపడతాయి.
వ్యూహంపై సామూహిక చర్చ
“ఆదివారం కోవిడ్‌కు సంబంధించిన కేబినెట్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ మెడికల్, స్టేట్ సర్వేలెన్స్, డిస్ట్రిక్ సర్వేలెన్స్ అధికారులు, స్టేట్ హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కంటైన్‌మెంట్ వ్యూహంపై చర్చించారు” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.
కరోనా కేసులు ఎక్కువగా బయటపడిన జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో తమ అనుభవాలను పంచుకున్నారు. కంటైన్‌మెంట్, బఫర్‌జోన్‌లను తాము ఎలా మేనేజ్ చేశామో చెప్పారు.
ప్రత్యేక బృందాల ద్వారా ఈ జోన్ల పరిధిలోకి వచ్చే ఇళ్లలో డోర్ టు డోర్ సర్వే చేశామని, కాల్ సెంటర్ ద్వారా వచ్చే యాత్రికులను ఎలా మానిటర్ చేసిందీ వారు చెప్పారు. రింగ్ ఫెన్సింగ్ ద్వారా హై రిస్క్ జనాభాను ఎలా మానిటర్ చేశారో వివరించారు.
కోవిడ్ కేసులకు స్పందించే విషయంలో ఒకేలా వ్యవహరించాలని కాబినెట్ సెక్రటరీ కలెక్టర్లు అందరికీ పిలుపునిచ్చారు. దానికోసం అన్ని జిల్లాల్లో ‘కోవిడ్-19 క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్’ రూపొందించాలని సూచించారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహారాష్ట్ర నుంచి తమిళనాడు - 1,200 కిలోమీటర్లు కాలినడకన ఇళ్లకు చేరిన యువకులు
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- లైట్లు ఆర్పేయాలన్న మోదీ మాట వినలేదని.. నలుగురు ముస్లిం సోదరుల మీద దాడి
- హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను భారత్ ఎగుమతి చేయకపోతే, తగిన ప్రతిస్పందన ఉంటుందన్న ట్రంప్
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









