ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: జనసేన తరఫున గెలిచిన 21 మంది ఎవరంటే..

ఫొటో సోర్స్, FB/janasenaparty
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 100 శాతం విజయాలను నమోదు చేసి ఎన్డీయే కూటమిలో కీలకంగా మారింది.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీచోటా గెలుపొందింది. ఒక్క చోట కూడా ఓడిపోలేదు.
టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు లభించాయి.
ఆయా స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపిన జనసేన అన్ని చోట్లా విజయాలను అందుకుంది. మరోసారి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని చేజిక్కించుకుంది.
2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని, 160కు పైగా స్థానాల్లో పోటీచేసిన జనసేన ఒకే ఒక్క స్థానంలో గెలిచింది.
జనసేన తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులు, వారి ప్రొఫైల్ ఏంటో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, affidavit.eci.gov.in
పాలకొండ: నిమ్మక జయకృష్ణ
జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ 13,291 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన వయస్సు 45 ఏళ్లు.
సమీప ప్రత్యర్థి, వైసీపీ నాయకురాలు వి. కళావతికి 61,917 ఓట్లు రాగా, జయకృష్ణకు 75,208 ఓట్లు వచ్చాయి.
జయకృష్ణ 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పట్టా పొందారు.
రెండు వేల పైచిలుకు ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి చంటిబాబు ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, @LokamMadhavi
నెల్లిమర్ల: లోకం నాగ మాధవి
జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి 39,829 ఓట్ల మెజార్టీతో వైఎస్సాఆర్‌సీపీ నాయకుడు బద్దుకొండ అప్పలనాయుడుపై గెలుపొందారు.
నాగ మాధవికి ఈ ఎన్నికల్లో 1,09,915 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి రెండు వేల ఓట్లు కూడా రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ రమేశ్ కుమార్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి.

ఫొటో సోర్స్, results.eci.gov.in
విశాఖపట్నం సౌత్: సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ భారీ విజయాన్ని సాధించారు. ఆయన సమీప వైసీపీ అభ్యర్థితో పోలిస్తే 64,594 ఓట్ల మెజార్టీ దక్కింది. వంశీకృష్ణకు 97,868 ఓట్లు పడ్డాయి.
2017లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌లో పీజీ పట్టా పొందారు.
రెండోస్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి గణేశ్ కుమార్ వాసుపల్లి 33 వేల పైచిలుకు ఓట్లను పొందారు.
ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, results.eci.gov.in
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
అనకాపల్లిలో జనసేనకు 65 వేలకు పైగా మెజారిటీ లభించింది.
ఇక్కడ నుంచి పోటీ చేసిన కొణతాల రామకృష్ణకు 1,15,126 ఓట్లు వచ్చాయి. వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్‌పై కొణతాల రామృష్ణ గెలిచారు.
కొణతాల రామృష్ణ అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీలో ఎంకామ్ చదివారు.

ఫొటో సోర్స్, @PanchakarlaBabu
పెందుర్తి: పంచకర్ల రమేశ్ బాబు
పంచకర్ల రమేశ్ బాబు 81,870 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
రమేశ్ బాబుకు 1,49,611 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి భగత్ పిరిడి మూడో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, results.eci.gov.in
యలమంచిలి: సుందరపు విజయ్ కుమార్
యలమంచిలిలో 1,09,443 ఓట్లు సాధించిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు.
వైసీపీ నాయకుడు ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు ఓడిపోయారు. ఆయనకు 60 వేల పైచిలుకు మాత్రమే ఓట్లు వచ్చాయి.
వృత్తిరీత్యా బిజినెస్ చేసే విజయ్ కుమార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు.
ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, @JanaSenaParty
పిఠాపురం: కొణిదెల పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 70 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
ఇక్కడ పవన్ కల్యాణ్‌పై వైసీపీకి చెందిన వంగ గీత పోటీ చేశారు.
పవన్ కల్యాణ్‌కు 1,34,414 ఓట్లు సాధించారు. వంగ గీతకు 64,115 ఓట్లు, మూడో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థికి గౌరీ మణికి 1,495 ఓట్లు పడ్డాయి.
పవన్ కల్యాణ్ వయస్సు 55 ఏళ్లు. వృత్తిరీత్యా సినీ నటుడు అయిన పవన్ కల్యాణ్ పదో తరగతి వరకు చదివారు.
నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఆయన చదువుకున్నారు.

ఫొటో సోర్స్, @pantham_nanaji
కాకినాడ రూరల్: పంతం వెంకటేశ్వర రావు(పంతం నానాజీ)
కాకినాడ నియోజకవర్గంలో వైఎస్సాఆర్‌సీపీ నాయకుడు కురసాల కన్నబాబు మీద పంతం వెంకటేశ్వర రావు(పంతం నానాజీ) గెలుపొందారు.
ఆయనకు 72 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ లభించింది. ఆయన వయస్సు 61 ఏళ్లు.
వ్యవసాయంతో పాటు కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ఈ స్థానంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం. వీరాస్వామి మూడో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, @DevaVaraPrasaad
రాజోలు: దేవ వరప్రసాద్
ఎస్సీ రిజర్వుడు స్థానమైన రాజోలులో 39వేల పైచిలుకు మెజార్టీతో దేవ వరప్రసాద్ గెలుపొందారు.
వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఓటమి పాలయ్యారు. ఆయనకు 56వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.
రిటైర్డ్ ఐఏఎస్ అయిన వరప్రసాద్ వయస్సు 64 ఏళ్లు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు.

ఫొటో సోర్స్, Giddi Satyanarayana @GiddiJSP
గన్నవరం: గిడ్డి సత్యనారాయణ
ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.
ఇక్కడ 96,108 ఓట్లు సాధించిన గిడ్డి సత్యనారాయణ, వైసీపీ నాయకుడు విప్పర్తి వేణుగోపాల రావును ఓడించారు.
33,367 ఓట్ల మెజార్టీతో జనసేన గెలిచింది.
బహుజన్ సమాజ్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, results.eci.gov.in
రాజానగరం: బత్తుల బలరామకృష్ణ
జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 34,049 ఓట్ల మెజార్టీతో వైసీపీ నేత జక్కంపూడి రాజాపై గెలుపొందారు.
కాంగ్రెస్ నాయకుడు ఎం. వెంకట శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచారు.
బత్తుల బలరామకృష్ణకు దాదాపు లక్షా 6 వేల ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాలలో జనసేన తరఫున గెలిచిన తొలి అభ్యర్ధి ఆయనే.

ఫొటో సోర్స్, results.eci.gov.in
నిడదవోలు: కందుల దుర్గేశ్
నిడదవోలులో కందుల దుర్గేశ్ నెగ్గారు. ఆయనకు 33,304 ఓట్ల మెజార్టీ దక్కింది.
ఇక్కడ వైసీపీ నాయకుడు జి. శ్రీనివాస్ నాయుడు 69,395 ఓట్లను సాధించి రెండో స్థానానికి పరిమితమయ్యారు.
ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నేత కస్తూరి సత్య ప్రసాద్ మూడో స్థానంలో నిలిచారు.
దుర్గేశ్ 1984లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. ఆయన వయస్సు 64 ఏళ్లు.

ఫొటో సోర్స్, results.eci.gov.in
నరసాపురం: బొమ్మిడి నారాయణ నాయకర్
నరసాపురంలో జనసేన పార్టీ 49,738 ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకుంది.
ఇక్కడ నారాయణ నాయకర్ 94,116 ఓట్లు సాధించారు.
వైసీపీ నేత నాగరాజ వరప్రసాద రాజు ఓడిపోయారు. ఈయనకు కేవలం 44378 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఫొటో సోర్స్, results.eci.gov.in
భీమవరం: రామాంజనేయులు పులపర్తి
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇప్పుడు జనసేన అభ్యర్థి రామాంజనేయులు 1,30,424 ఓట్లతో ఘన విజయం సాధించారు.
ఆయనకు 66,974 ఓట్ల మెజారిటీ లభించింది. ఆయనకు అంజిబాబు అనే పేరు కూడా ఉంది. వయస్సు 54 ఏళ్లు. విద్యార్హత పదో తరగతి.
ఇక్కడ వైసీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఆయనకు 63,450 ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, @BolisettiSrinu
తాడేపల్లిగూడెం: బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 62,492 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఆయన సమీప ప్రత్యర్థి, వైసీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణకు 53,951 ఓట్లు వచ్చాయి.
బొలిశెట్టి శ్రీనివాస్ వయస్సు 62 ఏళ్లు. ఆయనకు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా ఉంది. ఇంటర్మీడియట్ చదివారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎం. శేఖర్(బాబ్జీ) మూడో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, @DharmarajuPdr
ఉంగుటూరు: ధర్మరాజు పత్సమట్ల
ఉంగుటూరులో ధర్మరాజు పత్సమట్ల 1,08,894 ఓట్లతో విజయం సాధించారు.
ఆయన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత పుప్పల శ్రీనివాస రావు (వాసుబాబు)పై 44,945 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
కాంగ్రెస్ నుంచి పోటీచేసిన పాతపాటి హరికుమార రాజు మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఫొటో సోర్స్, @chirri_balaraju
పోలవరం: చిర్రి బాలరాజు
ఇక్కడ జనసేన, వైసీపీల మధ్య తీవ్రపోటీ నడిచింది.
చివరకు 7,935 ఓట్ల తేడాతో జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఓడిపోయారు.
చిర్రి బాలరాజుకు మొత్తం 1,01,453 ఓట్లు వచ్చాయి.
36 ఏళ్ల బాలరాజు, కాకతీయ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్.

ఫొటో సోర్స్, results.eci.gov.in
అవనిగడ్డ: మండలి బుద్ధప్రసాద్
ఈ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున మండలి బుద్ధ ప్రసాద్, వైసీపీ నుంచి రమేశ్ బాబు సింహాద్రి పోటీపడ్డారు.
అయితే, 46,434 ఓట్ల మెజార్టీతో బుద్ధప్రసాద్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఆయనకు మొత్తం 1,13,460 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ నేత అందె శ్రీ రామమూర్తి మూడో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, @mnadendla
తెనాలి: నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీలో కీలక వ్యక్తి అయిన నాదెండ్ల మనోహర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు.
ఇక్కడ మనోహర్‌కు 1,23,961 ఓట్లు, వైసీపీ నేత శివకుమార్‌కు 75,849 ఓట్లు పడ్డాయి.
జనసేనకు 48,112 ఓట్ల మెజార్టీ దక్కింది.

ఫొటో సోర్స్, results.eci.gov.in
కోడూరు: అరవ శ్రీధర్
ఎస్సీ రిజర్వుడు స్థానమైన కోడూరులో అరవ శ్రీధర్ 11,101 ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
ఇక్కడ వైసీపీ నుంచి కోరముట్ల శ్రీనివాసులు, కాంగ్రెస్ నుంచి దేవి గోసాల పోటీ చేశారు.
శ్రీధర్‌కు 78,594 ఓట్లు పడ్డాయి.

ఫొటో సోర్స్, Srenevasulu Aranii
తిరుపతి: ఎ. శ్రీనివాసులు
72 ఏళ్ల ఆరణి శ్రీనివాసులు ఈ నియోజకవర్గంలో 61వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.
వైసీపీ నాయకుడు భూమన అభినయ్‌కు 62,151 ఓట్లు వచ్చాయి.
జాతీయ జనసేన పార్టీ నాయకుడు శ్రీనివాసులు ఆలూరి మూడో స్థానంలో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- ఏసీ పేలి ఇల్లంతా కాలిపోయింది.. అసలు ఏసీ ఎందుకు పేలుతుంది.. పేలకుండా ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేదెవరు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
- చంద్రుడిపై ఆవల వైపు దిగిన చైనా స్పేస్‌క్రాఫ్ట్
- తేనెటీగలు అంతరించిపోతే మానవ జాతి ఏమవుతుందో తెలుసా?
- తెలంగాణ అనే పదం ఎక్కడ పుట్టింది? మియన్మార్ జోల పాటలో ఎందుకు వినిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















