ఒమిక్రాన్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో కేసులు రెట్టింపు, దిల్లీలో 10 వేలు దాటిన కొత్త కేసులు... మూడో వేవ్ మొదలైందా

ఫొటో సోర్స్, EPA
దేశంలోని పెద్ద నగరాల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దిల్లీ, ముంబయి నగరాల్లో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.
దిల్లీలో గత 24 గంటల్లో 10, 665 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది చనిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తాజా కేసులతో కలిపి దేశ రాజధానిలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 23, 307కు చేరింది. పాజిటివిటీ రేటు 11.88 శాతానికి పెరిగింది.
బుధవారం ఉదయం వరకూ దేశంలో మొత్తం 58,097 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఒక్క వారంలో కరోనా కేసుల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది.
ఈ కేసుల్లో దాదాపు మూడో వంతు దిల్లీ, ముంబయిలోనే ఉన్నాయి. దీంతో ఈ రెండు నగరాల్లో ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించకుండా మళ్లీ కర్ఫ్యూ, కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.
తమిళనాడులో జనవరి 6 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తామని, ఆదివారం పూర్తిగా షట్ డౌన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ పరిమితంగా ఆంక్షలు విధిస్తున్నారు.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలయ్యిందని, ఈ కొత్త వేవ్ పూర్తిగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల వస్తున్నట్లు కనిపిస్తోందని ఇండియా వాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ ఎన్‌కే ఆరోరా సోమవారం ఎన్డీటీవీతో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
దేశంలో ఒక్క మహారాష్ట్రలోనే 2 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దిల్లీలో చేసిన కోవిడ్ శాంపిల్స్ పరీక్షల్లో 81 శాతం ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు.
దీంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో డాక్టర్ల సెలవులు రద్దు చేశారు. పెరుగుతున్న కేసులు గత ఏడాది సెకండ్ వేవ్‌ను తలపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒమిక్రాన్ వల్ల కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇంతకు ముందు డేటా మిగతా వేరియంట్స్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వచ్చిన రోగులు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కొద్ది మందికే ఉంటుందని సూచించింది. కానీ కేసుల సంఖ్య పెరుగడం వల్ల ఆస్పత్రులపై ఒత్తిడి పడే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వారాంతం కర్ఫ్యూ విధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. దిల్లీలో జిమ్స్, సినిమా థియేటర్లను రాష్ట్ర ప్రభుత్వం గత వారమే మూసివేసింది. కొత్త వేరియంట్ వ్యాపించకుండా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన కొన్ని గంటలకే రాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూ నిర్ణయం ప్రకటించారు. నగరంలో కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల కోసం భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలు వాయిదా వేయం: ఈసీ
ప్రధాని నరేంద్ర మోడీతోపాటూ ఇంకా చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా గత కొన్ని వారాలుగా పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. వీరిలో చాలా మంద మాస్కులు లేకుండానే తిరిగారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌తోపాటూ ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నా, ఈసారి ఎన్నికలను వాయిదా వేయడం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రోజువారీ కేసులు 20 వేలు దాటితే లాక్‌డౌన్ అమలు చేయాలని ముంబయి అధికారులు భావిస్తున్నారు. నగరంలో మంగళవారం 10,860 కేసులు నమోదయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్‌లో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశంలోని 28 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ చెప్పింది.
గోవాలో కూడా కేసులు పెరగడంతో అధికారులు నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వల్లే ఇక్కడ కేసులు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో గత 8 రోజుల్లో కేసుల్లో 6.3 రెట్ల కేసులు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 29న పాజిటివిటీ రేటు 0.79 ఉండగా, అది జనవరి 5కు 5.03 శాతానికి చేరిందని ఆరోగ్య శాఖ వివరించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసుల్లో 108 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజులో కేసులు రెట్టింపు
తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి.
తెలంగాణలో మంగళవారం మొత్తం 482 కేసులు నమోదు కాగా, బుధవారం ఆ సంఖ్య 1052కు చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో మంగళవారం మొత్తం 122 కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 334కు చేరింది..
గత 24 గంటల్లో రాష్ట్రంలో 434 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర ట్విటర్ హ్యాండిల్లో ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తాజాగా, విజయనగరం జిల్లా కొత్తవలసలో ఉపాధ్యాయుడి సహా 19మంది విద్యార్థులకు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది.
కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో మొత్తం 60 మందికి పరీక్షలు చేయగా.. ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్కూలుకు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు.
ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 60 ఏళ్లకు పైబడి వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి జనవరి 10 నుంచి ముందుజాగ్రత్త డోసులు ఇస్తామని ప్రధాని మోదీ చెప్పినప్పటికీ, బూస్టర్ డోస్ గురించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
భారత్‌లో 2021 జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్‌లో అర్హులైన దాదాపు 63 శాతం మంది రెండు డోసుల టీకా వేసుకోగా, 90 శాతం మందికి పైగా కరోనా టీకా ఒక డోసు వేయించుకున్నారు.
జనవరి 3 నుంచి దేశంలో 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా టీకా వేయడం ప్రారంభించారు. దేశంలో టీకాకు అర్హులైన మొత్తం 7.40 కోట్ల మంది పిల్లలు ఉన్నారని ప్రభుత్వం చెప్పింది.
భారత్‌లో ఇప్పటివరకూ 3 కోట్లా 40 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 4,82,000 మరణాలు సంభవించాయి.

ఫొటో సోర్స్, Getty Images
టీకా వేసుకోని వారి జీవితాలు కఠినంగా మారుస్తా-మాక్రాన్
ఫ్రాన్స్‌లో కోవిడ్-19 టీకా వేసుకోని వారి జీవితాలను కఠినంగా మార్చాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు.
"నేను నిజంగా వాళ్లను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను, మేం దీన్ని చివరివరకూ కొనసాగిస్తాం" అని ఆయన ఫ్రాన్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
"టీకా వేసుకోమని నేను బలవంతం చేయడం లేదు, సామాజిక జీవితానికి వీలైనంత దూరం పెట్టడం ద్వారా వారు టీకా వేసుకునేలా నేను వారిని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను" అని ఆయన లీ పారిసియెన్ పత్రికకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
"నేను వాళ్లను(టీకా వేసుకోనివారిని) జైల్లో పెట్టను. కానీ, జనవరి 15 నుంచి మీరు రెస్టారెంట్లకు వెళ్లడం కుదరదు. మీరు కాఫీకి, థియేటర్‌కు వెళ్లలేరు. అందరితో కలిసి సినిమా కూడా చూడలేరు.. అని మేం వాళ్లకు చెప్పాలనుకుంటున్నాం" అన్నారు.
కానీ ఆయన తన ఇంటర్వ్యూలో ఉపయోగించిన భాష కఠినంగా ఉందని, దేశ అధ్యక్షుడికి అది తగదని విపక్షాలు అంటున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
టీకా వేసుకోని వారిని ప్రజా జీవితంలో అడ్డుకునేలా తీసుకొస్తున్న బిల్లుపై చర్చను ఎంపీలు అడ్డుకోవడంతో అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై సభ ఈ వారంలో ఓటింగ్ చేయాల్సి ఉంది. కానీ టీకాను వ్యతిరేకిస్తున్న వారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఎంపీలు తమకు చంపుతామని బెదిరింపులు వచ్చినట్లు కూడా చెప్పారు.
ఫ్రాన్సులో మంగళవారం 63,867 కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,694,804కు చేరింది.
చాలా యూరోపియన్ దేశాలు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశాయి. ఇందులో ముందున్న ఆస్ట్రియా వచ్చే నెల నుంచి 14 ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా వేసేందుకు సిద్ధమైంది. జర్మనీ కూడా అదే బాటలో వెళ్తోంది.

ఫొటో సోర్స్, EPA
యూజో: చైనాలో రెండో నగరంలో కోవిడ్ లాక్‌డౌన్
యూజో నగరంలో మూడు కోవిడ్ కేసులు బయటపడడంతో చైనా యూజోలో లాక్‌డౌన్ విధించింది.
ఈ ముగ్గురిలో ఎలాంటి కోవిడ్ లక్షణాలూ కనిపించలేదు.
మొత్తం కోటీ పది లక్షల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ప్రజా రవాణాను నిలిపివేశారు. అత్యవసర దుకాణాల మినహా మిగతా షాపులన్నీ మూసివేశారు.
షియాన్ నగరంలో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇక్కడ డిసెంబర్ 23 నుంచి ప్రజలను వారి ఇళ్లకే పరిమితం చేశారు.
చైనా త్వరలో కొత్త సంవత్సరం రానుండడం, బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండడంతో చైనా కఠిన నియంత్రణా చర్యలు చేపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఒకే రోజు 10 లక్షలకు పైగా కేసుల రికార్డ్
అమెరికాలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకే రోజు పది లక్షల కొత్త కేసులు నమోదైనప్పటికీ దేశంలో ఇంకా పీక్ ఇంకా రావాల్సి ఉందని నివేదికలు వస్తున్నాయి.
అమెరికాలో కేసులు భారీగా పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
సోమవారం అమెరికాలో 10,80,211 కొత్త కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం ప్రపంచంలో ఒకరోజు నమోదైన కరోనా కేసుల్లో ఇది అత్యధికం.
గత 24 గంటల్లో అమెరికాలో 483805 కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో ఎక్కువ కరోనా కేసులకు ఒమిక్రాన్ వేరియంటే కారణం అవుతోంది. మరోవైపు కేసులు భారీగా పెరుగుతున్నా స్కూళ్లు తెరిచి ఉంచాలని పిలుపునిచ్చిన అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు ఎదుర్కుంటున్నారు.
అయితే గత కొన్ని వారాలుగా ఆస్పత్రిలో మరణాల సంఖ్య మాత్రం ఇంతకు ముందు కేసులు పెరిగినప్పటితో పోలిస్తే తక్కువగానే నమోదవుతున్నాయి.
కానీ, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇక బ్రిటన్‌లో కూడా గత 24 గంటల్లో 1,57,758 కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- ఆస్కార్ రేసులో ఆశలు రేపుతున్న 15 సినిమాలివే...
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- జేమ్స్ బాండ్: డేనియల్ క్రెయిగ్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరు?
- కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- షారుక్ ఖాన్‌ను మహిళలు ఎందుకు ఇష్టపడతారు?
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












