కోవిడ్-19: పెరిగిన పాజిటివిటీ రేటు, దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం- Newsreel

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19 పాజిటివిటీ రేటు 0.5% కంటే ఎక్కువగా నమోదవుతున్నందున.. ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అమలు చేయాల్సిన ఆంక్షలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఉత్తర్వులు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.

కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు గతం కంటే పది రెట్లు సంసిద్ధతతో ఉన్నామని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వెంటిలేటర్లు, ఆక్సీజన్ వినియోగం పెరగట్లేదని ఆయన చెప్పారు.

సోనియా చేతుల్లో జెండా

ఫొటో సోర్స్, ANI

ఎగురవేసే సమయంలో జారి సోనియా గాంధీ చేతుల్లో పడిన కాంగ్రెస్ పార్టీ జెండా

కాంగ్రెస్ 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుండగా అది జారి ఆమె చేతుల్లో పడినట్లు ఏఎన్ఐ చెప్పింది.

ఈ ట్వీట్‌లో ఏఎన్ఐ ఆ ఘటనకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.

సోనియా గాంధీ జెండాను ఎగురవేయాలని ప్రయత్నించగా అది మొదట చిక్కుపడడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

దాంతో పార్టీ నేతలు చిక్కు తీయడానికి ప్రయత్నించినపుడు జెండా జారి సోనియా రెండు చేతుల్లో పడింది.

ఆ సమయంలో సోనియాతోపాటూ పార్టీ కోశాధికారి పవన్ భన్సల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.

తర్వాత పార్టీ కార్యకర్తలు దానిని తీసుకుని స్తంభం పైకి ఎక్కి దాన్ని కట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన జరిగిన సమయానికి అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాధ్రా, మల్లికార్జున ఖర్గే ఇతరులు ఉన్నారు.

వీడియో క్యాప్షన్, ఎగరాల్సిన పార్టీ జెండా సోనియా గాంధీ చేతిలో పడింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)