మెక్సికో: కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లి.. బైక్‌పై వచ్చి కాల్చి చంపిన దుండగులు

ఫొటో సోర్స్, Instagram
మెక్సికోలోని మొరెలొస్ రాష్ట్రంలో నటి, సింగర్ టానియా మెండోజాను దుండగులు కాల్చి చంపారు.
టానియా.. క్యుర్నవాకా నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ బయట తన పదకొండేళ్ల కుమారుడి కోసం మిగతా తల్లిదండ్రులతో కలిసి ఎదురుచూస్తున్నారు.
ఇంతలో ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. వారిలో ఒకరు ఆమెపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
టానియా వయసు 42 సంవత్సరాలు. ఆమె కుమారుడి వయసు 11 సంవత్సరాలు. ఫుట్‌బాల్ అకాడమీ నుంచి కుమారుడిని తీసుకెళ్లేందుకు ఆమె వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది.
2010లోనూ టానియాను, ఆమె భర్త, కుమారుడిని ఒకేసారి కిడ్నాప్ చేశారు. వారి కార్ వాషింగ్ సెంటర్ నుంచే వారిని అపహరించారు. అప్పుడు ఆమె కుమారుడి వయసు ఆరు నెలలు మాత్రమే.
అప్పటి నుంచి తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయని రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయంలో ఆమె అనేకసార్లు ఫిర్యాదు చేశారు.
అయితే, ఇప్పుడు టానియాను హత్య చేసింది ఎవరు? ఎందుకు చంపేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఆమెపై కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. కానీ ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదు.
లింగ వివక్షతోనే ఆమెను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, దానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
2005లో వచ్చిన 'లా మెరా రేనా డెల్ సుర్' సినిమాలో టానియా ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమాతో ఫేమస్ అయ్యారు. అనేక సోప్ ఓపెరాల్లో కూడా ఆమె కనిపించారు.
అయితే, ఇటీవల ఆమె సింగర్‌గా మాత్రమే కొనసాగుతున్నారు. ఐదు ఆల్బమ్‌లు విడుదల చేశారు.
అధిక నేరాలతో మెక్సికో సతమతమవుతోంది. చాలా నేరాలు డ్రగ్స్‌తో ముడిపడి ఉంటున్నాయి.
అయితే, పెరుగుతున్న మహిళల హత్యలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈ హత్యలను నియంత్రించలేకపోతోంది.
కేసులు నమోదు చేస్తున్నప్పటికీ దోషులకు శిక్ష పడటం లేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
- తబ్లీగీ జమాత్‌ను సౌదీ అరేబియా ఏ భయం కారణంగా నిషేధించింది?
- ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’
- ‘కొన్ని కులాల మహిళలు వక్షోజాలు కప్పుకోరాదని ఆంక్షలు.. ఉల్లంఘిస్తే రొమ్ము పన్ను’
- జేమ్స్ వెబ్: విశ్వ రహస్యాలను వెలుగులోకి తెచ్చే టెలిస్కోప్ ఇదేనా
- ‘పెళ్లి తరువాత అమ్మాయి పేరు, ఇంటి పేరు మార్చాలా? అబ్బాయి పేరూ మారిస్తే’
- ‘భారత సైన్యానికి లొంగిపోకపోతే మరో పాకిస్తాన్‌ను కూడా కోల్పోవాల్సి ఉండేది’
- భీకర సుడిగాలికి ఎగిరిపోయిన పెళ్లి ఫొటోలు, సర్టిఫికేట్లు 225 కిలోమీటర్ల అవతల దొరికాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















