సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి ఏడాది కావొస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పటికి వీడని మిస్టరీగానే మిగిలింది.
ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఐదు ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు పూనుకున్నప్పటికీ, ఇంతవరకూ విజయం సాధించలేదు.
34 ఏళ్ల సుశాంత్ 2020 జూన్ 14న తన ఇంట్లోనే చనిపోయారు. మొదట్లో ఇది ఆత్మహత్య అంటూ రిపోర్టులు వచ్చాయి. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.
ముంబై పోలీస్, బిహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ముంబయి పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సీబీఐ దర్యాప్తు ఫలితాలను ఇంకా వెల్లడించలేదు.
ఈ కేసులో పైకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్ సిండికేట్ కోణాన్ని ఎన్‌సీబీ పరిశోధిస్తోంది. ఇందులో అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చోటు ఉన్నట్లు ఇప్పటివరకు రుజువులు కనిపించలేదని ఈడీ చెబుతోంది.
ఇంతకీ ఈ కేసు ఏ దిశగా కదులుతోంది? దర్యాప్తు ఫలితాలు ఏం చెబుతున్నాయి? పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది... వందేళ్ల ఈ సంక్షోభానికి ముగింపు లేదా?
- ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా మహిళ లైలా ఖాలిద్
- శత్రువు తమపై ప్రయోగించిన మిసైళ్ల శకలాలతోనే రాకెట్లు తయారుచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ కథ
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)