బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?

ముస్లిం మహిళల ఫొటోలు

ఫొటో సోర్స్, Getty Images

వందలాది ముస్లిం మహిళల ఫొటోలను గిట్‌హబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది జనవరి 1న చెప్పారు.

దీని గురించి ముంబయి పోలీసులకు చెప్పిన ఆమె.. దోషులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"నేను ముంబయి పోలీస్ కమిషనర్‌తో, క్రైమ్ డీసీపీ రష్మీ కరాండీకర్‌తో మాట్లాడాను. దీనిపై దర్యాప్తు చేస్తామని వారు చెప్పారు. ఇందులో జోక్యం చేసుకోవాలని నేను మహారాష్ట్ర డీజీపీతో కూడా మాట్లాడాను. మహిళా వ్యతిరేకులు, సెక్సిస్టు సైట్ల వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు

దీనిని సుమోటోగా తీసుకున్నామని, దీనిపై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని ముంబయి పోలీసులు చెప్పారు

"ముంబయి సైబర్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారని ముంబయి పోలీసు అధికారి ఒకరు చెప్పినట్లు పీటీఐ తెలిపింది.

ట్విటర్‌లో చాలా చురుగ్గా ఉండే ఒక ముస్లిం మహిళలు 'బుల్లీ బాయి' యాప్‌లో అప్ లోడ్ చేసిన తమ ఫొటోల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

బుల్లీ బాయి యాప్ ఏంటి?

'బుల్లీ బాయి' అనే యాప్ గిట్‌హబ్ అనే ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది.

సోషల్ మీడియా యూజర్ల వివరాల ప్రకారం దీన్ని ఓపెన్ చేయగానే.. ముస్లిం మహిళల ముఖాలను బుల్లీ బాయి అనే పేరుతో చూపిస్తుంది.

ట్విటర్‌లో చురుగ్గా ఉండే మహిళల ఫొటోలు, పేర్లను ఇందులో ఉపయోగిస్తున్నారు. ఆ మహిళల ఫొటో కింద బుల్లీ బాయి అని రాస్తారు. ఈ యాప్ ద్వారా సదరు మహిళలతో డీల్ చేసుకోవచ్చని అందులో చెబుతున్నారు.

గిట్‌హబ్ అంటే ఏంటి?

నివేదికల ప్రకారం గిట్‌హబ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాం. ఇది యూజర్లు అప్లికేషన్ క్రియేట్ చేయడానికి, షేర్ చేసుకోడాన్ని అనుమతిస్తుంది. గిట్‌హబ్‌లో ఎవరైనా వ్యక్తిగత లేదా సంస్థ పేరుతో యాప్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి తోడు మనం ఆ యాప్‌ను గిట్‌హబ్ మార్కెట్ ప్లేస్‌లో అమ్మవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు.

ముస్లిం మహిళల ఫొటోలు

ఫొటో సోర్స్, Getty Images

'ద వైర్' జర్నలిస్ట్ ఇస్మత్ ఆరా ఈ ప్లాట్‌ఫాంలో ఉన్న తన ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌ను తన హ్యాండిల్లో షేర్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ఒక ముస్లిం మహిళగా నేను కొత్త సంవత్సరాన్ని ఈ భయం, అసహ్యంతో ప్రారంభించాల్సి రావడం చాలా బాధాకరం. అయితే ఈ #sullideals కొత్త వెర్షన్‌ నన్ను ఒక్కదాన్నే లక్ష్యంగా చేసుకోలేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉదయం నా ఫ్రెండ్ ఒకరు ఈ స్క్రీన్ షాట్ పంపించారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు" అని ఆమె ట్వీట్ చేశారు.

ఇస్మత్ దీనిపై దిల్లీ సైబర్ పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిల్లీ పోలీసులు కూడా తాము ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"ఈరోజు ఉదయమే ఈ యాప్‌ను బ్లాక్ చేశామని గిట్‌హబ్ చెప్పింది. సీఈఆర్టీ, పోలీసులు దీనిపై మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు" అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?

సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన ఆర్జే సైమా కూడా దీనిపై ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"సుల్లీ డీల్స్ తరహాలోనే బుల్లీ డీల్స్ యాప్‌లో నాతోపాటూ, ఎంతోమంది ముస్లిం అమ్మాయిల ప్రొఫైల్ ఉంది. నజీబ్ వాళ్ల అమ్మను కూడా వదల్లేదు. ఇది భారత్‌లో విచ్ఛిన్నమైన న్యాయ వ్యవస్థ, శిథిలమైన శాంతిభద్రతలకు ప్రతిబింబం. మనం మహిళలకు అత్యంత సురక్షితం కాని దేశంగా మార్చేస్తున్నామా?" అని ప్రశ్నించారు.

జర్నలిస్ట్ హిమా బేగ్ తన ట్విటర్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

"కరోనాతో మా నానమ్మను కోల్పోయిన తర్వాత నేను ఈరోజు మొదటిసారి ఆమె సమాధి దగ్గరకు వెళ్లాను. ఇంటికి వెళ్లడానికి కార్లో కూచోగానే, బుల్లీ డీల్స్‌లో మీ ఫొటోలను మరోసారి వేలం వేస్తున్నారు అని కొందరు ఫ్రెండ్స్ చెప్పారు. పోయినసారి దాన్ని అడ్డుకోడానికి ఏం చేయకపోవడంతో అది మళ్లీ జరుగుతోంది" అన్నారు.

"నన్ను నేను సెన్సార్ చేసుకున్నాను. నేను ఇప్పుడు దాదాపుగా మాట్లాడ్డం లేదు. అయినా కూడా నన్ను ఆన్‌లైన్లో అమ్మేస్తున్నారు. నాతో డీల్స్ చేస్తున్నారు. నేను ఈ దేశంలో సురక్షితంగా లేను. నా లాంటి ముస్లిం మహిళలు ఈ దేశంలో సురక్షితంగా లేరు. చర్యలు చూడ్డానికి మేం ఇంకా ఎన్ని ఆన్‌లైన్ డీల్స్ కావాల్సి ఉంటుందో. మాకు సాయం చేయండి" అన్నారు.

సుల్లీ డీల్స్

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

సుల్లీ డీల్ విషయంలో పోలీసులు ఏం చేశారు

గత ఏడాది జులైలో సుల్లీ డీల్స్ యాప్‌లో ఇలా ముస్లిం మహిళల ఫొటోలను అప్‌లోడ్ చేసినప్పుడు కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదులు ఏమయ్యాయి.

ఆగస్టులో బీబీసీ దీని గురించి ఒక కథనం రాసింది. అందులో ముస్లిం మహిళల ఆన్‌లైన్ వేధింపులపై నమోదైన కేసుల్లో పోలీసులు ఏం చేశారు అనేదానిపై పరిశోధన జరిపింది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా జులై 29న రాజ్యసభ ఎంపీ అబ్దుల్ వహాబ్ దీనిపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సమాధానం ఇచ్చింది.

"హోంశాఖ తరఫున షేర్ చేసుకున్న సమాచారం ప్రకారం దిల్లీ పోలీసులు 'సుల్లీ డీల్స్' కేసులో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు" అని చెప్పింది.

సుల్లీ డీల్స్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, అప్పటివరకూ ఆ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదనే విషయం బీబీసీ గుర్తించింది.

'సుల్లీ డీల్స్' మీద హనా మొహసిన్ ఖాన్ కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. సుల్లీ యాప్‌లో అప్‌లోడ్ చేసిన మహిళల ఫొటోలు, పేర్లలో హనావి కూడా ఉన్నాయి. దీంతో, ఆమె నోయిడా సెక్టార్-24లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటన జరిగిన నెల తర్వాత కూడా పోలీసులు ఆ కేసులో తమకు ఏమీ దొరకలేదని హనాకు చెప్పారు. ఎలాంటి బలమైన సమాచారం తమకు లభించలేదని ఆ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆమెకు తెలిపారు.

'సుల్లీ డీల్స్' కేసులో 'గిట్‌హబ్' ఏం చేసింది

'సుల్లీ డీల్స్' యాప్ లాగే ఇప్పుడు 'బుల్లీ బాయి' యాప్‌ను కూడా గిట్‌హబ్‌లోనే రూపొందించారు.

గత ఏడాది జులైలో బీబీసీ సుల్లీ డీల్స్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలతో ఈ-మెయిల్ ద్వారా గిట్‌హబ్‌ను సంప్రదించింది.

"మేం ఈ విషయంలో యూజర్ అకౌంట్లు సస్పెండ్ చేశాం. ఫిర్యాదుల ఆధారంగా దీనిపై దర్యాప్తు ప్రారంభించాం. వేధింపులు, వివక్ష లేదా హింసను ప్రోత్సహించే ఇలాంటి కంటెంట్‌కు గిట్‌హబ్ విధానాలు వ్యతిరేకం. మేం దానికి వ్యతిరేకంగా ఉంటాం. ఇలాంటి కంటెంట్ పెట్టడం మా విధానాలను ఉల్లంఘించినట్లే అవుతుంది" అని గిట్‌హబ్ చెప్పింది.

వీడియో క్యాప్షన్, ‘నాన్న నన్ను పాతిక వేలకు అమ్మేశారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)