కరోనావైరస్: బంగ్లాదేశ్‌లో వేలాది మంది సామూహిక ప్రార్థనలు... వైరస్ వ్యాప్తికి దారితీస్తుందన్న భయాందోళనలు

ఫొటో సోర్స్, AFP
బంగ్లాదేశ్‌లో బుధవారం సామూహిక ప్రార్థనల కోసం వేలాది మంది ప్రజలు ఒకచోట గుమిగూడటంతో.. ఇది కరోనావైరస్ విస్తృతంగా వ్యాపించటానికి దారితీస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఖురాన్ లోని ''స్వస్థత వాక్యాల'' పఠనం కోసం 10,000 మంది ముస్లింలు రాయపూర్ పట్టణంలో ఒక చోట గుమిగూడారని స్థానిక పోలీస్ చీఫ్ టోటా మియా ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.
అయితే.. అక్కడ దాదాపు 30,000 మంది జనం పోగయ్యారని ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఇటీవల మలేసియాలో ఒక మత కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 500 మందికి పైగా కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ కార్యక్రమం వల్ల పొరుగు దేశాలైన బ్రూనై, సింగపూర్, కంబోడియాల్లోనూ కొంత మందికి వైరస్ సోకింది.

దీంతో మలేసియా ప్రభుత్వం దేశంలో అన్ని రకాల ప్రజా సమావేశాలనూ నిషేధించింది. వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండటానికి సరిహద్దులను మూసివేసింది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో సామూహిక ప్రార్థనా కార్యక్రమం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇండొనేసియాలో కూడా ఈ వారాంతంలో జరగాల్సిన ఇదే తరహా సామూహిక మత కార్యక్రమాన్ని.. వైరస్ వ్యాప్తి చెందవచ్చుననే భయంతో రద్దు చేశారు.

ఫొటో సోర్స్, JUNAYED AL HABIB
ప్రార్థన.. రక్షణ
బంగ్లాదేశ్‌లో కరోనావైరస్ కారణంగా తొలి మరణం సంభవించిన సమయంలో, లక్ష్మీపూర్ జిల్లాలోని రాయపూర్ పట్టణంలో ఈ సామూహిక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇప్పటివరకూ ఈ దేశంలో 17 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే, ఈ సంఖ్య మీద చాలా మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రాయపూర్ సామూహిక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించటానికి అధికారుల నుంచి సంబంధిత నిర్వాహకులు అనుమతి పొందలేదని పోలీస్ అధికారి మియా పేర్కొన్నారు. నిజానికి బంగ్లాదేశ్‌లో ఇటువంటి స్థానిక సమావేశాల నిర్వహణకు అధికారిక అనుమతులు కోరటం చాలా అరుదు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

పట్టణంలో కొంత పలుకుబడి గల ఒక మత పెద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని స్థానికులు బీబీసీ బెంగాలీ ప్రతినిధి అక్బర్ హొస్సేన్‌తో చెప్పారు.
కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ప్రార్థనల్లో పాల్గొనాలని ఆయన స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ప్రార్థనలు చేసినందున వారికి ఇప్పుడు ''కరోనావైరస్ నుంచి విముక్తి'' లభించిందని కూడా ఆయన జనంతో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లోని దక్షిణ ప్రాంతంలో మత విశ్వాసాలు అధికమని బీబీసీ ప్రతినిధి చెప్తున్నారు. ''ఇస్లామిక్ ఉపదేశాలు, ప్రార్థనలు తమ సమస్యలను పరిష్కరించగలవ''ని అక్కడి జనం చాలా నమ్ముతారు.
ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. ఖురాన్‌లోని ఆరు స్వస్థత వాక్యాలను ఆ ప్రార్థనల్లో చదివారు.

ఫొటో సోర్స్, JUNAYED AL HABIB
సామూహిక వ్యాప్తి భయాలు
ఇండొనేసియాలోని సౌత్ సులావేసీలో గల గోవా అనే ప్రాంతంలో మార్చి 19 నుంచి 22 వరకూ మూడు రోజుల పాటు నిర్వహించాల్సి ఉన్న ఒక సామూహిక మత కార్యక్రమాన్ని రద్దు చేశారు.
ఆ కార్యక్రమం వల్ల వైరస్ సామూహికంగా విస్తరించే ప్రమాదం ఉందన్న భయంతో.. దానిని నిర్వహించవద్దని సంబంధిత నిర్వాహకులను ఒప్పించటానికి అధికార యంత్రాంగం రోజుల తరబడి ఒత్తిడి చేయాల్సి వచ్చింది.
చివరికి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయటానికి నిర్వాహకులు గురువారం నాడు అంగీకరించారు. కానీ అప్పటికే దాదాపు 10,000 మంది జనం కార్యక్రమం జరగాల్సిన ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో 474 మంది విదేశాల నుంచి కూడా వచ్చారు.
విదేశీయులను స్థానిక హోటళ్లలో 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాలని తాము భావిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఇక్కడి కార్యక్రమంలో పాల్గొన్న వారు తిరిగి తమ తమ ప్రాంతాలకు చేరినపుడు వారిని కూడా క్వారంటైన్ చేయాలని ఇతర రాష్ట్రాల అధికారులకు కూడా చెప్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఇప్పటివరకూ ఎవరికీ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఈ దేశంలో ప్రస్తుతం 309 నిర్ధారిత కేసులు ఉన్నాయి. వైరస్ వల్ల 25 మంది చనిపోయారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- మోదీ ప్రభుత్వం చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గించడం లేదు?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?
- నిర్భయ ఘటన: విషాదం, ఆగ్రహం కమ్మేసిన భారత్‌ను ఒక్కతాటి పైకి తెచ్చిన కేసు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








