కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని మహా నగరాల వీధులు ఇప్పుడెలా ఉన్నాయో చూడండి...

కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొన్ని దేశాలలో ప్రజా కదలిక పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తే మరి కొన్ని చోట్ల ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు

సాధారణంగా రద్దీగా ఉండే లండన్ మిలీనియం బ్రిడ్జి పై నడుస్తున్న మహిళ.

ఫొటో సోర్స్, HANNAH MCKAY / Reuters

ఫొటో క్యాప్షన్, సాధారణంగా రద్దీగా ఉండే లండన్ మిలీనియం బ్రిడ్జి పై నడుస్తున్న మహిళ. అవసరం లేని ప్రయాణాలు మాని ఇంటి వద్దనే ఉండాలని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రజలని కోరారు
Presentational white space
మెడిటరేనియన్ తీరంలో ఒంటరిగా కూర్చుని సముద్రాన్ని వీక్షిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, VALERY HACHE / Getty

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ నగరం నైస్‌లో, మెడిటరేనియన్ తీరంలో ఒంటరిగా కూర్చుని సముద్రాన్ని వీక్షిస్తున్న వ్యక్తి. మంగళవారం నుంచి ఫ్రెంచ్ ప్రజలు నిర్బంధంలో ఉండాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
Presentational white space
దుబాయ్‌లో సందర్శకులకు అనుమతిని మూసివేసిన సముద్ర తీరం.

ఫొటో సోర్స్, MAHMOUD KHALED / EPA

ఫొటో క్యాప్షన్, దుబాయ్ లో సందర్శకులకు అనుమతిని మూసివేసిన సముద్ర తీరం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ముఖ్యమైన బీచ్ లు, పార్కులు, సందర్శక స్థలాలని ప్రజలు సందర్శనకు వీలు లేకుండా మార్చ్ 31 వరకు మూసివేసింది. విదేశీ యాత్రికులకు వీసాల జారీని కూడా రద్దు చేసింది.
Presentational white space
మిలాన్‌లో ఎడారిని తలపిస్తున్న పియాజా డ్యూమో.

ఫొటో సోర్స్, DANIEL DAL ZENNARO / EPA

ఫొటో క్యాప్షన్, మిలాన్‌లో ఎడారిని తలపిస్తున్న పియాజా డ్యూమో. ఇటలీ ప్రభుత్వం ఇటలీ లో ఫుడ్ స్టోర్లు , మందుల షాపులు తప్ప మిగిలిన అన్ని పబ్లిక్ స్థలాలలో ప్రజల కదలిక పై నిర్బంధాన్ని విధించింది.
Presentational white space
ఢిల్లీ‌లో నిర్మానుష్యంగా మారిన సఫ్దర్‌జంగ్ సమాధి.

ఫొటో సోర్స్, ADNAN ABIDI / Reuters

ఫొటో క్యాప్షన్, ఢిల్లీ‌లో భారీగా ప్రజలు గుమిగూడటం పై ప్రభుత్వం నిషేధం విధించడంతో నిర్మానుష్యంగా మారిన సఫ్దర్‌జంగ్ సమాధి.
వెనెజ్వుల కరకాస్ లో ఖాళీగా ఉన్న ఫ్రాన్సిస్కో డి మిరాండా వీధి.

ఫొటో సోర్స్, Miguel Gutierrez / EPA

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలా కారకస్‌లో ఖాళీగా ఉన్న ఫ్రాన్సిస్కో డి మిరాండా వీధి. వెనెజ్విలా భద్రతా దళాలు ప్రజలని ఇంటి నుంచి బయటకి రావద్దని, వ్యాపార సంస్థల్ని మూసి ఉంచమని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు.
Presentational white space
మన్హట్టన్ లో ఖాళీ వీధి

ఫొటో సోర్స్, JEENAH MOON / REUTERS

ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ నగరంలో మూసేసిన స్కూళ్ళు, రెస్టారెంట్లు , బార్లు.
Presentational white space
మాడ్రిడ్ లో అల్కల డి హేనారెస్ నగరంలో గస్తీ కాస్తున్న సైనికులు.

ఫొటో సోర్స్, FERNANDO VILLAR / EPA

ఫొటో క్యాప్షన్, మాడ్రిడ్ లో అల్కల డి హేనారెస్ నగరంలో గస్తీ కాస్తున్న సైనికులు. స్పెయిన్ అంతటా ప్రజా కదలిక పై నిషేధం విధించారు. వారు కేవలం పనికి గాని, అత్యవసర సరుకులు కొనుక్కోవడం కోసం కానీ, మందుల కోసం కానీ మాత్రమే బయటకి వెళ్లేందుకు అనుమతి ఉంది.
Presentational white space
వియన్నా స్క్వేర్‌లో ఉన్న ఒక జంట

ఫొటో సోర్స్, HELMUT FOHRINGER / AFP

ఫొటో క్యాప్షన్, ఖాళీగా ఉన్న వియన్నా స్క్వేర్. ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఒకే చోట చేరడాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం నిషేదించింది
Presentational white space
సైడన్‌ కార్నిచ్ తీరం‌లో నడుస్తున్న కొంత మంది ప్రజలు.

ఫొటో సోర్స్, ALI HASHISHO / REUTERS

ఫొటో క్యాప్షన్, సైడన్‌ కార్నిచ్ తీరం‌లో నడుస్తున్న కొంత మంది ప్రజలు. లెబనాన్ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది
Presentational white space
థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్ చావ్ ప్రాయ నది పై బోట్ విహారం చేస్తున్న ఒక జంట. వైరస్ ప్రభావంతో తగ్గిన యాత్రికులు

ఫొటో సోర్స్, LILLIAN SUWANRUMPHA / AFP

ఫొటో క్యాప్షన్, థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్ చావ్ ప్రాయ నది పై బోట్ విహారం చేస్తున్న ఒక జంట. వైరస్ ప్రభావంతో తగ్గిన యాత్రికులు
Presentational white space
కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు .

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు