కరోనావైరస్ అప్‌డేట్: భారత్‌లో 360 కేసులు, 7 మరణాలు; ప్రపంచవ్యాప్తంగా 3,00,000లు దాటిన బాధితులు

ఫొటో సోర్స్, EPA
మార్చి 22వ తేదీ ఆదివారం వరకు అప్‌డేట్ అయిన వార్త ఇది. ఆ తర్వాతి సమాచారం/అప్‌డేట్ల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
కరోనావైరస్ 184 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి సోకిన వారి సంఖ్య 3,00,000 దాటింది. మృతుల సంఖ్య 13 వేలకు పైమాటే. అయితే, వైరస్ బారిన పడిన వారిలో 93 వేల మంది కోలుకున్నారన్న వార్త ఈ ఉపద్రవాన్ని మానవాళి జయించగలదన్న నమ్మకాన్నిస్తోంది.
ఇటలీలో శనివారం దాదాపు 800 కొత్త మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఈ దేశంలో ఇప్పటివరకు 4,825 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఒక్క లోంబార్డీ ప్రాంతంలోనే 3,095 మంది మృత్యువాత పడ్డారు.
స్పెయిన్‌లో ఒకే రోజు 394 మంది చనిపోయారు. ఈ దేశంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 28, 572కు చేరుకుంది. ఇప్పటి వరకు 1700లకు పైగా ప్రజలను వైరస్ బలి తీసుకుంది.
భారత్‌లో 7 మరణాలు
ఆదివారం నాడు భారతదేశంలో కరోనాకు మరో ముగ్గురు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 69 కేసులు నమోదు కాగా ఇద్దరు చనిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తెలంగాణలో ఈరోజు వరకు 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ మీడియా బులెటిన్ విడుదల చేశారు. అంటే, ఈ ఒక్క రోజే 6 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం మరో కేసు వెలుగు చూడడంతో కరోనా బాధితుల సంఖ్య 6కు చేరింది.

ఫొటో సోర్స్, Telangana Government
ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండూ మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. అంతకు ముందు పంజాబ్, ఆ తరువాత దిల్లీ రాష్ట్రాలు కూడా పూర్తి లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా అన్ని విధాలుగా పూర్తి లాక్‌డౌన్ పాటించాలని ఈ రాష్ట్రాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.

ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images
'సుదీర్ఘ యుద్ధానికి ఇది ఆరంభం' -మోదీ
'జనతా కర్ఫ్యూ ఈరోజు రాత్రి 9 గంటలకు పూర్తవుతుందని, అంతమాత్రాన ఇది మనం సంబరాలు చేసుకునే సందర్భం కాదని, సుదీర్ఘ పోరాటానికి ఇది ప్రారంభం మాత్రమేనని ప్రదానమంత్రి మోదీ అన్నారు.
లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాలలోని ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావద్దని మోదీ సూచించారు. మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతూ మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దిల్లీ లాక్ డౌన్.. మార్చి 31 వరకూ సకలం బంద్
ఇది అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అసాధారణ సందర్భమని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 వరకు దిల్లీలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆయన ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరకుల కొనుగోలుకు కొన్ని మినహాయింపులు ఉంటాయని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

దేశమంతా చప్పట్ల మోత... కరోనా నిరోధానికి సంఘీభావం
ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన దేశ ప్రజలు సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావాన్ని ప్రకటించారు. దిల్లీ, హైదరాబాద్, అమరావతి, విశాఖపట్నం వంటి పలు నగరాల్లో ప్రజలు బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా అయిదు గంటలకు చప్పట్లు కొడుతూ కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలతో సంఘీభావాన్ని ప్రకటించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి సాల్యూట్ అంటూ గంట మోగిస్తూ, ఆ దృశ్యాన్ని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
సినీనటుడు రామ్ చరణ్, "భారత ప్రజలతో చప్పట్లో గొప్పగా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్యూటిఫుల్" అంటూ చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఆయన భార్య ఉపాసన కొణిదెల ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ మెట్రో మార్చి 31 వరకు బంద్
కరోనావైరస్ ప్రభావం దిల్లీ మెట్రోపై పడింది. నిరంతరం రద్దీగా ఉండే దిల్లీ మెట్రో రైలు సేవలను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
తొమ్మిది లైన్లలో దాదాపు 350 కిలోమీటర్లు విస్తరించిన దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రతి రోజూ సగటను 15 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అదిస్తోంది. ఈ ప్రయాణికులు సగటున రోజుకు 17 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ఇప్పటికే అంతర్ రాష్ట్ర బస్సు సేవలను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే శాఖ కూడా మార్చి 22 నుంచి మార్చి 31 వరకు అన్ని ప్యాసెంజర్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్త పరిస్థితులు
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,00,000 దాటింది. 13,000లకు పైగా మంది చనిపోయారు. దాదాపు 92,000 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఇటలీలో శనివారం నాడు 800 మంది కరోనావైరస్ బారిన పడి చనిపోయారు. ఇటలీలో పరిస్థితి తీవ్రంగా ఉన్న లోంబార్డ్ ప్రాంతంలో జనాన్ని బయటకు రాకుండా నిషేధించారు. శుక్రవారం నాడు ఇటలీలో 627 కరోనా మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఈ దేశంలో ఇప్పటివరకూ కోవిడ్-19తో 4,832 మంది చనిపోయారు. స్పెయిన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఒకేరోజు ఇక్కడ 300 మరణాలు రికార్డు అయ్యాయి. మొత్తంగా ఆ దేశంలో ఇప్పటివరకు 1,326 మంది చనిపోయారు.
ఆస్ట్రేలియాలోని మహా నగరాలైన సిడ్నీ, మెల్‌బోర్న్‌లను అత్యవసర సేవలు మినహాయించి షట్ డౌన్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
భారత్‌లో మరో ఇద్దరు మృతి
భారతదేశంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నమోదు చేసిన వివరాల ప్రకారం 341 మందికి కరోనావారస్ సోకింది. అయిదుగురు చనిపోయారు. 23 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో 22 మందికి ఈ వ్యాధి నిర్థరణ అయింది. ఒక వ్యక్తికి రోగం నయం కావడంతో డిశ్చార్జి చేశారు. ప్రజందరూ ఆదివారం నాడు పూర్తిగా బంద్ పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 65 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఒకరు చనిపోయారు.
మహారాష్ట్రలో కోవిడ్-19తో బాధపడుతున్న 63 ఏళ్ల వ్యక్తి గత రాత్రి మరణించినట్లు ఏఎన్ఐ తెలిపింది. ఇది ఈ రాష్ట్రంలో కరోనావైరస్ కారణంగా సంభవించిన రెండో మృతి.
కరోనావైరస్ బారిన పడిన ఈ వ్యక్తికి డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
బిహార్‌లో కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్న 38 ఏళ్ల వ్యక్తి మరణించారు. కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణైన ఆ వ్యక్తి పట్నాలోని ఎయిమ్స్‌లో చనిపోయారు. రెండు రోజుల క్రితం ఆయన కోల్‌కతా నుంచి ఇక్కడకు వచ్చారని పట్నా ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ ప్రభాత్ కుమార్ సింగ్ వెల్లడించారు. అతడు గతంలో ఖతార్ వెళ్లివచ్చినట్లు తెలిసింది.
ఈ మరణంతో భారత్‌లో ఇప్పటివరకూ కోవిడ్-19 కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 341కి చేరింది.
దేశవ్యాప్తంగా ప్యాసెంజర్ రైళ్లను మార్చి 31 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రం మొత్తాన్ని మూసివేస్తున్నట్లు (లాక్ డౌన్) ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీచేశారు.
అయితే, అత్యవసర ప్రభుత్వ సేవలు, ఇతర అత్యవసర వస్తువులు (మందులు, ఆహార సామగ్రి) అందించే దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. ఈ ఆదేశాలను కఠినంగా అమలుచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరిక
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ లాంటి పరిస్థితులు తప్పవని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ హెచ్చరించారు.
సిడ్నీ బీచ్‌లలో శనివారం భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడం, దూరాన్ని పాటించకపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న మోరిసన్ ఈ హెచ్చరిక చేశారు. మహమ్మారిని అరికట్టేందుకు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోందని, ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మన అనుసరిస్తున్న విధానాలు ఎలా అమలవుతున్నాయో ఈ బీచ్ ఉదంతాన్ని బట్టే అర్థమవుతోందని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఇటలీలో చిక్కుకున్న 263 మంది భారత విద్యార్థులను తీసుకుని రోమ్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఆదివారం ఉదయం 9.15 గంటలకు దిల్లీ చేరుకుంది. వీరందరికీ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, ప్రాథమిక పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాత ఐటీబీపీ చావ్లా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో కోవిడ్-19 వ్యాధి సోకిన వారి సంఖ్య 341కి చేరుకుంది. ఇప్పటివరకు 23 మంది చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆరుగురు వ్యక్తులు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 8 గంటల వరకూ... విదేశాల నుంచి వచ్చిన 12953 మందిని గుర్తించారు. వీరిలో 2052 మంది 28 రోజుల నిర్బంధ లేదా ప్రత్యేక పర్యవేక్షణను పూర్తిచేసుకున్నారు. 10841 మంది ఇళ్ల వద్దే క్వారంటైన్ అయ్యారు. 60 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.
160మంది నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. 130మందికి కరోనావైరస్ సోకలేదని నిర్థరణైంది. మరో 25మంది నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 'ది ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్, 2020'ని ప్రభుత్వం విడుదల చేసింది.
తమ ఉద్యోగుల్లో సగం మంది ఒక వారం, సగం మంది మరోవారం ఆఫీసుకు వచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు జీవో 607ను విడుదల చేసింది.
సచివాలయంలో అయితే సెక్షన్ ఆఫీసర్లు, అంతకంటే తక్కువ ర్యాంకు వారు, శాఖాధిపతులు, జిల్లాల్లో అయితే ఎన్జీవోలు అంత కంటే తక్కువ ర్యాంకు వారికి ఈ సౌకర్యం కల్పించారు. ఇది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ల కంటే పై ర్యాంకు, ఇతర చోట్ల గెజిటెడ్ వారు తప్పకుంటా ఆఫీసుకు రావాలి.
60 ఏళ్లు దాటి రిటైర్ అయ్యాక సలహాదార్లుగా నియమితులైన వారు ఇంటి నుంచే పనిచేయవచ్చు.
50 ఏళ్లు దాటి, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలు ఉండి స్వయంగా క్వారైంటీన్లో ఉండాలనుకుంటున్న సిబ్బందికి ఏప్రిల్ నాలుగు వరకూ మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేకుండానే సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆఫీసుకు కూడా అందరూ ఒకేసారి వచ్చి ఒకేసారి వెళ్లకుండా, 9.30-4.30, 10-5, 10.30-5.30 ఇలా అరగంట తేడాలో రావాలని, దీనివల్ల అందరూ కలిసే అవకాశం తగ్గుతుందని తెలిపింది.
అత్యవసర సేవల సిబ్బందికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
ప్రారంభమైన జనతా కర్ఫ్యూ
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు.
దీంతో, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

మెట్రో రైలు సేవలను కూడా నిలిపివేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని కార్యాలయాలు మూసివేశారు.
రాత్రి 10 గంటల వరకూ అన్ని ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, ANI
దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రజలు జనతా కర్ఫ్యూను పాటిస్తున్నా కొందరు బయట రోడ్లపై తిరుగుతున్నారు.
దిల్లీలో అలా రోడ్లపైకి వచ్చిన వారిని ఆపుతున్న పోలీసులు... వారికి పువ్వులను ఇస్తూ, ఇంట్లోనే ఉంటూ ఈ కర్ఫ్యూకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తోడ్పాటునందించాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కూడా ఖాళీగా మారాయి.
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 315 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో 2 కొత్త కేసులు
కృష్ణా జిల్లాలో ఒకరికి, తూర్పు గోదావరిలో మరొకరికి కరోనావైరస్ సోకినట్లు నిర్థరించారు. వీరిలో ఒకరు దుబాయి నుంచి దిల్లీ, హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరుకున్నారు. మరొకరు లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి రాజమండ్రికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Mohd Zakir/Hindustan Times via Getty Images
'ఎక్కడి వారు అక్కడే ఉండండి' - మోదీ
'ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని, ఎక్కడి వారు అక్కడే ఉండాలి' అని ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు ఒక రోజు ముందు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.
"మీరంతా ఇప్పుడు ఏ నగరంలో ఉన్నారో కొద్ది రోజులు అక్కడే ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బస్టాండులు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారడం వల్ల ప్రజారోగ్యం గందరగోళంలో పడుతుంది. దయచేసి మీరు, మీ కుటుంబ సభ్యులు అవసరం లేనిదే ఇంటిని వదలి వెళ్ళవద్దు" అని ప్రధాని సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ కోవిడ్-19 రెగ్యులేషన్స్-2020 విడుదల
తెలంగాణలో 22 మందికి ఈ వ్యాధి నిర్థరణ అయింది. అయితే, శనివారం మొదటిసారిగా ఒక స్థానికుడికి కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు. పేషెంట్ నంబర్ 14తో కలిసిన ఒక వ్యక్తికి కరోనా సోకిందని నిర్థరించారు. కోవిడ్ వ్యాధికి గురైన వారిలో ఒకరు డిశ్చార్జి అయ్యారు.
వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. 1897 నాటి ఎపిడమిక్ చట్టానికి లోబడి, 'తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ కోవిడ్-19 రెగ్యులేషన్స్-2020'ను విడుదల చేసింది.
కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వ సంస్థలు, పౌరులు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. దీని ప్రకారం అనుమానితులపై స్వయంగా తమకు తామే ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి వచ్చింది.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ఈ జీవో-13 ప్రకారం వైద్య సంస్థలు, స్థానిక సంస్థలు, పోలీసులకు అదనపు అధికారాలు దక్కాయి. ప్రైవేటు ఆసుపత్రులపై కూడా పరీక్షలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా, సహకరించని వారిపై ఐపిసి-188 సెక్షన్ (ప్రభుత్వం ఆదేశాలకు పౌరులు బద్ధులై ఉండాలి) కింద కేసులు కూడా నమోదు చేయవచ్చు.

ఫొటో సోర్స్, I&PR Telangana
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, "ఇప్పటివరకు 11,,000 మందిని క్వారెంటైన్ కేంద్రాలకు తరలించాం. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తాం. షట్ డౌన్ చేయడానికి కూడా సిద్ధమే" అని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు కేసులు మినహా కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 64 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో ఒకరు చనిపోయారు.
కేరళలో 43 మంది కోవిడ్-19తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ముగ్గురికి వ్యాధి నయం కావడంతో డిశ్చార్జి చేశారు.

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి సర్వే
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఆస్పత్రుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో పాజిటివ్ కేసు వచ్చిన చోట, ఆ ఇంటి నుంచి ౩ కిమీ వరకూ జల్లెడ పట్టారు. మొత్తంగా 335 బృందాలు 25,950 ఇళ్లు సర్వే చేశాయి. ఆ ప్రాంతంలో మరెవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. కొన్ని జిల్లాల్లో అవగాహన కోసం స్వయం సహాయక బృందాల సేవలను వినియోగించుకుంటున్నారు. నెల్లూరు, ప్రకాశంలో జిల్లాలో పాజిటివ్ కేసుల నివాస స్థలం నుంచి ౩ కిమీ పరిధిలో సర్వే పూర్తి చేసి, అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచారు.
ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఒంగోలులో సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విశాఖ విమానాశ్రయాన్ని తనిఖీ చేశారు.
విదేశాల నుంచి 12,421 మంది ఆంధ్రకు వచ్చారనీ, వారిలో 7,000 మంది ఇప్పటికీ 14 రోజులు క్వారంటైన్లో ఉన్నారని ఏపీ వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర రెడ్డి ప్రకటించారు. సంపర్క్ క్రాంతి రైలులో తొమ్మిది మంది ఏపీ వాళ్లున్నారనీ, వారిని ఐసోలేషన్లో ఉంచామని ఆయన చెప్పారు. ఇతర దేశాల వారికి విశాఖలో క్వారంటైన్ సౌకర్యం పెట్టినట్టూ, అసవరమైతే కాలేజీ హాస్టళ్లను కూడా వాడతామనీ ఆయన ప్రకటించారు.

ఫొటో సోర్స్, facebook
తిరుమలలో భారీగా మిగిలిన లడ్డూలు
ఉగాది కానుకగా ఈనెల 25వ తేదీన శ్రీవారి లడ్డూలు తమ ప్రతి ఉద్యోగి కుటుంబానికి ఉచితంగా అందించాలని టీటీడీ నిర్ణయించింది.
కరోనావైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి దర్శనాలు నిలిపివేయడంతో లడ్డూలు భారీగా పేరుకుపోయాయి. వీటిని తమ ఉద్యోగులకు ఉచితంగా అందచేయాలని టీటీడీ నిర్ణయించుకుంది.
తిరుమల శ్రీవారి లడ్డూకు ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు. దీనికి అదనంగా ఎన్నయినా కొనుక్కునే అవకాశం ఉంది.
భక్తుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం నిత్యం లక్షల్లో లడ్డూలను తయారు చేసి నిల్వ ఉంచుతుంది. ఆలయం మూసివేతకు ముందే దాదాపు రెండు లక్షల లడ్డూలను దేవస్థానం సిద్ధం చేసి ఉంచింది. తిరిగి ఆలయంలోకి భక్తుల ప్రవేశం ఎప్పుడన్నది కచ్చితంగా తెలియదు.
ఈ పరిస్థితుల్లో ఉన్న నిల్వలను సిబ్బందికైనా పంచిపెడితే వారు సంతోషిస్తారని దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనావైరస్ రోగులున్నారనే అనుమానంతో రైలను ఖాజీపేటలో నిలిపివేశారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు అనుమానిత రోగులను హైదరాబాద్ తరలించారు.
హైదరాబాద్ నుంచి దిల్లీకి వెళ్తున్న ఈ రైలులో ఇద్దరు అనుమానిత కరోనావైరస్ రోగులను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఏప్రిల్ 5 వరకూ ఎక్కడికీ వెళ్లవద్దని వికారాబాద్‌లో డాక్టర్లు వేసిన ముద్ర వీరి చేతిపై ఉండటాన్ని గుర్తించిన ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. ఖాజీపేటలో వీరిని దింపిన రైల్వే పోలీసులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వారు ప్రయాణించిన బోగీలోని ప్రయాణికులను వేరే బోగీలోకి మార్చి, దాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. ప్రస్తుతం ఖాళీ బోగీతోనే రైలు దిల్లీకి బయలుదేరింది.

సింగపూర్ నుంచి 125 మంది తెలుగువారు విశాఖకు చేరుకున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో సింగపూర్ నుంచి నడిచే విమాన సర్వీసును కొద్ది రోజులుగా రద్దు చేశారు. కానీ, అక్కడ చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి రప్పించాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఓ ప్రత్యేక విమానం ద్వారా వారిని విశాఖ పట్నం ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు.
వీరికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడానికి ఆరుగురు వైద్యుల బృందం, అంబులెన్సులు విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఉదయం 8 గంటల వరకూ 1006 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరిలో 259 మంది 28 రోజుల నిర్బంధ లేదా ప్రత్యేక పర్యవేక్షణను పూర్తిచేసుకున్నారు. 711 మంది ఇళ్ల వద్దే క్వారంటైన్ అయ్యారు. 36 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.
135మంది నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. 108మందికి కరోనావైరస్ సోకలేదని నిర్థరణైంది. మరో 24మంది నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
తెలంగాణలో శుక్రవారం ముగ్గురికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్థరణ అయింది. దీంతో, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు లండన్ నుంచి తిరిగి వచ్చిన మహిళ. ఇద్దరు దిల్లీ మీదుగా కరీంనగర్ వచ్చిన ఇండొనేషియా బృందంలోని సభ్యులు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యవసర సేవల విభాగాలు తప్ప అన్ని ప్రైవేట్, కార్పొరేట్ కార్యాలయాలను మూసి ఉంచారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండొద్దంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

ఫొటో సోర్స్, ANI
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని షాహీద్ మదన్ లాల్ ధింగ్రా బస్ స్టేషన్ నిర్మానుష్యంగా మారిపోయింది.
ప్రభుత్వోద్యోగులు రెండువారాల పాటు పార్ట్ టైమ్ పనిచేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఏర్పాటు అత్యవసర సేవల విభాగాలు తప్పించి మిగిలిన అన్ని విభాగాలకు వర్తిస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం తెలిపారు.
ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 49 మంది కరోనావైరస్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, హైదరాబాద్‌లోని సీసీఎంబీని కరోనావైరస్ నిర్థరణ పరీక్షలకు ఉపయోగించుకునేందుకు అనుమతించాలని కోరారు.
విదేశాలకు వెళ్లి వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన భార్యను క్వారంటైన్లో ఉంచాలని జిల్లా వైద్యాధికారి ఆదేశించారు.
ఈనెలాఖరు వరకూ అన్ని సినిమా షూటింగులూ నిలిపివేస్తున్నట్లు తెలుగు పిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. థియేటర్లు కూడా మూసి ఉంటాయని తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాలలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను విరమించుకోవాలని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కోవిడ్ -19
లఖ్‌నవూ లో శుక్రవారం నాడు నలుగురు వ్యక్తులు కరోనావైరస్ బారిన పడినట్లు నిర్థరణ అయింది. వారిలో బాలీవుడ్ గాయని కనికా కపూర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
కనికా మార్చి 9న లండన్ నుంచి వచ్చారు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయించుకున్నారు. అయితే, అప్పటికి కోవిడ్-19 లక్షణాలు బయట పడలేదని ఆమె చెప్పారు.
కనికా కపూర్ లఖ్‌నవూలో రెండు మూడు పార్టీలలో పాల్గొని పాటలు పాడారు. ఆ వేడుకలకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆమెకు వైరస్ సోకిందని తేలడంతో నగరంలో భయాందోళనలు పెరిగాయి.
'నేను ఆ పార్టీకి హాజరయ్యాను' -వసుంధరా రాజె
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజె, తాను తన కుమారుడు దుష్యంత్, అతడి అత్తా మామలతో కలిసి కనికా కపూర్ పాల్గొన్న పార్టీకి వెళ్ళానని ట్వీట్ చేశారు. "దురదృష్టవశాత్తు కోవిడ్19 సోకిన కనికా కపూర్ పార్టీకి హాజరయ్యాం. దాంతో, నేను, నా కుమారుడు అప్రమత్తమయ్యాం. స్వీయ నిర్బంధంలో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని ఆమె ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద కూడా కనికా కపూర్ పాల్గొన్న పార్టీకి వెళ్ళారు. దాంతో, ఆయన కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
కేరళలో మరో 12 మందికి కోవిడ్... చండీగఢ్‌లో కొత్తగా 5 కేసులు
ఇదిలా ఉంటే,చండీగఢ్‌లో అయిదు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు విదేశీ ప్రయాణాలు చేసిన వారు కాగా, మిగతా ముగ్గురికి స్థానికంగా వైరస్ సోకింది. హర్యానాలో అయిదుగురికి, పంజాబ్‌లో ముగ్గురికి వైరస్ నిర్థరణ అయిందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 13
కేరళ రాష్ట్రంలో శుక్రవారం మరో 12 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్థరించారు. ఎర్నాకుళంలో 5, కాసరగోడ్‌లో 6, పాలక్కాడ్‌లో ఒకరికి కోవిడ్-19 ఉన్నట్లు గుర్తించారు. దీంతో కేరళలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 40కి చేరిదంని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/DrTamilisaiBJP
'జనతా కర్ఫ్యూ పాటించండి... అప్రమత్తంగా ఉండండి' - తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం రాజ్‌భవన్‌లో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కరోనావైరస్‌ను ఎదుర్కోవడం గురించి మాట్లాడారు. కరోనావైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, అయితే జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
స్వీయ సంరక్షణే అత్యుత్తమ సంరక్షణ అని, ప్రజుల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లు అని చెప్పిన గవర్నర్, "కోవిడ్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలందరూ ఇళ్ళల్లో ఉంటే అందరికీ ఆరోగ్యకరం. తెలంగాణ రాజ్ భవన్ జనతా కర్ఫ్యూ పాటించేందుకు సిద్ధం అవుతోంది" అని అన్నారు. ఈ సందర్భంలో దేశంలోని యువత ఆరోగ్య రక్షణ కోసం యుద్ధం చేయాలని చెబుతూ వైరస్ నివారణ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలన్న హైకోర్టు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
శనివారం జరగాల్సిన పరీక్ష యథావిధిగా జరుగుతుంది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వ సూచించింది.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 మధ్య నిర్వహించాల్సిన పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది
దీనిపై ప్రభుత్వం తన స్పందన తెలియజేయాల్సి ఉంది.
దేశంలో కరోనా లక్షణాలు కనిపించినవారిలో ఇప్పటివరకు 206 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.
శుక్రవారం(మార్చి 20) ఉదయం 10 గంటల సరికి 14,376 శాంపిళ్లు పరీక్షించారు.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ఏపీలో ముగ్గురికి..
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేస్ నమోదైంది. విశాఖ జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తి శాంపిళ్లను పరీక్షించగా కరోనా ఉన్నట్లు నిర్ధరణైంది.
ఈ మేరకు విశాఖ జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించారు.
ఇంతకుముందు ఏపీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరికి కరోనా సోకింది.
ఇప్పటివరకు 119 శాంపిళ్లు పరీక్షించగా ముగ్గురికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 104 శాంపిళ్లు నెగటివ్‌గా తేలాయి. మరో 12 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది.
తెలంగాణలో 18 మందికి..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కి చేరింది. లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలినట్లు గురువారం రాత్రి తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చెప్పింది.
ఏపీలో అన్ని ఆలయాల్లో దర్శనాల నిలిపివేత
ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల, అన్నవరం, సింహాచలం, ఒంటిమిట్ట సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దర్శనాలను నిలిపివేశారు.
సింహాచలంలో ప్రతి రోజూ సుప్రభాతం, ఆరాధన, మేలుకొలుపు, పవళింపు వంటి సేవలన్నీ యథావిధిగా నిర్వహిస్తారని.. భక్తులకు దర్శనాలు నిలిపివేసినందున ఎవరూ రావొద్దని దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు కోరారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్నందున విజయవాడ దుర్గ గుడిలో మార్చి 31 వరకు అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు.
20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా
భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ శుక్రవారం ఉదయం 9 గంటల వరకు అందించిన డేటా ప్రకారం 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 195 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది.
అందులో నలుగురు మరణించగా 20 మందికి వ్యాధి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 44, కేరళలో 26, ఉత్తర ప్రదేశ్ 18, తెలంగాణలో 16, కర్నాటకలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, www.mohfw.gov.in
పాకిస్తాన్‌లో..
పొరుగు దేశం పాకిస్తాన్‌లో కరోనావైరస్ విజృంభణ తీవ్రమైంది. ఆ దేశంలో 458 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కాగా అందులో ముగ్గురు మరణించారు.
జీ7.. వీడియో కాన్ఫరెన్స్
ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన జీ7 దేశాల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో నిర్వహించాలని అమెరికా నిర్ణయించింది.
ముందు అనుకున్నట్లుగా అయితే క్యాంప్ డేవిడ్‌కు మిగతా ఆరు దేశాల ప్రతినిధులు వచ్చి సమావేశం కావాల్సి ఉంది. కానీ, కరోనావైరస్ నేపథ్యంలో దీన్ని వీడియో కాన్ఫరెన్సుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వైట్ హౌస్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 14

ఫొటో సోర్స్, TelanganaCMO
మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారంతా క్వారంటైన్లకు రావాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. థియేటర్లు, వివాహ వేదికలు, బార్ల మూసివేత గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని చెప్పారు.
మతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాదర్థనా మందిరంలోకీ భక్తులను అనుమతించవద్దని సీఎం అన్నారు.
ఉగాది ,శ్రీరామ నవమి వేడుకలు కూడా రద్దు చేశామని, వాటిని ప్రజలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడవచ్చని తెలిపారు.
మార్చి 1 నుంచి విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే స్వగ్రామాలు, ఇళ్లకు చేరుకున్న వారు స్వచ్ఛందంగా క్వారంటైన్లకు రావాలని కోరారు.
కరోనావైరస్ సోకిన వారు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నందున రాష్ట్ర సరిహద్దులో 18 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. వారందరూ బయటి నుంచి వచ్చినవారేనని తెలిపారు.
పదో తరగతి పరీక్షలు షెడ్యూలు ప్రకారం కొనసాగిస్తామన్నారు.

ఫొటో సోర్స్, facebook
భక్తులకు తిరుమల ఆలయం మూసివేత
కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవాళ (మార్చి 19) మధ్యాహ్నం టీటీడీ అధికారులు అత్యవసరం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవాళ సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే.. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని టీటీడీ తెలిపింది. అలాగే, ఇప్పటి వరకు టైమ్ స్లాట్లు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ పీఆర్వో బీబీసీకి చెప్పారు.
రేపు ఉదయం నుంచి రెండు ఘాట్ రోడ్లను మూసివేస్తామని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ళ నాని చెప్పారు.
రాష్ట్రంలో సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేస్తున్నామని తెలిపారు.
సాధ్యమైనంత మేరకు వివాహాలను వాయిదా వేసుకోవాలని, తప్పనిసరైతే తక్కువ మందితో వేడుకలు జరుపుకుంటే మంచిదని మంత్రి సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
యాదగిరిగుట్టలో మార్చి 31 వరకూ ఆర్జిత సేవల రద్దు
తెలంగాణలో బుధవారం ఒక్క రోజే ఎనిమిది కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 13కు చేరుకుంది. ఇండోనేషియా పౌరులు ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్థరించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా సోకిన 13 మందిలో 8 మంది ఇండోనేషియా పౌరులు ఉన్నారు. అయిదుగురు భారతీయులు ఉన్నారు. స్కాట్లండ్ నుంచి వచ్చిన మేడ్చల్ వాసితో పాటు కరోనావైరస్ సోకినట్లు అంతకు ముందు నిర్ధరణ అయిన ఆరుగురిలో ఒకరికి ఇప్పటికే వ్యాధి నయమైంది. దాంతో, ఆ వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 13 మందికి చికిత్స కొనసాగుతోంది.
శంషాబాద్ విమానాశ్రయంలో నిన్నటి వరకూ మొత్తం 70,545 మందిని పరీక్షించారు. విదేశాల నుంచి వచ్చిన అందర్నీ ఇంట్లోనే క్వారంటైన్ చేస్తున్నారు.
యాదగిరిగుట్ట దేవాలయంలో మార్చి 31 వరకూ ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేశ ఖండన కూడా రద్దు. దర్శనాలకు మాత్రం యథావిధిగా అనుమతిస్తున్నారు.
తెలంగాణ సచివాలయంలోకి సందర్శకులను అనుమతించడం లేదు.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి:
ఆస్పత్రుల్లో అబ్జర్వేషన్లలో ఉన్న వారు: 435
28 రోజుల అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్న వారు: 306
ఇప్పటి వరకూ పరీక్షించిన శాంపిళ్లు: 447
వ్యాధి నిర్ధరణ అయిన వారు: 6
వ్యాధి లేదని తేలిన వారు: 412
ఫలితాలు రావాల్సినవి: 18
వ్యాధి నిర్ధారణ అయిన వారిని కలిసిన వారు: 331
ఆంధ్రప్రదేశ్‌లో రెండో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలో ఈ కేసు నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది.
ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయన ఈనెల 12న లండన్ నుంచి బయలుదేరి 15న ఒంగోలు వచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్థలు మూసివేసినప్పటికీ ఇంటర్, పదో తరగతి పరీక్షలు మాత్రం షెడ్యూలు ప్రకారం జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించడం కోసం రెండు ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేసింది. దిల్లీలోని ఏపీ భవన్‌లో, అమరావతి సచివాలయంలోని నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీలో ఈ కంట్రోల్ రూములు ఏర్పాటయ్యాయి.
గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దిల్లీలో వివిధ కేంద్ర శాఖలతో విజయసాయిరెడ్డి నిరంతరం టచ్‌లో ఉంటారని ప్రకటించారు.
అమరావతిలో ఐఏఎస్ అధికారి వెంకట మురళి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఇక మొత్తం కరోనా వ్యవహారాల సమన్వయానికి మంత్రి ఆళ్ల నాని, మేకపాటి గౌతమ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మేడపాటి వెంకట్‌లతో ఏపీ ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది.
విదేశాల్లోని ఏపీ విద్యార్థులు సంప్రదించాల్సిన నంబర్లు:
ఏపీ భవన్: పి. రవిశంకర్- 9871999055, దేవేందర్ - 9871999059
అమరావతి: కరీముల్లా షేక్ - 8971170179, మోహన్ కుమార్- 8297259070

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సోకిందనే అనుమానంతో వ్యక్తిపై దాడి
ఆగ్నేయ కెన్యాలో కరోనా వైరస్ ఉందనే అనుమానంతో కొందరు ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. తర్వాత అతడు ఆస్పత్రిలో మృతిచెందాడు.
దీనిపై దర్యాప్తు జరుగుతోందని, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక పోలీసులు బీబీసీకి చెప్పారు.
బాధితుడికి కరోనావైరస్ ఉందని అతడిపై దాడి చేసినవారు ఆరోపించినట్లు వివరించారు.
ప్రముఖ పర్యటక ప్రాంతమైన క్వాలేలో సాంబ్వేనీ అనే మత్స్యకారుల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఇప్పటివరకూ దేశంలో 7 కరోనా పాజిటివ్ కేసులు బయటపడినట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది.
విదేశీయులు రాకుండా కెన్యా ప్రభుత్వం కఠిన ప్రయాణ ఆంక్షలు విధించింది.
బహిరంగ కార్యక్రమాలను నిషేధించి, విద్యాసంస్థలు మూసివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దులు మూసివేసిన న్యూజీలాండ్
గురువారం అర్థరాత్రి నుంచి విదేశీయులకు తమ సరిహద్దులు మూసివేస్తున్నట్లు న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
శుక్రవారం విదేశీయులు ఎవరూ రాకుండా సరిహద్దులు మూసివేస్తున్నట్లు ఆస్ట్రేలియా చెప్పిన కొన్ని నిమిషాలకే న్యూజీలాండ్ కూడా తమ నిర్ణయం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో మొదటిసారి సున్నాకు చేరిన కొత్త కరోనా కేసులు
డిసెంబర్‌లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత చైనాలో మొట్టమొదటిసారి వైరస్ ఇన్ఫెక్షన్ కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
మొత్తం 34 కొత్త కేసులు అన్నిటినీ బుధవారమే ధ్రువీకరించారు. చైనాలో ఇటీవల బయటపడ్డ కరోనా కేసులన్నీ విదేశాల నుంచీ అక్కడికి వచ్చిన వారి వల్లే నమోదయ్యాయి.
గ్లోబల్ టైమ్స్ పత్రిక వారందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పూర్తి జాబితా ప్రచురించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 15
విదేశీయుల రాకపై ఆస్ట్రేలియా నిషేధం
విదేశీయులు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు.
స్థానిక కాలమానం ప్రకార శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఇది అమలులోకి వస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
ప్లేబాయ్ పత్రికకు కరోనా దెబ్బ
పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ప్లేబాయ్ పత్రికపై కూడా కరోనా ప్రభావం పడింది.
సప్లై చెయిన్ మూసివేయడం, పత్రిక అమ్మకాలు పడిపోవడంతో కొత్త ఎడిషన్ ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ప్లేబాయ్ ప్రకటించింది.
ఈ మ్యాగజీన్‌ను సంస్థ గత 66 ఏళ్లుగా ప్రచురిస్తోంది. ఒక సమయంలో ఇది నెలకు 70 లక్షల కాపీలు అమ్ముడైంది.
కరోనా వైరస్ మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ ఉచితంగా లభిస్తుండడంతో అది కూడా ప్లేబాయ్ మ్యాగజీన్ అమ్మకాలు పడిపోయేలా చేసింది.
ప్లేబాయ్‌ను డిజిటల్, సోషల్ మీడియాలో విస్తరించే ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రచురణ సంస్థ చెబుతోంది.
భారత్‌లో సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్
భారత్‌లో అంతకంతకూ విస్తరిస్తున్న కరోనాను అడ్డుకుని, పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు భారత సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు #SafeHandsChallenge చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 16
వీరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అఢనోమ్ గెబ్రెయేసస్ నామినేట్ చేసిన నటి దీపికా పదుకోన్ కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 17
ఒలింపిక్ పతక విజేత, బాడ్మింటన్ ప్లేయర్, ఇటీవల బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌మన్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్న పీవీ సింధు కూడా ఈ చాలెంజ్ చేశారు.
కేరళ పోలీసులు చేతుల శుభ్రంగా ఎలా కడుక్కోవాలో 'హ్యాండ్ వాషింగ్ డాన్స్' చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. 'కలకాత్తా' అనే పాపులర్ మలయాళం పాటకు డ్యాన్స్ చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలో ఉదయం 8 గంటల వరకు ఇదీ పరిస్థితి
అబ్జర్వేషన్ లో ఉంచిన మొత్తం సంఖ్య: 883
ఇరవై ఎనిమిది రోజల అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్నవారు: 254
ఆసుపత్రుల్లో అబ్జర్వేషన్లలో ఉంచిన వారు: 22
ఇంట్లో అబ్జర్వేషన్లో ఉంచిన వారు: 607
ఇప్పటి వరకూ పరీక్షించిన శాంపిళ్లు: 109
వ్యాధి నిర్ధారణ అయిన వారు: 2
వ్యాధి లేదని తేలిన వారు: 94
ఫలితాలు రావాల్సినవి: 13
విదేశాల నుంచి వచ్చిన వారే...
ఇప్పటి వరకూ తెలంగాణలో నిర్ధరణ అయిన వారిలో మొదటి వ్యక్తి దుబాయ్, రెండో వారు ఇటలీ, మూడో వ్యక్తి నెదర్లాండ్స్, నాలుగో వ్యక్తి స్కాట్లాండ్, ఐదో వ్యక్తి ఇండోనేషియా నుంచి వచ్చారు. తెలంగాణలో ఉంటున్న వారికి ఒక్కరికి కూడా కరోనా రాలేదనీ, బయట నుంచి వచ్చిన వారికే ఉందనీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు చెప్పారు.
''ఇప్పటి వరకు 66,182 వేల మందికి ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీన్ చేశాం. 464 మందికి పరీక్షలు చేశాం. అందులో కేవలం 5 మందికి మాత్రమే కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరణైంది.
ఎయిర్‌పోర్ట్‌లోనే పూర్తిగా చెక్ చేసి పంపాలని కేంద్రానికి సూచించాం. అఫ్ఘానిస్థాన్, మలేసియా, యూకే, ఫిలిప్పీన్స్ నుంచి ఫ్లైట్స్ రద్దు చేశారు. రేపటి నుంచి మరికొన్ని దేశాలనుంచి వచ్చే ఫ్లైట్స్ రద్దు చేసే అవకాశం ఉంది.
వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి లక్షణాలు ఉన్నా లేకపోయినా క్వారంటీన్ చేస్తాం. చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ, కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటీన్ సెంటర్స్‌కి పంపిస్తున్నాం. రేపటి నుంచి యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్ దేశాల నుంచి వచ్చే వారిని కూడా క్వారంటీన్ చేస్తాం'' అని ఈటల రాజేందర్ మీడియాతో చెప్పారు.

ముందస్తుగా ప్లాన్ చేసే, అత్యవసరం కాని అన్ని ఆపరేషన్లు (సర్జరీలు) మార్చి 25 వరకూ నిలిపివేయాలని తన పరిధిలోని ఆసుపత్రులను తెలంగాణ వైద్య విద్య శాఖ ఆదేశించింది. అయితే అత్యవసర సేవలు, అత్యవసర ఆపరేషన్లు, సాధారణ ఔట్ పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. తెలంగాణ వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని బోధనాసుపత్రులు, కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులూ యథావిధిగా ఉంటాయి.
తెలంగాణ జైళ్లలో ఖైదీలను ఇతరులు కలవకుండా జైళ్ల శాఖ డీజీ ఆదేశాలు జారీ చేశారు. బయటి వారి నుంచి ఖైదీలకు కరోనావైరస్ సోకకుండా ఈ ఏర్పాటు చేశారు. అయితే జైలు దగ్గర ఉండే టెలిఫోన్, ఇంకా ఈ-ములాఖత్ పద్ధతుల్లో ఖైదీలతో బంధువులు మాట్లాడవచ్చని, నేరుగా కలవడం మాత్రం నిషిద్ధం అని డీజీ ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.
ఆంధ్రలో కూడా ఖైదీల బంధువులకు ములాఖత్‌లను నిలిపివేస్తూ ఆంధ్రా జైళ్ల డీజీ ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు హైదరాబాద్‌లోని మొత్తం 66 సంస్థలను సీజ్ చేశారు. వాటిలో జిమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, ఇన్‌స్టిట్యూట్లు, బార్లు, స్టడీ రూమ్‌లు, స్పోర్ట్స్ క్లబ్, స్విమ్మింగ్ పూల్, స్కూల్ వంటివి ఉన్నాయి.
పన్నెండు రైళ్ల రద్దు
ప్లాట్ ఫాంలపై జనం సంఖ్య తగ్గించడం కోసం ప్లాట్ ఫాం టికెట్ల ధరలను రైల్వేశాఖ పెంచింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం టికెట్ ధర పది రూపాయల ఉండగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 84 స్టేషన్లలో యాభై రూపాయలు, 499 స్టేషన్లలో ఇరవై రూపాయలు చేసింది. ఈ కొత్త ధరలు మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయి.
రెండు తెలుగు రాష్ట్రాలూ 1897 నాటి ఎపిడమిక్ డిసీజెస్ చట్టంలోని 2, 3, 4 సెక్షన్లను అమలు చేస్తున్నాయి.
ఇప్పటి వరకూ కోటీ ముప్పై నాలుగు లక్షల ఇళ్లల్లో సర్వే నిర్వహించి, ఫిబ్రవరి 10 తరువాత విదేశాల నుంచి వచ్చిన 7500 మందిని గుర్తించామని, వారిని, వారితో కలిసిన వారందరినీ క్వారంటైన్లో ఉంచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్ ప్రకటించారు.
తెలంగాణలో కరోనా పరిస్థితి
కరోనా అంశంపై గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించచబోతున్నారు. మంత్రులు, రాజధానిలో ఉన్నతాధికారులతో పాటూ, అన్ని జిల్లాలల కలెక్టర్లు, ఎస్పీలను ఈ సమావేశానికి పిలిచారు.
ఆసుపత్రుల్లో అబ్జర్వేషన్లలో ఉంచిన వారు: 435 మొత్తం, 40 నిన్న
28 రోజుల అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్న వారు: 306
ఇప్పటి వరకూ పరీక్షించిన శాంపిళ్లు: 447
వ్యాధి నిర్ధారణ అయిన వారు: 6
వ్యాధి లేదని తేలిన వారు: 412
ఫలితాలు రావాల్సినవి: 18
వ్యాధి నిర్ధారణ అయిన వారిని కలిసిన వారు: 331
విదేశీయుల స్క్రీనింగ్
శంషాబాద్ విమానాశ్రయం: మొత్తం నిన్నటి వరకూ 70545 మందిని పరీక్షించారు. విదేశాల నుంచి వచ్చిన అందర్నీ ఇంట్లోనే క్వారంటైన్ చేస్తున్నారు.
తెలంగాణలో మొత్తం ఐసోలేషన్ (ఎవరూ కలవకుండా) ఉన్న పడకలు: 335
ఈరోజు కొత్తగా ఆసుపత్రుల్లో చేరిన వారు: 15
వ్యాధి లేదని తేలడంతో డిశ్చార్జి అయిన వారు: 23
ఇంకా ఆసుపత్రుల్లో ఉన్నవారు: 29
ఏపీలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. దీనికి ఆరోగ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్థిక, రెవెన్యూ, రవాణా, పంచాయతీరాజ్, మున్సిపల్, హోం, టూరిజం శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఏపీలో కరోనా పరిస్థితి
అబ్జర్వేషన్‌లో ఉంచిన మొత్తం సంఖ్య: 879
28 రోజుల అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్నవారు: 254
ఆసుపత్రుల్లో అబ్జర్వేషన్లలో ఉంచిన వారు: 20
ఇంట్లో అబ్జర్వేషన్లో ఉంచిన వారు: 605
ఇప్పటి వరకూ పరీక్షించిన శాంపిళ్లు: 105
వ్యాధి నిర్ధరణ అయిన వారు: 1
వ్యాధి లేదని తేలిన వారు: 93
ఫలితాలు రావాల్సినవి: 11


ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్‌తో కొత్త ఉద్యోగాలు.. ఆన్లైన్ అమ్మకాలు పెరగడంతో లక్ష మందిని నియమించుకుంటున్న అమెజాన్
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








