కరోనావైరస్: భారతదేశంలో మూగబోతున్న నగరాలు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ రాకతో భారతీయ నగరాల్లో జనజీవనం నాటకీయంగా మారిపోయింది
మామూలుగా జనం రద్దీతో గందరగోళంగా ఉండే నగరాలు ఇప్పుడు మూగబోయాయి. జనం ఇళ్లలోనే ఉండటంతో ట్రాఫిక్ తగ్గిపోయింది. పెళ్లిళ్లు చాలా వరకూ వాయిదా పడ్డాయి. జరుగుతున్న పెళ్లిళ్లల్లోనూ హంగూ ఆర్భాటాలూ కనిపించటం లేదు.
భారతదేశంలో నిర్ధారిత కరోనావైరస్ కేసుల సంఖ్య 341 కాగా, ఆరుగురు చనిపోయారు. అయితే, కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం వ్యాధి నిర్ధరణ పరీక్షలు చాలా పరిమితంగా ఉండటం, కేసుల సంఖ్యను తక్కువగా చెప్పటం కారణం కావచ్చునని ప్రజారోగ్య నిపుణులు భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) ఎలా ఉంది? ఎంత వరకూ ఉంది? అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. సామాజిక వ్యాప్తి అంటే.. ఎవరైనా ఒక వ్యక్తి.. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన మరొక వ్యక్తిని కానీ, తీవ్రంగా ప్రభావితమైన దేశానికి వెళ్లి వచ్చిన వ్యక్తిని కానీ తనకు తెలిసి కలవకుండా ఉన్నా వ్యాధి సోకటం.
అయితే.. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నగర పాలక వ్యవస్థలు ఇప్పటికే స్పందించి పటిష్ట చర్యలు చేపట్టాయి.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం తన పౌరులు సహా.. బ్రిటన్, చాలా యూరప్ దేశాలతో పాటు నిర్దిష్ట దేశాల నుంచి ఎవరూ దేశంలోకి రావద్దంటూ నిషేధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి వీసాలన్నిటినీ దాదాపుగా రద్దు చేసింది. దీనివల్ల చాలా విమానాలు రద్దయ్యాయి.
కొత్త నిబంధనలతో తాము ఇళ్లకు దూరంగా చిక్కుకుపోతామన్న భయంతో దేశంలో అంతర్గతంగా కూడా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో విమానయాన సంస్థలు తంటాలు పడుతున్నాయి.
డిమాండ్ పడిపోతుండటంతో దేశంలో పెద్ద విమానయాన సంస్థలు రెండు సర్వీసులను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

జనం పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడకుండా నివారించటానికి దిల్లీలోని 16వ శతాబ్దానికి చెందిన ఎర్రకోట వంటి 140 ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, మ్యూజియంలను మూసివేశారు.
ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను కూడా మంగళవారం మూసివేశారు. ఈ కట్టడాన్ని తిలకించేందుకు రోజుకు 70,000 మంది వస్తుంటారు.
సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో ఇతర బహిరంగ ప్రాంతాల మూసివేత పెరిగే అవకాశముంది. పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ భారతదేశంలోని ఐటీ హబ్ బెంగళూరులో మాల్స్‌ను మూసివేశారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు తదిరత బహిరంగ ప్రదేశాలన్నీ గత వారం రోజులుగా బందయ్యాయి.
దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక కేంద్రం ముంబై, దక్షిణాన హైదరాబాద్ వంటి ఇతర ప్రధాన నగారాల్లో కూడా ఇవే చర్యలు చేపట్టారు.
పెళ్లిళ్లు, క్రికెట్ మ్యాచ్‌లు వంటి జనం పోగయ్యే కార్యక్రమాలన్నిటి మీదా ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో కన్నాట్ ప్లేస్ వంటి రద్దీ ప్రాంతాలు దాదాపుగా ఖాళీ అయ్యాయి.
దేశంలో అత్యధిక శాతం ప్రజల రవాణా సాధమైన రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది.
ముంబై నుంచి పుణె నగరానికి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ 30 శాతం తగ్గిపోయిందని ఒక అంచనా.

ఈ రెండు నగరాలున్న మహారాష్ట్రలోనే ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
సెంట్రల్ రైల్వే ఇప్పటికే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే 23 రైళ్లను రద్దు చేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించటంతో పాటు, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవటమూ దీనికి కారణమని ముంబయి అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మొత్తంగా దేశవ్యాప్తంగా 150 రైళ్లు రద్దయ్యాయి. మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
సిక్కుల పవిత్ర క్షేత్రమైన గోల్డెన్ టెంపుల్ వంటి చాలా పుణ్యక్షేత్రాలను సందర్శించే వారి సంఖ్య చాలా తగ్గినా కూడా వాటిని తెరిచే ఉంచారు. అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటైన స్వర్ణ దేవాలయం వంటి చోట ఇంత తక్కువ మంది కనిపించటం అసాధారణం.

ఫొటో సోర్స్, Getty Images
అత్యంత సంపన్న హిందూ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా మూసివేశారు.
ముంబై నడిబొడ్డున ఉండే సిద్ధివినాయక ఆలయం, వైష్ణోదేవి గుహాలయాలు కూడా మూతపడ్డాయి.
దిల్లీలో వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికి నగర అధికారులు ఆటో రిక్షాలు, టాక్సీలను ప్రక్షాళన చేయటం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్ విజృంభణను అరికట్టటానికి ప్రజా రవాణా పెద్ద సవాలుగా మారింది. ప్రజలు సాధ్యమైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ.. దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా వినియోగం కొనసాగుతోంది.
అన్ని కార్యాలయాలకూ ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు లేదు. ఇంటి పనివారు, స్ట్రీట్ వెండర్లు, రోజు వారీ కార్మికులు వంటి కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు ఇది పెద్ద సవాలు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ధర్నాలు దిల్లీ, బెంగళూరు సహా కొన్ని నగరాల్లో ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొనసాగుతూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసన ధర్నా వీటిలో అత్యంత ప్రముఖమైనది. ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని విమర్శకులు తప్పుపడుతున్న చట్టాన్ని నిరసిస్తూ వేలాది మంది నిరసనకారులు - ప్రధానంగా ముస్లిం మహిళలు డిసెంబర్ నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.
అయితే.. దిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, నైట్ క్లబ్‌లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేశారు. యాబై మంది కన్నా ఎక్కువ మంది గుమిగూడే అన్ని సామాజిక, రాజకీయ, మత సమావేశాలన్నిటినీ నిలిపివేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయటం అన్ని నగరాల్లోనూ సాధారణ విషయంగా మారిపోయింది. కోల్‌కతాలోని హైకోర్టు లోపలికి వస్తున్న ప్రజలకు స్క్రీనింగ్ చేయటం వంటి దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి.
ఆంక్షలు ఉన్నప్పటికీ తెరచి ఉంచిన విమానాశ్రయాలు, కార్పొరేట్ కార్యాలయాలు వంటి అనేక ప్రాంతాలు ఈ స్క్రీనింగ్ చేపట్టాయి.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ నగరంలో పదో తరగతి తుది పరీక్షలకు హాజరవటానికి విద్యార్థులు మాస్కులు ధరించి వచ్చారు.
దిల్లీలో స్కూలు పరీక్షలన్నిటినీ వాయిదా వేశారు.
కరోనావైరస్ కేసుల సంఖ్య పెరిగే కొద్దీ భారతదేశం మరింత తీవ్రంగా నిర్బంధ చర్యలు చేపట్టవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.
- ఈ రాకాసి గబ్బిలాలు రక్తం జుర్రుకుంటూ ముద్దులు పెట్టుకుంటాయ్
- నిర్భయ కేసు హంతకుల ఉరితీత: ఆ నలుగురి చివరి కోరికలేంటి
- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా
- కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచంలోని మహా నగరాల వీధులు ఇప్పుడెలా ఉన్నాయో చూడండి...
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- కరోనావైరస్: ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి - ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- కరోనావైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- కరోనావైరస్: 128 ఏళ్ల తర్వాత తొలిసారి తిరుమలలో దర్శనాలు రద్దు
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








