నోట్లో నోరు పెట్టి రక్తం జుర్రుకుంటూ ముద్దు పెట్టుకునే రాకాసి గబ్బిలాలు

ఫొటో సోర్స్, Getty Images
రక్తపిపాసులైన రాకాసి గబ్బిలాలు అవి.. అవి ఒకదానితో ఒకటి స్నేహాన్ని వ్యక్తం చేసుకునే తీరు చూస్తే భయమేస్తుంది.
అవి తోటి గబ్బిలాల నోట్లో నోరు పెట్టి రక్తం జుర్రుకుంటూ ముద్దులు పెట్టుకుంటాయని.. భయానకంగా ఫ్రెంచ్ కిస్‌లు ఇచ్చుకుంటాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
గబ్బిలాలు మూడు రోజుల పాటు ఏమీ తినకుండా ఉంటే చనిపోతాయి. అలాంటి సమయంలో అవి తోటి గబ్బిలాలతో రక్తం జుర్రుకుంటూ ఫ్రెంచ్ కిస్ చేసుకుంటాయి. దానివల్ల అవి పరస్పరం మరణాన్ని తప్పించుకుంటాయి.
'కరెంట్ బయాలజీ' జర్నల్‌లో గబ్బిలాల మధ్య స్నేహబంధాలు ఎలా అభివృద్ధి చెందుతాయన్నది వివరించే ఈ అధ్యయనం ప్రచురితమైంది.
''వేర్వేరు సమూహాలకు చెందిన గబ్బిలాలు ఒకదానికొకటి తెలియకపోయినా జట్టుగా మారి ఒకదాని ప్రాణాన్ని ఒకటి రక్షించుకోవడం మేం పరిశీలించాం'' అని ఓహియో స్టేట్ యూనివర్సిటీ అధ్యయన, ప్రవర్తనా పర్యావరణ ప్రొఫెసర్ జెరాల్డ్ కార్టర్ చెప్పారు.
''అనుకూల, ప్రతికూల కాలాలకు తగిన ఆహార అన్వేషణ పద్ధతులు రాకాసి గబ్బిలాలు పాటిస్తాయి. కాబట్టి అవి తోటి గబ్బిలాల నోళ్లను గట్టిగా కరిచి రక్తభోజనం చేస్తాయి. లేదంటే ఆ రాత్రికి ఆకలితో చచ్చిపోతాయి'' అన్నారు కార్టర్.
చాలా రకాల పక్షులు తమ పిల్లలకు నోటితో ఆహారం అందిస్తాయి. కానీ, రాకాసి గబ్బిలాలు మాత్రం తమలాంటి పెద్ద గబ్బిలాలకు తమ రక్తాన్నే ఆహారంగా అందిస్తాయన్నారు కార్టర్.
కేవలం రక్తాన్ని ఆహారంగా తీసుకునే ఏకైక క్షీరదాలు ఈ రాకాసి గబ్బిలాలు. ఇవి పశువులు వంటి పెద్ద జంతువులను కరచి వాటి నుంచి రక్తాన్ని పీల్చి బతుకుతాయి.
ఈ రకం గబ్బిలాలు మిగతా సాధారణ గబ్బిలాలకు భిన్నంగా తమ శరీర బరువులో సగం బరువుకు సమానమైన రక్తాన్ని ఒక రోజులో ఆహారంగా తీసుకుంటాయి.
సాధారణ గబ్బిలాలు పండ్లు, మకరందం, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
గబ్బిలాలను బంధించినప్పుడు అవి ఏర్పరుచుకునే బంధాలు వాటిని విడిచిపెట్టాక కూడా కొనసాగిస్తాయని నవంబరులో ఓ శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది.


ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్‌తో కొత్త ఉద్యోగాలు.. ఆన్లైన్ అమ్మకాలు పెరగడంతో లక్ష మందిని నియమించుకుంటున్న అమెజాన్
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








