కరోనావైరస్ అప్‌డేట్: ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. దేశంలో రాజ్యసభ ఎన్నికలూ వాయిదా

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉన్న సమాచారం ఇది. తాజా సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఏపీలో మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేశారు.

మార్చి 31 తరువాత పరిస్థితుల ఆధారంగా పరీక్షల తేదీలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

రాజ్యసభ ఎన్నికలు వాయిదా

మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మార్చి 31 తరువాత సమీక్షించి తదుపరి ఎన్నికల తేదీ ప్రకటిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది."దేశంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ నెలకొని వుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు ఒకే చోట చేరడం నిబంధనలకు విరుద్ధం. అది ప్రజాప్రతినిధులైనా సరే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేస్తున్నాం" అని ఈసీ వెల్లడించింది.

రాజ్యసభకు ఖాళీ అయిన 55 సీట్లలో ఏకగ్రీవమైన 37 మినహా మిగతా 18 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

మోదీ

ఫొటో సోర్స్, dd news

నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు మినహా దేశమంతా లాక్ డౌన్

దేశంలోని 32 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు లాక్ డౌన్ ప్రకటించాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాల్లోని 560 జిల్లాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి.

దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు ఉండగా నాలుగు చోట్ల మినహా మిగతా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది.

ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, లక్షదీవులలో ఇంకా లాక్‌డౌన్ విధించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కరోనా వైరస్ రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడుతానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

దీంతో ప్రధాని ఏం చెప్పబోతున్నారు... ప్రాణాంతక వైరస్ కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారన్న అంచనాలు మొదలయ్యాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం
ఫొటో క్యాప్షన్, విజయవాడలో రైతుబజార్‌ను ఇందిరాగాంధీ స్టేడియానికి మార్చగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని కూరగాయల కోసం క్యూ కట్టారు.

నిత్యవసరాలకు పోటెత్తుతున్న జనం

లాక్‌డౌన్ కారణంగా ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం ఆందోళన చెందుతున్నారు. కూరగాయలు, పాలు, ఇతర నిత్యవసరాల కోసం బారులు తీరుతున్నారు.

విజయవాడలో రైతుబజార్‌ను ఇందిరాగాంధీ స్టేడియానికి మార్చగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని కూరగాయల కోసం క్యూ కట్టారు.

విజయనగరం మార్కెట్లో
ఫొటో క్యాప్షన్, విజయనగరం మార్కెట్లో

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి కనిపించింది.

విజయనగరం పట్టణంలో గంటస్తంభం వద్ద కూరగాయల కోసం ప్రజలు బారులు తీరారు.

కూరగాయల కోసం ప్రజలు

ఆంధ్రలోని పలు జిల్లాలు పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. నిత్యావసరాలకు కూడా ఉదయం ఆరు నుంచి పది లోపు మాత్రమే బయటకు రావాలని ఆదేశాలిచ్చారు కలెక్టర్.

‘అది అవాస్తవం’

మరోవైపు కరోనావైరస్ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడాలంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. అది నిజం కాదని.. వైద్యుల సూచన లేకుండా దీన్ని వాడితే దుష్పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరించింది.

‘‘హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదనే భావన కొన్ని పత్రికా కథనాల్లో వెల్లడైంది. ఇది వాస్తవం కాదు. సాధారణ వ్యక్తులెవ్వరూ కూడా ఈమందును వినియోగించకూడదు. దుష్పరిణామాలకు దారితీస్తుంది.

కరోనా సోకిన వారికి మాత్రమే ఈ మందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగమే. అంతేకాక కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో దీన్ని పాటిస్తున్నారు.

అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లవద్దని విజ్ఞప్తిచేస్తున్నాం. సాధారణవ్యక్తులెవ్వరూ కూడా ఈ మందును వినియోగించవద్దని కోరుతున్నాం.

హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను కేవలం నిపుణుల పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తున్నారు. కోవిడ్‌ సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్న మందు మాత్రమే. మందు తీసుకున్న వారు పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాల’’ని కోరింది.

ప్రపంచ వ్యాప్తంగా 16,572 మంది మృతి

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,81,293 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం 16,572 మంది మరణించారు. 1,01,344 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

భారత్‌లో(మార్చి 24 ఉదయం 8.45 వరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా)..

భారత్‌లో మొత్తం 492 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 451 మంది భారతీయులు కాగా 41 మంది విదేశీయులు. మొత్తం కేసులలో 37 మందికి నయం కాగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో అత్యధికంగా 95 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 87 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 37, రాజస్థాన్‌లో 33, ఉత్తర ప్రదేశ్ 33, తెలంగాణలో 32, దిల్లీలో 31 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇంతవరకు 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

బెంగళూరు విమానాశ్రయంలో కశ్మీర్ విద్యార్థుల ఆందోళన

దేశీయ విమాన సర్వీసులనూ నిలిపివేయడంతో కశ్మీరీ విద్యార్థులు కొందరు బెంగళూరు విమానాశ్రయంలో నిరసన తెలిపారు.

మార్చి 27, 28 తేదీలకు తాము బెంగళూరు నుంచి విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నామని.. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఓ విద్యార్థి ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

తగరపువలస యువకుడికి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బాధితులు ఏడుకు చేరారు. ఇంగ్లండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 25 ఏళ్ల యువకుడికి వైరస్ సోకింది. ఇతను ప్రస్తుతం విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు.

ఆ యువకుడు మార్చి 17న ఇంగ్లండ్ నుంచి దిల్లీ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చారు.

విశాఖ విమానాశ్రయం నుంచి తన తండ్రితో కలిసి తగరపువలసకు కారులో వెళ్లారు.

మార్చి 19న జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి. మార్చి 21న గాయత్రి విద్యాపరిషత్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు విశాఖలోని జీజీహెచ్‌సీసీడీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన శాంపిళ్లను తీసుకున్నారు.

ఆంధ్రాలో కరోనా పరిస్థితి(మార్చి 24, ఉదయం 8 గంటల వరకు) :

విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య: 14038

28 రోజుల అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్న వారు: 2426

ఇంట్లో ఇసోలేషన్లో ఉన్నవారు: 11526

ఆసుపత్రిలో ఉన్నవారు: 86

పరీక్షించిన శాంపిళ్లు: 220

వైరస్ ఉన్నవారు: 7

వైరస్ లేనివారు: 168

ఫలితాలు రావాల్సినవి: 45

షహీన్ బాగ్‌ను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Ani

షహీన్ బాగ్ ఖాళీ

సీఏఏకు నిరసనగా దిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొద్దిరోజులుగా చేపడుతున్న ఆందోళనకారులను దిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు.

కరోనావైరస్ నేపథ్యంలో దిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించడంతో పోలీసులు ఏ మేరకు చర్యలు చేపట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

చంద్రబాబు, జగన్

ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

కరోనావైరస్ నిరోధానికి సరైన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

"విదేశాల నుంచి ఇప్పటికే దాదాపు 15వేల మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చేరినట్లు తెలిసింది. వారిని కట్టుదిట్టంగా క్వారంటైన్ చేయాలి. ఐసోలేషన్ చేయాలి. కరోనా రోగులకు ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి.

చంద్రబాబు లేఖ
ఫొటో క్యాప్షన్, చంద్రబాబు లేఖ

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు, రోజు కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి. రెండు నెలల రేషన్, రూ.5 వేల రూపాయలను తక్షణమే అందజేసి వారిని ఆదుకోవాలి.

నిత్యావసరాల ధరలు పెరగకుండా, అవి అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దళారుల బెడదకు అడ్డుకట్ట వేయాలి" అని ఆ లేఖలో చంద్రబాబు కోరారు.

భారత్‌లో కోవిడ్-19 మృతుల సంఖ్య 9కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 467కు చేరింది. వీరిలో 34 మంది కోలుకుని విడుదలయ్యారు.

తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే లండన్ నుంచి తిరిగొచ్చిన అతడిని కొత్తగూడెం నుంచి గాంధీకి తరలించారు. డీఎస్పీ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

డీఎస్పీపై కేసు నమోదు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

కొత్తగూడెంకు చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 18న అతడు లండన్ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి కారులో కొత్తగూడెం వెళ్లినట్లు తెలుస్తోంది.

బాధిత యువకుడు మార్చి 18 నుంచి 20 వరకు కొత్తగూడెంలోని తన నివాసంలోనే ఉన్నాడు. కుటుంబసభ్యులతో పాటు కొంత మంది బంధువులు, మిత్రులను కలిసినట్లు తెలుస్తోంది.

మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆదివారం (మార్చి 22) అతడికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధరణ అయ్యింది.

కారు డ్రైవర్ సొంతూరుకు వెళ్లినట్లు వస్తున్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి.

డీఎస్పీ కుటుంబం, వారితో సన్నిహితంగా ఉన్న 21 మందిని కరోనా పరీక్షలు నిమిత్తం వైద్య శాఖ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు.

మరోవైపు, తెలంగాణలో ఆరు లేబొరేటరీలకు అనుమతి వచ్చింది. సీసీఎంబీ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు 1600 మందికి పరీక్షలు నిర్వహించొచ్చని అధికారులు తెలిపారు.

కరోనావైరస్ నేపథ్యంలో తొలి అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం అక్కంపేటలో ఓ వ్యక్తి తన సోదరుడి వివాహానంతరం సోమవారం విందు ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ పిలిచారు. అది తెలిసిన పోలీసులు, దాన్ని ఆపేయాలని సూచించారు. అయినా వినకుండా ఆ ఫంక్షన్ నిర్వహించినందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అక్కంపేటలో ఆకుల సుధాకర్ అనే వ్యక్తి సోదరుడికి ఇటీవల వివైహమైంది. 23వ తేదీన ఘనంగా ఫంక్షన్ ఏర్పాటు చేసి గ్రామస్తులందరినీ పిలవాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలిసి, ప్రస్తుతం కరోనావైరస్ ప్రమాదమున్నందున, భోజన వేడుకలు నిలిపివేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి 22వ తేదీన నోటీసు ఇచ్చారు.

అయినా వినకుండా సోమవారం యథావిధిగా భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆకుల సుధాకర్‌పై ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘన (188 ఐపీసీ), అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి వ్యాపిస్తున్నా నిర్యక్షంగా వ్యవహరించినట్లు (269 ఐపీసీ), విచక్షణారహితంగా అంటువ్యాధి ప్రబలే అవకాశముందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం (270 ఐపీసీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సుధాకర్‌ను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నట్లు జంగారెడ్డిగూడెం సీఐ బీఎన్ నాయక్ చెప్పారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జాతరలు, ఫంక్షన్లు ఉత్సవాలు నిర్వహిస్తే అరెస్ట్ చేస్తామని సీఐ హెచ్చరించారు.

విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

మంగళవారం అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అన్ని విమాన సేవలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.

మంగళవారం రాత్రి 11.59 గంటల లోపు అన్ని ప్రయాణికుల విమానాలను ఆపేయాలని పౌరవిమానయాన శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. బుధవారం నుంచి ఏ విమానమూ తిరగదని తెలిపింది.

అయితే, కార్గో సర్వీసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.

పాకిస్తాన్‌లో రంగంలోకి సైన్యం

సైన్యాన్ని మోహరించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇస్లామాబాద్, పంజాబ్, సింధ్, ఖైబర్ పక్తుంఖ్వా, బలోచిస్తాన్, గిల్జిత్ బాల్టిస్తాన్, పాక్ పరిపాలిత కశ్మీర్ ప్రాంతాల్లో కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర, పంజాబ్‌లలో పూర్తి కర్ఫ్యూ

మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి కర్ఫ్యూను విధిస్తున్నట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించేవారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న ఈ నిబంధనలను ప్రజలంతా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

చర్చి ఫాదర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

ఫొటో సోర్స్, ANI

కేరళలో చర్చి ఫాదర్ అరెస్టు

కేరళలో ఓ చర్చి ఫాదర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా నిత్య సహాయ మాత చర్చి మతాధికారి భారీ సంఖ్యలో ప్రజలను కూడగట్టి సామూహిక ప్రార్థనలు నిర్వహించారని చెబుతూ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.

ఈ నియంత్రణలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కేరళలో మొత్తం కేసుల సంఖ్య 95కు చేరింది. ఈరోజు 28 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 91 మంది చికిత్స తీసుకుంటుండగా, నలుగురు కోలుకుని హాస్పటల్ నుంచి విడుదలయ్యారు.

హరియాణాలో తొలి కేసు

హరియాణాలో మొదటి కరోనావైరస్ కేసు నమోదైంది. రోహ్‌తక్‌ పీజీఐలో ఓ వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణైంది. అయితే, అతడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదు. ఇది ప్రస్తుతం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

తెలంగాణలో మొత్తం కేసులు ౩౩ కి చేరాయి.

తెలంగాణలో 33కి చేరిన బాధితులు

తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 33కి చేరింది. ఇవాళ మూడు కేసులు నిర్ధరణ అయ్యాయి.

వారిలో ఒకరు న్యూయార్క్ నుంచి, ఒకరు లండన్ నుంచి, మూడవ వారు శ్రీలంక నుంచి వచ్చారు. ఇక కరీంనగర్‌లో ఇండోనేషియా వ్యక్తులను కలసిన ఒక స్థానికుడికి కూడా కరోనా సోకింది. దీంతో స్థానికంగా కరోనా సోకిన వారి సంఖ్య 2 కు చేరింది. ఈ 33 మందిలో ఒకరిని ఇప్పటికే డిశ్చార్జి చేశారు.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ వంద శాతం కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఏ అవసరానికీ కూడా ప్రజలకు ఆ సమయంలో బయటకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు.

కరోనావైరస్ లాక్‌డౌన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానమంత్రి ఏం చెబుతున్నారో వినాలని, లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విటర్‌లో విజ్ఞప్తి చేసింది.

ఈ నియంత్రణలకు సహకరించకుండా, వీటిని అతిక్రమించి కోవిడియట్లు (కోవిడ్-ఇడియట్) కావొద్దని తెలిపింది.

పీఐబీ ట్వీట్

ఫొటో సోర్స్, PIB

ఇప్పటికీ కొంతమంది లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించట్లేదని, ‘దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మీ కుటుంబ సభ్యులను కాపాడండి’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

నియంత్రణలను కట్టుదిట్టంగా పాటించాలని ప్రజలకు పిలుపునిస్తూ.. ప్రజలంతా ఈ నియమాలను, చట్టాన్ని పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

‘విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రులు 28 మంది’

విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రులను వెనక్కు రప్పించడానికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు, ఆయా దేశాల్లోని భారత రాయబారులకు, విదేశీ వ్యవహారాల మంత్రి కార్యాలయాలకూ లేఖ రాశారు.

ఈ లేఖలో యూకేలోని ఇరవై నాలుగు మందినీ, కజకిస్తాన్ లో ఒకరినీ, జార్జియాలో ఇద్దరినీ, ఫిలిప్పిన్స్ లో ఒకరినీ తిరిగి తీసుకు రావడానికి సహకరించాలని ఆయన కోరారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

ప్రపంచవ్యాప్తంగా 3.30 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు, 14,700 మందికి పైగా మృతి.. భారత్‌లో 415 కేసులు

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలకు విస్తరించింది. 3,30,000 మందికి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 14,700 దాటింది. దాదాపు 98 వేల మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇటలీ దేశంలో అత్యధికంగా 5476 మంది చనిపోగా, చైనాలో 3153 మంది చనిపోయారు.

భారతదేశంలో సోమారం ఉదయం 10.30 గంటల వరకు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నమోదు చేసిన వివరాల ప్రకారం 415 మందికి కరోనావారస్ సోకింది. ఏడుగురు చనిపోయారు. 23 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

తెలంగాణలో 23 మందికి ఈ వ్యాధి నిర్థరణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కేసులు నమోదు అయ్యాయి.

కరోనావైరస్

ముంబైలో లాక్‌డౌన్..

రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అత్యవసర సేవలందించే వారికి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

ట్యాక్సీలను, ఆటోలను పోలీసులు నిలిపేస్తున్నారు. అక్కడక్కడ ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి. ట్రాఫిక్ చాలా వరకు తగ్గింది.

లాక్ డౌన్ నుంచి బ్యాంకులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ చాలా కొద్ది మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు.

ఏటీఎం వ్యాన్లు వచ్చిన ఏటీఎంలలో క్యాష్ నింపుతున్నాయి.

ప్రజల నిత్యావసరాలైన పాలు, కూరగాయలు అమ్మేందుకు సమీప గ్రామాల నుంచి లోకల్ రైళ్లలో వస్తుంటారు. వాళ్లు ఇవాళ రాలేదు.

సాయంత్రానికల్లా సప్లై తగ్గే అవకాశం ఉందని స్థానిక చిరు వ్యాపారులు చెబుతున్నారు. చాలా వరకు కిరాణా షాపులను స్వచ్ఛందంగానే మూసివేశారు. కొన్ని చోట్ల మాత్రం తెరిచే ఉన్నాయి.

మెడికల్ స్టోర్స్ తెరిచే ఉన్నాయి. రెస్టారెంట్లు కేవలం డోర్ డెలివరీ మాత్రమే అందిస్తున్నాయి.

పారిశుధ్య కార్మికులు తమ విధులకు హాజరయ్యారు.

144 సెక్షన్ విధించడంతో పోలీసులు ఎక్కడికక్కడ తమ విధులను నిర్వహిస్తూ కనిపించారు.

జనం నిత్యావసరాలను తెచ్చుకునేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.

జర్మనీలో ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలవడంపై నిషేధం

ఫొటో సోర్స్, Getty Images

ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలవడాన్ని నిషేధించిన జర్మనీ

కరోనావైరస్ మహమ్మారిని అడ్డుకునే చర్యల్లో భాగంగా సామాజిక కలయికలపై విధించిన నియంత్రణలను జర్మనీ మరింత పెంచింది. ఇద్దరు వ్యక్తులకంటే ఎక్కువ మంది కలవటాన్ని నిషేధించింది.

దేశ ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ జాతినుద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ.. ఈ వైరస్ సోకడాన్ని తగ్గించే చర్యల్లో అత్యంత ప్రభావవంతమైనది ప్రజల స్వభావమేనని చెప్పారు.

దేశవ్యాప్తంగా సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లను కూడా మూసేశారు. అత్యవసరం కాని ఇతర అన్ని రకాల షాపుల్ని ఇప్పటికే మూసేశారు.

ఏంగెలా మెర్కెల్ కూడా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తారని ఆమె కార్యాలయం ప్రకటించింది.

శుక్రవారం ఆమెకు న్యుమోనియా వ్యాక్సీన్ వేసిన ఒక డాక్టర్‌కు కరోనావైరస్ సోకినట్లు తేలింది.

గత కొన్ని రోజులుగా ఇంటి నుంచే పని చేస్తున్న 65 ఏళ్ల మెర్కెల్ తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

Sorry, your browser cannot display this map