మోదీ ప్రభుత్వం చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గించడం లేదు?: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలోక్ జోషీ
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
ముడి చమురు ధరలు తగ్గడం వల్ల ఉపశమనం లభిస్తుందనే ఆశలపై ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని పెంచింది.
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వం చమురు, గ్యాస్ ధరలు తగ్గించి సామాన్యులకు ఉపశమనం అందిస్తుందని అందరూ ఆశిస్తున్న సమయంలో ఇది జరిగింది.
ఈ ఉపశమనం కలిగించడం ఇప్పుడు ఇంతకు ముందెప్పుడూ లేనంత అవసరం. కరోనా వైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం ప్రమాదంలో పడింది.
విమాన ప్రయాణం, పర్యాటకం, హోటల్, రెస్టారెంట్లు, బార్లు లాంటి వ్యాపారాలే కాదు, ఈ మహమ్మారి భయంతో అన్నిరకాల పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు కూడా రద్దయ్యాయి.
టోక్యో ఒలింపిక్ నిర్వహణ కూడా ప్రశ్నార్థకం అయ్యింది. కరోనాను ఎదుర్కోడానికి జరగాల్సిన అంతర్జాతీయ సదస్సు కూడా రద్దయింది.
భారత్‌లో ఆర్థికాభివృద్ధి రేటు గతంలోకంటే చాలా పడిపోయింది. జీడీపీ వృద్ధి రేటు 5 శాతం కంటే దిగువన ఉంటుందని ఈ మహమ్మారి దేశంలోకి రావడానికి ముందే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
కరోనా వైరస్ ప్రభావం ఎప్పటివరకూ ఉంటుంది, ఇది ఎప్పుడు నియంత్రణలోకి వస్తుంది అనేది స్పష్టంగా తెలిసేవరకూ గ్రోత్ రేటు ఎంత తగ్గుతుంది, కొత్త అంచనాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పడం కష్టమే అని భావిస్తున్నారు.
కరోనావైరస్ ప్రభావంపై స్పష్టత వస్తే, దానిని బట్టి భారత ఆర్థికవ్యవస్థ, వాణిజ్యం, లేదా మన జేబులపై దాని ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది అంచనా వేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
చమురు మార్కెట్‌ను కుదిపేసిన చమురు భయాలు
ఈ ఆందోళనల మధ్య చమురు ధరలు వేగంగా పడిపోతున్నాయని ముఖ్యంగా భారత్‌కు ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. ఇదే ఏడాది, అంటే 2020లో ధరలు దాదాపు 45 శాతం పడిపోయాయి. ఎందుకంటే, జనవరి తర్వాత చమురు ధరల్లో వేగంగా పతనం ప్రారంభమైంది.
చమురు ధరలు పడిపోవడానికి ప్రధానంగా రష్యా, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలే కారణం. చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్)లో సౌదీ అరేబియా అత్యంత ప్రభావవంతమైన సభ్యదేశం. ఇది ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారు కూడా. ఒపెక్‌లో సభ్యులు కాకుండా ఉన్న చమురు దేశాలలో రష్యాది అత్యంత ప్రముఖ స్థానం.
ఈ రెండు గ్రూపుల దేశాలూ గత కొంతకాలంగా కలిసి పనిచేస్తూ వచ్చాయి. వీటిని 'ఒపెక్ ప్లస్' అంటారు.
చమురు ధరలు ఒక పరిమితిని దాటి పడిపోకుండా ఉండడానికి ఎంత చమురు ఉత్పత్తి చేయాలో ఒపెక్ ప్లస్ దేశాలన్నీ కలిసి ప్రతి నెలా నిర్ణయిస్తాయి.
ధరలు పడిపోకుండా ఉండాలంటే, అన్ని దేశాలు తమకు తాము ఒక పరిమితికి మించి ఉత్పత్తి చేయకుండా ఉండడం అవసరం. ధరలు పడిపోయినప్పుడు ఈ దేశాలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాలని కూడా ఆ ఒప్పందంలో ఉంది.
ఈ ఒప్పందం మార్చి వరకూ నడిచింది. దీనిని కొనసాగించడానికి చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ రష్యా హఠాత్తుగా ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరాకరించడంతోపాటు, తమ చమురు ఉత్పత్తిని పెంచుతామని కూడా ప్రకటించింది.
దానిపై, ఆగ్రహించిన సౌదీ అరేబియా తమ వినియోగదారులకు చమురు ధరల్లో డిస్కౌంట్ ఇస్తున్నట్లు, దేశంలో చమురు ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, PA Media
భారత్‌కు ఇదో చక్కటి అవకాశం, కానీ...
రెండు పెద్ద చమురు ఉత్పాదక దేశాల మధ్య గొడవ ప్రభావంతో చమురు ధరల్లో వేగంగా పతనం వచ్చింది. దానికి తోడు కరోనా వైరస్ భయంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థపై నీలినీడలు కమ్మేశాయి. చమురు డిమాండ్ తగ్గిపోతోంది.
భారత్‌కు ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే భారత్ తన అవసరాల్లో 80 శాతానికి పైగా ముడి చమురు బయట నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2018-19లో భారత్ 112 బిలియన్ డాలర్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది.
ప్రస్తుత సంవత్సరంలో జనవరి నాటికే 87.7 బిలియన్ డాలర్ల ముడి చమురు కొనుగోళ్లు జరిగాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్ రిపోర్ట్ ప్రకారం ముడి చమురు ధరల్లో ఒక డాలర్ తగ్గితే, భారత్ ఇంపోర్ట్ బిల్‌లో 10,700 కోట్ల రూపాయలు తగ్గుతుంది. అంటే, సుమారు 30 డాలర్ల పతనం అంటే భారత ప్రభుత్వానికి దాదాపు 3 లక్షల కోట్ల మిగులు అని అర్థం.
మరో రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం చమురు ధరల్లో 10 డాలర్ల పతనం వల్ల భారత జీడీపీపై సగం శాతం ప్రభావం ఉండవచ్చు. అంటే, దేశ ఆర్థికవ్యవస్థలో సుమారు 15 బిలియన్ డాలర్ల వృద్ధి జరుగుతుంది.
మరోవైపు ఇదే 10 డాలర్ల పతనం వల్ల భారత్‌లో ద్రోవ్యోల్బణం రేటు 0.3 శాతం తగ్గవచ్చు. అంటే 33 డాలర్ల పతనంతో ద్రవ్యోల్బణం రేటు సుమారు 1 శాతం తగ్గవచ్చు.
విషయం అక్కడితో అయిపోదు. ముడి చమురు ధరలు తగ్గడం అంటే, మీకూ, నాకు నెల నెలా పెట్రోల్ ఖర్చు తగ్గి, గ్యాస్ సిలిండర్ చౌకగా దొరుకుందని మాత్రమే కాదు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తోపాటూ అన్నిరకాల పరిశ్రమల్లో ఉపయోగించే ముడి పదార్థాలు చౌక అవుతాయి అని కూడా అర్థం.

చమురు ధరలు తగ్గడం వల్ల ప్రయోజనం ఎవరికి?
ముడి చమురు నుంచి వచ్చే ఎన్నో ముడి పదార్థాలను ఎన్నో పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ను కూడా చాలా పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు.
దాదాపు ప్రతి ఫ్యాక్టరీలోకి వచ్చి, అక్కడి నుంచి బయటపడే సరుకులను తీసుకెళ్లే ట్రక్కుల అద్దెలు కూడా అప్పటి డీజిల్ రేట్ల ఆధారంగానే నిర్ణయిస్తారు. అద్దె తగ్గితే, ముడి పదార్థాలు చౌకగా లభిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో తమ డిమాండ్ పెంచుకోడానికి కంపెనీలు రేట్లు తగ్గించడం గురించి ఆలోచిస్తాయి.
ధరలు తగ్గితే, వినియోగదారులు చేతిలోని డబ్బును ధైర్యంగా ఖర్చు పెట్టడం ప్రారంభిస్తాడు. ఇలా పారిశ్రామిక చక్రం తిరగడం మొదలవుతుంది.
2016లో ఇలాంటి ప్రభావంతోనే ముడి చమురు ధరలు పడిపోయినప్పుడు భారత ప్రభుత్వం పన్ను ఆదాయం గణనీయంగా పెరిగింది.
అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పతనమైతే, ఆ ప్రభావం భారత్‌లో పెట్రోలియం ధరలపై కనిపిస్తుందని, నలువైపుల నుంచీ వస్తున్న చెడు సంకేతాల మధ్య ఇది ఆర్థికవ్యవస్థకు ఒక శుభ సంకేతం అవుతుందని అందరూ ఆశించారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం
కానీ ప్రభుత్వం ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ధరలు పడిపోగానే, అది మరోసారి పాత పద్ధతిలోనే ముందుకెళ్తూ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు మూడు రూపాయలు పెంచేసింది.
ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ పెంపుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడానికి అవసరమైన మొత్తం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ఆ సందేశం లోలోపల ప్రభుత్వం తన ఖాళీ ఖజానాను నింపుకోడానికి ప్రజల జేబుకు మరోసారి చిల్లు పెడుతోందనే విషయం దాగి ఉంది.
ఈ పెంపును నేరుగా ఎక్సైజ్ డ్యూటీలో చేయలేదు. బదులుగా దీనిని స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి పెంచారు.
దీంతో, ఈ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలతో కూడా పంచుకోదనే విషయం నేరుగా స్పష్టమవుతోంది. ఈ పెంపుతో వచ్చే మొత్తం డబ్బు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.
ఇప్పుడే ఇలా ఉంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోకుండా ఉంటే ప్రభుత్వం ఏం చేసుండేది అనే విషయం ఆలోచించండి.
ఇప్పుడు ప్రభుత్వం తన దురాశను కాస్త అదుపులో ఉంచుకుని, అదే మొత్తాన్ని ప్రజలు, చిన్న పరిశ్రమలు, పెద్ద పారిశ్రామిక వేత్తల చేతుల్లోకి వెళ్లనిస్తే, దేశ ఆర్థికవ్యవస్థ వేగాన్ని పెంచేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు.
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: స్పెయిన్ ప్రధాన మంత్రి భార్యకు కోవిడ్-19.. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో సమస్తం బంద్.. ప్రజలు బయటకు రావటంపై నిషేధం
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









