థాయ్‌లాండ్: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్, ప్రమాద తీవ్రతను చూపే 8 ఫోటోలు..
- రచయిత, జోనాథన్ హెడ్, థాన్యారత్ డోక్సోన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
థాయిలాండ్‌లో కదులుతున్న రైలుపై క్రేన్ కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 32కి పెరిగింది. మరో 66 మందికి పైగా గాయాలపాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, FireRescue Thailand/Facebook
బ్యాంకాక్‌కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, Nakhon Ratchasima provincial government

సిఖియో జిల్లాలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:00 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని నఖోన్ రాట్చసిమాలోని పోలీసు సూపరింటెండెంట్ థాచపోన్ చిన్నవాంగ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Facebook / State Railway of Thailand
ఎక్స్‌ప్రెస్ ట్రయల్ లైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని ఎస్పీ చెప్పారు. ఈ రైలు బ్యాంకాక్ నుంచి ఈశాన్య థాయిలాండ్‌లోని ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు ప్రయాణిస్తోంది.

ఫొటో సోర్స్, Facebook / State Railway of Thailand
బోల్తాపడిన రైలు బోగీలలో సహాయక సిబ్బంది వెతుకుతున్నారని పోలీసులు బీబీసీకి తెలిపారు.
హైస్పీడ్ రైలు ప్రాజెక్టు మీద పనిచేస్తున్న ఈ క్రేన్ కూలిపోయి కదులుతున్న రైలుపై పడింది. దీంతో అది పట్టాలు తప్పింది. కొద్దిసేపు మంటలు చెలరేగాయి.

ఫొటో సోర్స్, Facebook / State Railway of Thailand
ప్రమాదానికి గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేయాలని రైల్వే గవర్నర్‌ను ఆదేశించినట్లు థాయిలాండ్ ఉప ప్రధాని, రవాణా మంత్రి ఫిపట్ రట్చకిత్ప్రకర్న్ తెలిపారు.
బాధితులు రైల్వే సిబ్బంది అయితే మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని రట్చకిత్ప్రకర్న్ హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
స్థానిక నివాసి మిత్ర ఇంటర్పన్యా ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో మాట్లాడుతూ, తనకు పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత రెండు పేలుళ్లు సంభవించాయని చెప్పారు.
"నేను చెక్ చేయడానికి వెళ్లినప్పుడు, మూడు బోగీలతో కూడిన ప్యాసింజర్ రైలుపై ఒక క్రేన్ పడి ఉండటాన్ని చూశాను" అని అన్నారు.
క్రేన్ లోహం రెండో బోగీ మధ్యలోకి చొచ్చుకుపోవడంతో బోగీ సగానికి తెగిపోయిందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

థాయిలాండ్‌లో నిర్మాణ ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. భద్రతా నియమాలు సరిగా అమలు చేయకపోవడం దీనికి కొంత కారణం.
2023లో తూర్పు థాయిలాండ్‌లోని రైల్వే క్రాసింగ్ వద్ద ఒక సరుకు రవాణా రైలు ఒక పికప్ ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో ఎనిమిది మంది మరణించారు, మరో నలుగురు గాయపడ్డారు.
గత సంవత్సరం మార్చిలో, భూకంపం సమయంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో 100 మందికి పైగా మరణించారు. ఆ సమయంలో బ్యాంకాక్‌లో మరే ఇతర భవనం కూలిపోలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













