సామూహిక సెక్స్, విచ్చలవిడి శృంగారం, మత్తు పదార్థాలు, విలాసవంతమైన విందు.. ప్రాచీన చక్రవర్తులు శ్రుతిమించి సుఖపడేవారా?

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, క్రిస్టియన్ జార్జెస్ ష్వెన్ట్‌జెల్
    • హోదా, బీబీసీ ముండో

ఫెడిరికో ఫెలినీ 1969లో తీసిన సినిమా ‘సటైరికాన్’.. నైతిక విలువలు పాటించని ఇతర చక్రవర్తులపై తీసిన మరికొన్ని సినిమాల్లో మనకు గ్రీకు-రోమన్ల కాలంనాటి ‘‘ఆజీలు’’ అంటే విచ్చలవిడి సామూహిక శృంగార దృశ్యాలు కనిపిస్తాయి.

ఆజీ అనే పదాన్ని అన్నింటిలోనూ శ్రుతి మించడం అనే అర్థంలో ఉపయోగిస్తుంటారు.

కొన్ని పురాతన సంస్కృతుల్లో అన్ని నైతిక విలువలనూ పూర్తిగా పక్కనపెట్టేసి సంపూర్ణంగా ఆ అనుభూతిని ఆస్వాదించేవారనే అర్థంలో ఈ పదాన్ని చరిత్రకారులు ఎక్కువగా వాడుతుంటారు.

మరి నిజంగానే ఈ విచ్చలవిడి శృంగారాన్ని పూర్వీకులు విపరీతంగా ఇష్టపడేవారా?

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

అసలేమిటి ఈ విచ్చలవిడి శృంగారం

గ్రీకు పదం ఆజియా నుంచి ఆజీ అనే పదం వచ్చింది.

డయోనిసస్ లాంటి దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించే ఆచారాలు, సంప్రదాయాలను ఆజియా సూచిస్తోంది. సంతాన దేవతగా డయోనిసస్‌ను పురాతన సంస్కృతుల్లో కొలిచేవారు.

ఆ కల్ట్‌లను ‘మిస్టరీ కల్ట్స్’గా పిలిచేవారు. తమ రహస్యాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని ప్రమాణం చేసిన కొందరిని మాత్రమే వీటిలో చేర్పించుకునేవారు.

ఆజీ అనేది అప్పట్లో విపరీతమైన ‘ఉత్సాహం’, ‘కామానికి’ ప్రతీక.

ఈ ఆజీ సంప్రదాయాల గురించి బయటకు పెద్దగా తెలియదు. సామూహికంగా మత్తులో ముంచే శృంగార చర్యలు, హింసాత్మక విధానాలు దీనిలో భాగమై ఉండొచ్చు.

18, 19వ శతాబ్దాల వరకూ ఫ్రెంచ్ సాహిత్యంలో దీన్ని సామూహిక శృంగార విధానాల్లో ఒకటిగా చూసేవారు. అతిగా ఆహారం, మత్తు పానీయాలు తీసుకున్న అనంతరం సెక్స్‌కు దీన్ని ప్రతీకగా చూసేవారు.

‘‘ఇది ఒక అర్ధరాత్రి పార్టీ. నగ్నంగా ఉండే మహిళలతో చాలా అద్భుతంగా ఇది కనిపిస్తుంది’’ అని 1839లో తన పుస్తకంలో గుస్టావ్ ఫ్లాబెర్ట్ రాసుకొచ్చారు.

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

వేశ్యలు..

అయితే, ఆజీని ఆధునికతకు ప్రతీకగా చూడలేం.

రుచికరమైన భోజనానికి శృంగారాన్ని కలగలిపి ఇచ్చే విందుల గురించి ప్రాచీన పుస్తకాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది.

క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో టిమార్కోపై గ్రీకు రచయిత ఐష్కైన్స్ కొన్ని ఆరోపణలు చేశారు. ఇందులో ‘‘సిగ్గులేకుండా కొన్ని ఆంక్షలు విధించిన సుఖాల్లో’’ టిమార్కస్ తలమునకలయ్యారని కూడా రాశారు.

‘‘తమని తాము గొప్పగా పరిగణించుకునేవారు ఇలాంటి పనులు చేయకూడదు.’’ అని కూడా రాసుకొచ్చారు.

ఇంతకీ నిషేధం విధించిన ఆ సుఖాలు ఏమిటి?

టిమార్కో తన ఇంటికి కొందరు ఫ్లూటు వాయించేవారిని, కొందరు మహిళలను ఆహ్వానించారు.

ఇక్కడ ఫ్లూటు వాయించేవారు కేవలం కళాకారులు మాత్రమే కాదు.

వారిని కేవలం ఫ్లూటు వాయించడానికి మాత్రమే పిలవలేదు.

వీరిలో కొందరు అతిథుల శృంగార కోరికలను కూడా తీర్చాల్సి ఉంటుంది.

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

క్రీ.పూ. నాలుగో శతాబ్దంలో వేశ్యలను పిలిపించడంతోపాటు ఖరీదైన చేపలను విందుల్లో అందుబాటులో ఉంచడంపైనా చర్చ జరిగేది.

‘ద ఫాల్స్ ఎంబసీ’లో ఈ రెండింటి గురించీ డెమోస్థెనీస్ ప్రధానంగా రాశారు.

క్రీ.పూ. 346లో గ్రీసును బెదిరిస్తున్న మాసిడోనియా రాజు ఫిలిప్ 2 ఆస్థానానికి ఏథెన్స్ నగరం కొందరు రాయబారులను పంపించింది.

అయితే, ఏథెన్స్ రాయబారులను తన స్వప్రయోజనాల కోసం పనిచేసేలా ఫిలిప్-2 ఉపయోగించుకునేవారు.

ఆ రాయబారుల్లో ఒకరు రాజు నుంచి తీసుకున్న డబ్బులతో వేశ్యలను, ఖరీదైన చేపలను కొనుగోలు చేసేవారని డెమోస్తనీస్ రాశారు.

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

రోమన్ల దుర్మార్గం..

ఇలాంటి విలాసవంతమైన విందుల గురించి రోమన్ చరిత్రకారులు కూడా తమ రచనల్లో వివరించారు. శృంగారం, విందులను ఎలా కలిపేవారో వీటిలో పేర్కొన్నారు.

క్రీ.శ. 80లలో నియంత సల్లా రోమ్‌లో తొలినాటి సెక్స్ పార్టీలను నిర్వహించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.

గ్రీసుపై ఆయన దండెత్తారు. అక్కడి ఈ శృంగార విందుల విధానాలనూ ఆయన రోమ్‌కు తీసుకొచ్చారు.

నటీమణులు, సంగీత కళాకారులు, హాస్యకారులు, తాత్వికవేత్తలతో కలిసి ఉదయమే సల్లా తాగడం మొదలుపెట్టేవారు. కొన్నిసార్లు ఈ పార్టీలలో వేశ్యలు శ్రుతిమించేవారు.

లాటిన్ చరిత్రకారుడు గయాస్ సూటోనియస్ కూడా జూలియో-క్లాడియన్ వంశానికి చెందిన రెండో చక్రవర్తి టిబేరియస్‌ను విపరీత స్వేచ్ఛకు అలవాటుపడిన వ్యక్తిగా పేర్కొన్నారు.

తన క్యాప్రీ ప్యాలెస్‌లో విపరీతమైన అశ్లీల ప్రదర్శనలను కూడా టిబేరియస్ నిర్వహించేవారని పేర్కొన్నారు.

వీటి కోసం టిబేరియస్ కొందరు యువ నటులను నియమించుకున్నారు.

వీరు ఆయన ముందే ‘స్పింట్రియా’గా పిలిచే శృంగార చర్యల్లో పాల్గొనేవారు.

ఇది గ్రీకు పదం ‘స్పింక్టెర్’ నుంచి వచ్చింది. దీనికి యానల్ సెక్స్ అనే అర్థం ఉంది.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

టిబేరియస్ వారసుడు కలీగుల్లా కూడా అతిథుల ముందు తన అక్కచెల్లెళ్లతోనే శృంగారంలో పాల్గొనేవాడని చరిత్రకారులు పేర్కొన్నారు.

ఒక వైపు వివాహేతర బంధం, మరోవైపు శృంగారాన్ని బహిరంగంగా ప్రదర్శించడం.. ఇలా రెండు నిషేధాలను ఆయన తుంగలోకితొక్కారు.

తన భార్య సెసోనియాను నగ్నంగా గుర్రం మీదకు ఎక్కించి కూడా ఆయన అతిథులకు చూపించేవారు.

దాదాపు దీనికి 20 ఏళ్ల తర్వాత రోమన్ చక్రవర్తి నీరో కూడా ఇలాంటి విచ్చలవిడి విందులను మధ్యాహ్నం నుంచి రాత్రివరకూ నిర్వహించేవారని సుటోనియస్ రాసుకొచ్చారు.

ఈ విందుల్లో అన్ని ఇంద్రియాలనూ సంతృప్తిపరిచేవారు.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

బానిసలు పైనుంచి పూలను వర్షంలా జల్లుతుంటే, పరిమళ ద్రవ్యాలను వెదజల్లుతుంటే.. ఇక్కడ విలాసవంతమైన భోజనం, కమ్మని సంగీతం, రెచ్చగొట్టే శృంగారాలతో విందులు ఏర్పాటుచేసేవారు.

220లలో చక్రవర్తి ఎలాగాబల్ కూడా ఇలానే ఏర్పాటుచేసిన విందులో కొందరు అతిథులు ఊపిడి ఆడక మరణించినట్లు చరిత్రకారుడు ఆగస్టా పేర్కొన్నారు.

రోమన్ సామ్రాజ్యంలో ఒకప్పుడు విపరీతంగా పరిగణించే ఆ విందులు నేటికంటే ఎక్కువైతే లేవు. కాబట్టి ప్రాచీన రచల్లోని కళాత్మక వర్ణనలను మనం తప్పుపట్టకూడదు.

పురాతన రచనలతో మొదలుపెట్టి డామియన్ చాజెల్ సినిమా బాబిలోన్ వరకూ అన్నింటిలోనూ ఈ ఆజీ దృశ్యాలు కనిపిస్తాయి.

విమర్శకులు ఆ సినిమాను అపకీర్తి తెచ్చిపెట్టేదిగా వర్ణిస్తే.. అభిమానులు మాత్రం ఆ దృశ్యాలపై ప్రశంసలు కురిపించారు.

(క్రిస్టియన్ జార్జెస్ ష్వెన్ట్‌జెల్.. లోరైన్ యూనివర్సిటీలో పురాతన చరిత్ర ప్రొఫెసర్)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)