చైల్డ్ పోర్న్ ఫోటోలు చూస్తున్నారంటూ నకిలీ సమన్లు.. రూ.31 కోట్లు వసూలు

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక వేధింపులకు గురవుతున్నపిల్లల చిత్రాలను చూస్తున్నారంటూ కొందరికి నకిలీ కోర్టు సమన్లు పంపించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
ఈ స్కాంలో భాగమైన 19 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్, బెల్జియం దేశాలకు చెందిన పోలీసులు తెలిపారు.
చైల్డ్ పోర్న్ ఫొటోలు చూస్తున్నారంటూ నకిలీ సమన్లు పంపించి.. వారిని విచారిస్తామంటూ బెదిరించి జరిమానా చెల్లించాలంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ ముఠా సభ్యులు.
గత రెండేళ్లలో ఈ ముఠా 31 లక్షల యూరోలు ( సుమారు రూ. 31 కోట్లు) వసూలు చేసినట్లు ఫ్రాన్స్, బెల్జియం పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ముఠా వేధింపుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకున్నట్లు చెప్పారు.
ఆ వ్యక్తిని ఇలా రెండు సార్లు మోసం చేశారు. ఆయన మొదట రూ. 5 లక్షలు, తర్వాత రూ. 6.7 లక్షలు చెల్లించారు.
బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారని, కొన్ని సందర్భాల్లో అది రూ. కోటికి పైగా ఉండేదని స్పెషల్ ఫ్రెంచ్ పోలీస్ అధికారి కల్నల్ థామస్ ఆండ్రూ తెలిపారు.
"ఈ మోసాలన్నీ ఒక కేంద్రం ద్వారా జరుగుతున్నాయని మేం అనుకున్నాం. కానీ, చిన్న చిన్న గ్రూపులు ఈ పని చేస్తున్నాయి" అని కల్నల్ ఆండ్రూ చెప్పారు.
సోమవారం ఫ్రాన్స్‌లో 18 మంది, బెల్జియంలో ఒకరిని అరెస్టు చేశారు. వీరంతా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న వారే.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాదిలోనే 400 మంది ఫిర్యాదు
మోసం ఆరోపణలపై వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.
2021 ప్రారంభంలో ఈ మోసం గురించి తెలిసిన తర్వాత పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ ప్రారంభించింది.
అయితే 2022 జూన్ నాటికి దీనికి సంబంధించి 400 ఫిర్యాదులు అందాయి.
ఎంతమంది మోసపోయారో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరో ఆరుగురు ఆత్మహత్య?
నిందితులు లక్ష్యంగా చేసుకున్న వారిలో మరో ఆరుగురు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
బాధితులు చాలా బాధను అనుభవించారని ఫ్రెంచ్ యాంటీ-సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన కమిషనర్ క్రిస్టోఫ్ డ్యూరాండ్ అన్నారు.
మోసగాళ్లు దోపిడీ చేసిన కొంత డబ్బును ఫ్రాన్స్‌లో ఖర్చు చేశారు.
అయితే అందులో ఎక్కువ భాగం ఐవరీ కోస్ట్, ఇతర ఆఫ్రికన్ దేశాలకు పంపారు.
ఇవి కూడా చదవండి
- ప్రిగోజిన్, వాగ్నర్ గ్రూప్: ఇది తిరుగుబాటేనా? పుతిన్ పీఠాన్ని కదిలించగలరా?
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు
- టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














