తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి పోటెత్తుతున్న వాట్సాప్ కాల్స్ .. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీకు ముప్పే

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి మీకు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా? ఇలా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, మీకు తెలిసినవాళ్లకు కూడా వస్తున్నాయా?

ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని చాలా మంది భారతీయులు ఫిర్యాదు చేస్తున్నారు.

భారతీయ వాట్సాప్ వినియోగదారులు ఇలాంటి ఆడియో, వీడియో కాల్‌ల స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని దేశాల నుంచి ఎక్కువగా ఈ కాల్స్ వస్తున్నాయని ఆయా కోడ్‌లను బట్టి వారు చెబుతున్నారు.

ఇటీవల ఈ కాల్స్ సంఖ్య పెరిగిందని చాలా మంది వాపోతున్నారు.

స్పామ్ కాల్స్‌కు సంబంధించి సర్వీస్ ప్రొవైడర్లు సూచనలు జారీ చేశాయని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

సోషల్ మీడియా

ఫొటో సోర్స్, EPA

వాట్సాప్ ఏమంటోంది?

భారత్‌లో దాదాపు 48.7 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు.

అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాల్సిందిగా వినియోగదారులను వాట్సాప్ కోరింది.

యాప్‌లో ప్రైవసీ ఫీచర్లను వాడాలని, వ్యక్తిగత వివరాలు తమ కాంటాక్టులకు మాత్రమే కనిపించేలా సెటింగ్స్ మార్చి, ఖాతాలను రక్షించుకోవాలని సూచించింది.

"ఇలాంటి అకౌంట్‌లను వాట్సాప్‌కు నివేదించడం చాలా ముఖ్యం. తద్వారా మేం వాటిపై చర్యలు తీసుకుంటాం. ప్లాట్‌ఫామ్ నుంచి వాటిని నిషేధించగలం" అని వాట్సాప్ ప్రతినిధి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

మార్చిలో 47 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది.

ఆన్‌లైన్ మోసాలు, ఇతర బెదిరింపుల నుంచి వినియోగదారులను కాపాడేందుకు సాయపడే వాట్సాప్ టూల్స్ గురించి అవగాహన కల్పించే ప్రచారాన్ని ప్రారంభించినట్లు కంపెనీ వివరించింది.

వాట్సాప్

ఫొటో సోర్స్, Getty Images

వాట్సాప్ స్కాములతో జాగ్రత్త

రోజువారీ కబుర్లు సులభతరం చేయడమే కాకుండా వ్యాపారులకూ ఆసరాగా నిలిచిన వాట్సాప్, ఎప్పటికప్పుడు స్కాములకు వేదికవుతోంది.

కాబట్టి వాట్సాప్ వాడేవాళ్లంతా దానికి సంబంధించిన ప్రైవసీ సెట్టింగ్స్ తెలుసుకుని జాగ్రత్తతో వ్యవహరించాలి.

ఉదాహరణకు మనకు తెలియని ఒక నంబరు నుంచి వీడియో కాల్ వస్తుంది. అది యాక్సెప్ట్ చేస్తే అవతలివారు నగ్నంగా కనిపిస్తారు. మనం డిస్కనెక్ట్ చేసే ఒకటి రెండు నిముషాల్లోనే వాళ్లు స్క్రీన్ షాట్ తీసుకుంటారు.

వాళ్లు అడిగినంత డబ్బు పంపించకపోతే ఆ స్క్రీన్ షాట్‌లను బయటపెడతామని బెదిరిస్తారు. అసభ్యకరమైన ఫోటోల్లో కనిపించడం ఇబ్బందికరం కాబట్టి, చాలా మంది వాళ్లు అడిగినంత డబ్బు చెల్లించేస్తున్నారు.

ఆ నంబరును మన ఫోను నుంచి డిలీట్ చేయడం వంటివాటి వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు సాధారణంగా బృందాలుగా పనిచేస్తుంటారు.

ఒక నంబరు డిలీట్ చేసినా వేరే నంబరు నుంచి బెదిరింపులు కొనసాగిస్తారు.

వాట్సాప్ ప్రైవసీ

ఫొటో సోర్స్, Reuters

ఏం చేయాలి?

వాట్సాప్ వీడియో కాల్స్ వల్ల ఎదురయ్యే ముప్పును ఈ జాగ్రత్తలు తగ్గిస్తాయి.

1. అవసరమైతే తప్ప వీడియో కాల్స్‌ మాట్లాడటం తగ్గించడం మంచిది. ఉచితంగా వస్తుంది కదా అని, సులువు కదా అని వీడియో కాల్స్ చేయడం బాగా పెరిగిపోయింది.

బాగా పరిచయస్తుల నుంచి వచ్చే ఇన్‌కమింగ్ వీడియో కాల్స్ మాత్రమే అటెండ్ చేయడం మంచిది. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఆన్సర్ చేయవద్దు.

2. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ల‌కు వాట్సాప్ చాలా ముఖ్యం. వాళ్లకు తెలియని నంబర్ల నుంచి ఆర్డర్లు/ఎంక్వైరీలు వస్తుంటాయి. అలాంటి వారు ఎప్పుడూ చాట్ చేయని, మాట్లాడని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తకపోవడం మంచిది. కావాలంటే, వాళ్లతో ఒకసారి ఆడియో కాల్ మాట్లాడి నమ్మకం కుదిరాకే వీడియో కాల్‌కి మారాలి.

3. మనం వీడియో కాల్స్ చేసేటప్పుడు మన ఫోనులోని ఫ్రంట్ కెమెరా యాక్టివేట్ అవుతుంది. వీడియో కాల్స్ తరచూ వాడాల్సిన అవసరం ఉన్న వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్నవారు, ఫ్రంట్ కెమెరాని కవర్ చేసుకోవడం మంచిది. ఏదో ఒక స్టికర్ పెట్టడమో, లేదా కాల్ ఆన్సర్ చేస్తున్నప్పుడే ఫ్రంట్ కెమెరాకి ఒక వేలిని అడ్డుపెట్టడమో చేయాలి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)