పురుషుల గంభీరమైన స్వరం అంటే మహిళలకు ఎందుకు అంత ఇష్టం

ప్రేమికులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విల్ పార్క్
    • హోదా, బీబీసీ రీల్స్

తొలి పరిచయంలోనే ఎవరిపైనైనా చెరగని ముద్ర వేయడంలో మాట్లాడే తీరు ప్రభావం చూపిస్తుంది.

ఈ ఒక్క విషయంలోనే కాదు, మన జీవితంలో ప్రతి అంశాన్నీ మాట్లాడే విధానం ప్రభావితం చేస్తుంది.

ఎందుకు ఇలా? ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అనే దానికి మించి చాలా విషయాలను మన స్వరం బయటపెడుతుంటుంది.

మన స్వరం నుంచే మనం మాట్లాడాలని అనుకునే పదాలు, చెప్పాలనుకునే సమాచారం బయటకు వస్తుందని ఫ్రాన్స్‌లోని మాంట్‌పెల్లీర్ యూనివర్సిటీలో లింగ్విస్టిక్స్ రీసెర్చర్ మెలీసా బర్కత్ డెఫ్రాడ్స్ చెప్పారు.

‘‘స్వరం ఆధారంగా మీరు ఆడో మగో తెలుసుకోవడం ఒక్కటే కాదు, మీ వ్యక్తిత్వం కూడా అంచనా వేయొచ్చు. కొన్నిసార్లు మీ సామాజిక స్థితిగతులను కూడా దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు’’అని ఆమె వివరించారు.

ప్రేమికులు

ఫొటో సోర్స్, Getty Images

మానసిక ఆరోగ్యం కూడా..

‘‘ఆర్థికంగా మీరు ఏ స్థాయిలో ఉన్నారో కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు’’అని మెలీసా తెలిపారు.

‘‘అంతేకాదు మానసిక ఆరోగ్యంతోపాటు మొత్తంగా మీ ఆరోగ్యం ఎలా ఉందో కూడా దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీ స్వరంలో ఇంత సమాచారం దాగి ఉంది’’అని ఆమె చెప్పారు.

మనుషుల స్వరాల్లో చాలా స్వల్ప తేడా కనిపిస్తుంది. ఒక్కోసారి కొన్ని సెకనుల పాటు ఆ స్వరాన్ని విన్న తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వారో ఒక అవగాహనకు కూడా వస్తుంటారు.

నిజానికి ఎక్కువమంది ఎలాంటి వాయిస్‌ను ఇష్టపడతారు? లేదా ఎలాంటి స్వరం ఉండే వ్యక్తిని మనం మన నాయకుడిగా ఎంచుకునేందుకు ఇష్టపడతాం?

ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, డీప్ వాయిస్ ఉండే అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరోవైపు గంభీర స్వరం ఉండే వారు కాస్త శక్తిమంతంగా, పని మెరుగ్గా చేసేలా, నమ్మదగిన వ్యక్తులుగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ప్రేమికులు

ఫొటో సోర్స్, Getty Images

స్వరంతో పాపులారిటీ

మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మన వాయిస్, యాక్సెంట్‌పై ప్రభావం చూపిస్తాయి. మన వాయిస్‌కు దగ్గరగా ఉండే వారితోనే మనం ఎక్కువగా స్నేహం చేసేందుకు ఇష్టపడతాం. వారి వాయిస్‌ను అనుకరించడం కూడా మనకు కాస్త తెలిక.

ఎదుటి వ్యక్తుల స్పందనలకు అనుగుణంగా మన వాయిస్, టోన్‌లను మార్చుకోవడం అనేది సర్వ సాధారణమని ఫ్రాన్స్‌లోని లియోన్ యూనివర్సిటీ పరిశోధకురాలు కటార్‌జీనా పిసాసింకీ చెప్పారు.

ఎదుటివారు నెమ్మదిగా మాట్లాడితే, మనం కూడా నెమ్మదిగా మాట్లాడతాం. ఎదుటివారు కాస్త వేగంగా మాట్లాడితే, మనమూ ఆ వేగం అందుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ నైపుణ్యాలే ఎదుటివారితో మెరుగ్గా మాట్లాడేందుకు సాయం చేస్తాయి.

ఇక ప్రేమ, ఆకర్షణ విషయానికి వస్తే, కొన్ని వాయిస్‌లు మనల్ని మరింత ఎక్కువగా ఆకర్షిస్తాయా?

గంభీర స్వరంతో మాట్లాడే రాజకీయ నాయకులను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తుంటారు. మరోవైపు ఇదే వాయిస్ వారు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

‘‘పురుషుల్లోని టెస్టోస్టెరాన్ స్థాయిలు వారి వాయిస్‌పై ప్రభావం చూపిస్తాయి. ఈ హార్మోన్ ఎంత తక్కువగా ఉంటే, వారి స్వరం అంత గంభీరంగా ఉంటుంది’’అని మెలీసా చెప్పారు.

‘‘టెస్టోస్టెరాన్‌ అనేది పురుషుల్లో చాలా అంశాలను ప్రభావితం చేస్తుంది. సంతాన సామర్థ్యంతో మొదలుపెట్టి వాయిస్ వరకు చాలా అంశాలు దీనిపై ఆధారపడి ఉంటాయి. మగవారి స్వరం గంభీరంగా ఉంటే అతడికి లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది’’అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, సంతానలేమికి దోశ పెనం, పిజ్జా బాక్స్ కూడా కారణం అవుతోందా?

మహిళలను మెరుగ్గా ఆకర్షించగలరా?

స్వరం గంభీరంగా ఉంటే, ఆత్మవిశ్వాసంతో కనిపించడంతోపాటు అతడి రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని, అతడిలో నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చని ఆమె చెప్పారు.

అందుకే మహిళలు గంభీరస్వరంతో ఉండే పురుషులను ఎక్కువగా ఇష్టపడతారని వాయిస్ నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో భిన్న ప్రాంతాలకు చెందిన పురుషుల వాయిస్‌లు విన్నప్పుడు హైపిచ్ వాయిస్‌లను మహిళలు ఎక్కువగా ఇష్టపడినట్లు పరిశోధనల్లో తేలిందని మెలీసా కూడా చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా... ఎలా తెలుస్తుంది?

ఇక్కడ అమ్మాయిల్లోనూ హైపిచ్ వాయిస్ కనిపిస్తుంది. దీనికి పురుషులు ఎలా చూస్తారు?

డేటింగ్‌కు వెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు తమ పిచ్‌ను పెంచి మాట్లాడతారని ఒక పరిశోధన వెల్లడించింది. అయితే, ఆకర్షణీయంగా కనిపించే పురుషుల ముందు కొంతమంది మహిళలు స్వరం తగ్గించి మాట్లాడతారని మరికొన్ని పరిశోధనలు తెలిపాయి.

ఈ విషయంపై ఫ్రాన్స్‌లోని లియోన్ యూనివర్సిటీ పరిశోధకురాలు కటార్‌జీనా ఒక అధ్యయనం కూడా చేపట్టారు. ఆరు నిమిషాల పాటు పురుషులతో మాట్లాడిన తర్వాత వారికి రేటింగ్ ఇవ్వాలని మహిళలకు ఆమె సూచించారు. వారి సంభాషణలను కూడా ఆమె రికార్డు చేశారు.

ఎదుటి వ్యక్తులు తమకు నచ్చినప్పుడు మహిళలు స్వరం తగ్గించి మాట్లాడినట్లు కటార్‌జీనా గుర్తించారు. మరోవైపు తమకు ఎదుటి వ్యక్తి నచ్చనప్పుడు స్వరం హెచ్చించి మాట్లాడినట్లు గమనించారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. మృదువైన స్వరంతో మాట్లాడే మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఫ్రెంచ్ పురుషుల, మహిళలపై జరిగిన మరో అధ్యయనంలో.. డీపర్ వాయిస్‌లను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)