అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’

ఫొటో సోర్స్, Getty Images
మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రం సినలోవా ఆ దేశంలోని అత్యంత శక్తిమంతమైన, ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల ముఠాలకు నిలయం.
ఇక్కడి ముఠాలు సాగించే మాదకద్రవ్యాల వ్యాపారం సృష్టించే డబ్బు స్థానిక యువతులు, మత్తుకు బానిసైన వారిపై ప్రభావం చూపుతోంది.
అంతేకాదు ప్లాస్టిక్ సర్జరీలతో శరీరాకృతులు మార్చుకోవడమనే ఒక పిచ్చి వ్యామోహాన్నీ పెంచిపోషిస్తోంది.
'నార్కో ఈస్థటిక్' బాడీ కోసం..
కులికన్ నగరంలోని తన క్లినిక్‌లో కూర్చున్న డాక్టర్ రఫేలా మార్టినెజ్ టెరాజస్ ఎదురుగా కట్టలుకట్టలుగా దరఖాస్తులున్నాయి. అవన్నీ ప్లాస్టిక్ సర్జరీ కోసం యువతులు పెట్టుకున్న దరఖాస్తులు.
అందులో ఎక్కువ శాతం 'నార్కో ఈస్థటిక్' బాడీ కోసం సర్జరీ చేయించుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తులే.
నార్కో ఈస్థటిక్ బాడీ షేప్ అంటే.. ''బాగా సన్నని నడుము, విశాలమైన కటి భాగం, దానికి తగ్గట్టుగా భారీ వక్షోజాలు ఉండే శరీరాకృతి'' అని చెప్పారు డాక్టర్ రఫేలా.
ఇలాంటి రూపమున్న ఆడవారిని మెక్సికోలో సాధారణంగా 'లా బుచోనా' అంటారు. మరీ ముఖ్యంగా మాదకద్రవ్యాలు వాడే, డిజైనర్ వస్తువులు, ఖరీదైన యాక్సెసరీస్ వాడుతూ ఇలాంటి రూపంలో కనిపించే ఆడవారిని లా బుచోనా అంటారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
''నా దగ్గరకు ఈ సర్జరీల కోసం వచ్చే పేషెంట్ల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. ఒక్కోసారి 18 ఏళ్ల లోపు అమ్మాయిలు కూడా వస్తుంటారు'' అన్నారు డాక్టర్ రఫేలా.
''సన్నని నడుము, బెస్ట్ బాడీ కోసం అమ్మాయిలు ఒకరితో ఒకరు పోటీపడతారు'' అన్నారామె.
ఇలాంటి సర్జరీల కోసం వచ్చేవారిలో కొందరు తల్లులు, స్నేహితులతో కలిసి వస్తారు. మరికొందరు ఎవరైనా పురుషుడితో కలిసి వస్తారని చెప్పారు డాక్టర్ రఫేలా.
''కొందరు తమ బాయ్ ఫ్రెండ్స్‌తో కూడా వస్తారు. ఆ బాయ్ ఫ్రెండే ఈ సర్జరీకి డబ్బులు ఇస్తారు. మరికొందరైతే నాకు ఫోన్ చేసి డాక్టర్ గారూ... ఒక అమ్మాయిని పంపిస్తున్నాను. ఆపరేషన్ చేయండి అని కూడా చెబుతారు'' అంటూ అక్కడి పరిస్థితులను వివరించారు రఫేలా.
కొందరైతే తాము పంపించే అమ్మాయి చెప్పినట్లు కాకుండా తాము చెప్పినట్లు చేయాలని, తాము డబ్బు చెల్లించేది కూడా అందుకేనని ఫోన్‌లో చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయిని ఒప్పించాకే తన దగ్గరికి పంపించాలని చెబుతానని రఫేలా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ 'లా బుచోనా'?
ఒక్క మాటలో వర్ణించాలంటే 'ఇసుక గడియారం' లాంటి శరీరాకృతిని లా బుచోనా అంటారు. ఇది శస్త్రచికిత్సతో తెచ్చిపెట్టుకున్న అందం.
ఈ లా బురోనా గర్ల్‌ఫ్రెండ్స్ అంటే మాదకద్రవ్యాల వ్యవహారాల్లో ఉన్నవారు ఇష్టపడతారు.
అయితే, ఇలాంటి శరీరాకృతి పొందిన ఆడవారిలో చాలామంది ఫ్యాషన్ కోసమే తాము అలాంటి రూపంలోకి మారాం కానీ మాదకద్రవ్యాల వ్యాపారులు, స్మగ్లర్లతో తమకేమీ సంబంధం లేదంటారు.
పైన ఉన్న ఫొటోలో హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్ రూపాన్ని కూడా ఒక్కోసారి బుచోనాగానే అభివర్ణిస్తారు.
డాక్టర్ రఫేలా దగ్గరకు ఒకరు 30 మంది అమ్మాయిలను పంపించారు. వారందరికీ లైపోస్కల్ప్చర్ (శరీరాకృతి మార్చే శస్త్రచికిత్స) చేయించడానికే పంపారు. ఒక్కొక్కరికి 6,500 డాలర్లు ఖర్చు. చాలాసార్లు ఈ పేమెంట్లు నగదు రూపంలో జరుగుతాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
''సాధారణంగా ఇలాంటి వ్యవహారాలలో ఉపయోగించే డబ్బంతా మాదకద్రవ్యాల వ్యాపారం నుంచి వచ్చేదే. ఒకప్పుడు నేను ఇది కరెక్ట్ కాదని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా నా మనసేమీ మార్చుకోలేదు. కానీ, తప్పాఒప్పా అనేది ఎక్కువగా ఆలోచించడం మానేశాను. సినలోవాలో ఆర్థిక వ్యవస్థ అంతా మాదక ద్రవ్యాల వ్యాపారంపైనే ఆధారపడింది. రెస్టారెంట్లు, బార్లు, హాస్పిటల్‌లు అన్నీ ఆ డబ్బుపైనే మనుగడ సాగిస్తున్నాయి'' అన్నారు డాక్టర్ రఫేలా మార్టినెజ్.
ఆపరేషన్ చేయడానికి ముందు ఆ యువతులు, మహిళలతో మాట్లాడుతానని... మీ శరీరం మీ ఇష్ట ప్రకారం ఉండాలి కానీ ఈ సర్జరీ కోసం డబ్బు చెల్లించే బాయ్ ఫ్రెండ్‌కి నచ్చినట్లుగా ఉండేందుకు కాదని.. బాయ్ ఫ్రెండ్ ఎన్నాళ్లు మీతో ఉంటాడో కానీ మీ శరీరం మీతో చివరి వరకు ఉంటుందని, ఆలోచించుకోమని చెబుతానని రఫేలా అన్నారు.
తన వద్దకు కన్సల్టేషన్ కోసం వచ్చేవారిని ఎందరినో చూశానని.. ఆడామగా మధ్య తాత్కాలిక సంబంధాలు సినలోవాలో చాలా సాధారణమని, అందుకే అమ్మాయిలను ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెబుతానని రఫేలా తెలిపారు.
''మాదక ద్రవ్యాల వ్యవహారాల్లో ఉండే ప్రతి మగవాడికీ పక్కన కత్తిలాంటి అమ్మాయి ఉండాల్సిందే. నార్కోలంటేనే పక్కన అందమైన అమ్మాయిలు ఉంటారు'' అని పెడ్రో(పేరు మార్చాం) అనే నార్కో చెప్పారు.
పెడ్రో 30లలో ఉన్న బలిష్టమైన వ్యక్తి. నార్కోగా బయట తెలియాలని ఆయన కోరుకోడు. పర్సనల్ ట్రైనర్‌గా బయటకు చెప్పుకొంటాడు కానీ సినలోవాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు.
''మగవాళ్లు ఆడవాళ్ల కోసం పోటీ పడతారు. భార్య అంటే ఇంట్లో పిల్లలను చూసుకునేలా ఉండాలి. కానీ, అదనంగా మనం పొందే ఆడవాళ్లు ట్రోఫీలు లాంటివారు'' అంటాడు పెడ్రో.
ఒక నార్కో భార్య..
సినలోవాను మాదకద్రవ్యాల ముఠాలను నడిపించి అరెస్టయిన పేరుమోసిన డ్రగ్ మాఫియా లీడర్ 'ఎల్ చాపో' గుజ్‌మన్ భార్య ఎమ్మా కరోనెల్ ఈస్పురో.
2007లో టీనేజ్ వయసులో మెక్సికోలోని డ్యురాంగోలో ఒక అందాలపోటీలో ఆమె గుజ్‌మన్‌ను కలిశారు.
ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు అదే రోజు అంగీకారం తెలిపారామె.
ఇక పెడ్రో ఈ 'లా బుచోనా'ల గురించి ఇంకా ఎన్నో వివరాలు చెప్పారు.
''అలాంటి శరీరం కావాలనుకున్న ఆడవాళ్లు సర్జరీ కోసం డబ్బు పెట్టే మగవారి కోసం చూస్తారు. ఆపరేషన్‌కు డబ్బులిస్తే ఆర్నెళ్లు ఈ శరీరం నీది అని ఒప్పుకొంటారు. కేవలం సర్జరీల కోసమే కాదు ఒక్కోసారి కార్లు, ఇళ్లు, డబ్బు, విలాస వస్తువుల కోసం ఈ అనధికారిక ఒప్పందాలు జరుగుతాయి'' అన్నారు పెడ్రో.

ఫొటో సోర్స్, Getty Images
'గాడ్ ఫాదర్'
సినలోవాలో పేదరికం ఎక్కువ. అనేక సాయుధ ముఠాలున్న కారణంగా అక్కడ ప్రజల జీవితం కూడా నిత్యం ప్రమాదంలోనే ఉంటుంది. ఇలాంటి చోట 'గాడ్ ఫాదర్'(శక్తిమంతమైన నార్కోలు) ఉంటే అమ్మాయిలకు విలాస జీవితమే కాదు రక్షణ కూడా దొరుకుతుందని చాలామంది భావిస్తారు.
కార్మెన్(అసలు పేరు కాదు) కూడా ఇలాంటి గాడ్‌ఫాదర్ కోసమే చూస్తున్నప్పుడు ఒక నార్కో ఆమెకు పరిచయమయ్యాడు.
సినలోవాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన పేదకుటుంబం నుంచి వచ్చిన కార్మెన్ ఇల్లొదిలి కులియకాన్ నగరానికి వచ్చింది.
అక్కడ ఒక నార్కోతో పరిచయమైన తరువాత అతడితో లైంగిక సంబంధమేర్పడింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
''నీకు గాడ్ ఫాదర్‌గా ఉంటాను'' అని చెప్పాడు. అప్పటి నుంచి పిలిచినప్పుడల్లా ఆయన దగ్గరకు వెళ్లొస్తుండేది కార్మెన్. ఆ ముఠాలలో వారంతా ఆమెను గుర్తుపట్టేవారు. డబ్బుకు, విలాసవంతమైన జీవితానికి ఆమెకు లోటు లేకుండా చూసుకునేవాడు. ఆ నగరంలో ఆమె ధైర్యంగా తిరగగలిగేది.
ఆ నార్కోకు తనలా ఇంకెంతమందితో సంబంధాలున్నాయనే విషయం ఆమెకు తెలియదు.
కొన్నాళ్ల తరువాత ఆ నార్కో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడని కార్మెన్ చెప్పింది.

ఫొటో సోర్స్, Instagram
20కి పైగా సర్జరీలు చేయించుకున్న బ్యుటీషియన్
జానెట్ క్వింటరో ఒక హెయిర్, బ్యూటీ సెలూన్ నడుపుతారు. ఆమె 20కిపైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు.
''శరీరంలో నాకు నచ్చని భాగాన్ని నచ్చిన రీతిలోకి మార్చుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నాకు ఇష్టం'' అంటారామె.

ఫొటో సోర్స్, Alamy
నార్కోస్‌తో తిరిగే అమ్మాయిల జీవితాలు ఎప్పుడెలా అంతమవుతాయో తెలియదు. సినలోవాలోని అతి పెద్ద నగరమైన కులియకాన్‌లో ఇంకే మెక్సికన్ నగరంలోనూ లేనంతగా మహిళలు హత్యకు గురవుతున్నారని న్యాయవాది మారియా థెరెసా గెర్రా చెప్పారు.
''ఒక అమ్మాయి హత్య కేసు చూశాను. ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక నార్కో. ఆమెకు కాస్మోటిక్ సర్జరీ చేయించింది బాయ్ ఫ్రెండే. ఆమెను చంపినప్పుడు హంతకులు ఆమె వక్షోజాలు, పిరుదులపై తూటాలతో కాల్చారు. తాను పెట్టుబడి పెట్టి తయారుచేయించిన శరీరాంగాలు అని ఆ నార్కో భావించడం వల్లే అలా వక్షోజాలు, పిరుదులపై కాల్చాడు'' అన్నారు మారియా.
'నార్కోలతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలని ప్రయత్నించే ఆడవాళ్లూ నాకు తెలుసు. కానీ, అది చాలా క్లిష్టమైన వ్యవహారం'' అంటారు మారియా.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









