టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, సూర్యాన్శీ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రణాళిక ప్రకారం 2020లోనే ప్రస్తుత ఒలింపిక్స్ జరగాలి. అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ వీటిని వాయిదా వేశారు.
దీంతో ఏడాది ఆలస్యంగా, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్‌లోని టోక్యోలో ఈ పోటీలు జరగబోతున్నాయి.
అయితే, ప్రారంభ కార్యక్రమానికి రెండు రోజుల ముందే, అంటే జులై 21నే ఫుకుషిమాలో ‘‘సాఫ్ట్‌బాల్’’ పోటీలు మొదలవుతాయి.
33 విభాగాల్లో 339 పతకాల కోసం ఈ సారి క్రీడాకారులు పోటీ పడబోతున్నారు. తొలి పతాక ప్రధాన కార్యక్రమం జులై 24న నిర్వహిస్తారు.
ఇప్పుడు కూడా ఈ పోటీలతో కరోనావైరస్ కేసులు పెరగవచ్చనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న అనంతరం జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ పచ్చజెండా ఊపాయి.
టోక్యోలో జరుగుతున్న ఈ వేడుకలను జపాన్ మినహా విదేశీయులు నేరుగా చూసేందుకు అనుమతి లేదు.
ఇదివరకు కూడా మూడు సార్లు (1964, 1972, 1988) ఒలింపిక్స్‌కు జపాన్ ఆతిథ్యం వహించింది.
భారత్‌లో చూడడం ఎలా?
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల నుంచి ఆగస్ట్ 8న చివరి రోజు పోటీల వరకు అన్ని కార్యక్రమాలు భారత్‌లో కొన్ని టీవీ చానళ్లలో, ఆన్‌లైన్‌లో చూడొచ్చు.
ఇండియా పాల్గొనే ఈవెంట్లను దూరదర్శన్ నెట్‌వర్క్ హిందీలో ప్రసారం చేస్తుంది.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ భారత్‌లో ఈ ప్రసారాలను తనకు చెందిన 5 నెట్‌వర్క్ చానళ్లు సోనీ సిక్స్, సోనీ టెన్ 1, సోనీ టెన్ 2, సోనీ టెన్ 3, సోనీ టెన్ 4లలో నాలుగు భాషలలో అందిస్తోంది.
వీటితో పాటు'సోనీ లైవ్' ప్లాట్‌ఫాంలో కూడా ఈవెంట్లను చూడొచ్చు. టీవీ, స్మార్ట్‌ఫోన్ రెండింట్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్ చిహ్నం ఏమిటి?
టోక్యో ఒలింపిక్స్ చిహ్నాన్ని ‘‘మిరాయిటోవా’’గా పిలుస్తున్నారు. దీన్ని జపాన్ సంప్రదాయ నీలం రంగుతో సిద్ధంచేశారు.
జపనీస్ సాహిత్యంలో మిరాయిటోవాకు ప్రత్యేక స్థానముంది. ఇటు సంస్కృతి, అటు ఆధునికీకరణలను ఇది ప్రతిబింబిస్తుంది.
జపనీస్‌లో మిరాయ్ అంటే భవిష్యత్తు. టోవా అంటే శాశ్వతమైనది అని అర్థం.

ఫొటో సోర్స్, Getty Images
పతకాలను ఎలా తయారుచేశారు?
పోటీల్లో గెలుపొందే క్రీడాకారులకు ఇచ్చే పతకాలను పాత ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్ వ్యర్థాలతో తయారుచేశారు. దీని కోసం పాత ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తమకు ఇవ్వాలని 2017 ఫిబ్రవరిలో ప్రజలను ఒలింపిక్స్ నిర్వాహకులు అభ్యర్థించారు.
2010లో వాంకూవర్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులతోనే పతకాలను తయారుచేశారు.
పతకం వెనుకవైపు టోక్యో ఒలింపిక్స్ లోగో ఉంటుంది. మరోవైపు ఒలింపిక్స్ స్టేడియానికి ముందువైపు.. విజయానికి చిహ్నంగా భావించే గ్రీక్ దేవత ‘‘నైక్’’ విగ్రహం కూడా ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒలింపిక్స్ జ్వాల మార్చి 25నే
గ్రీస్‌లోని చరిత్రాత్మక ఒలింపియా పట్టణంలో హెరా దేవాలయంలో గత ఏడాది మార్చి 12నే టోక్యో ఒలింపిక్స్ జ్వాలను వెలిగించారు. గ్రీస్‌లోని పనాథెనియక్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ జ్వాలను జపాన్‌కు అందించారు.
జపాన్‌లో మార్చి 25నే టార్చ్ రిలే మొదలైంది. 2011లో సునామీతో తీవ్రంగా ప్రభావితమైన ఫుకుషిమాలో ఈ కవాతు మొదలైంది.
121 రోజులపాటు 47 ప్రావిన్స్‌లలో తిరిగిన అనంతరం చివరగా జులై 23తో ఈ ప్రదర్శన ముగుస్తుంది. టోక్యో ఒలింపిక్స్ వెబ్‌సైట్‌లో దీన్ని లైవ్ ఇస్తున్నారు.
జపాన్‌లోని స్థానికులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఈ ప్రదర్శనను చూడొచ్చని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని టోక్యో ఒలింపిక్స్ సీఈవో తొషిరో ముత్సు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకత ఏమిటి?
ఈ సారి ఐదు ప్రత్యేక స్పోర్ట్స్ విభాగాలను కూడా ఒలింపిక్స్‌లో చేర్చారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్‌లను కొత్తగా ఒలింపిక్స్‌లో భాగం చేశారు.
ఇటీవల కాలంలో రద్దుచేసిన మరికొన్ని స్పోర్ట్స్ కూడా మళ్లీ ఒలింపిక్స్‌లో భాగం కాబోతున్నాయి.
- టేబుల్ టెన్నిస్: మిక్సిడ్ డబుల్స్‌ను మళ్లీ నిర్వహించబోతున్నారు.
- జూడో: 1964 నుంచే దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి మిక్సిడ్ టీమ్ జూడోను కూడా నిర్వహిస్తున్నారు.
- స్విమ్మింగ్: ఈ సారి స్విమ్మింగ్ పోటీల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. పురుషుల విభాగంలో 800 మీటర్ల రేసును కూడా నిర్వహించబోతున్నారు. మరోవైపు మహిళల విభాగంలో 1,500 ఫ్రీస్టైల్ పోటీలను కూడా నిర్వహిస్తారు.
- వాటర్‌పోలో: రియో ఒలింపిక్స్‌లో ఎనిమిది క్రీడాకారిణుల బృందాలు పాల్గొన్నాయి. ఇప్పుడు ఈ బృందాల సంఖ్యను పదికి పెంచారు.
- రోయింగ్: పురుషుల రోయింగ్ విభాగంలో నాలుగు రోయింగ్ పోటీలను తొలగించారు. వీటి స్థానంలో నాలుగు మహిళల రోయింగ్ పోటీలను చేర్చారు. 1966 తర్వాత రోయింగ్‌లో మార్పులు చేయడం ఇదే తొలిసారి.
- ఆర్చరీ: 1972 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఈ సారి మిక్సిడ్ టీం పోటీలు కూడా నిర్వహించబోతున్నారు.
- బాక్సింగ్: మహిళల బాక్సింగ్ పోటీల సంఖ్యను పది నుంచి పన్నెండుకు పెంచారు. పురుషుల పోటీల సంఖ్యను పది నుంచి 13కి పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత మంది భారత క్రీడాకారులు అర్హత సాధించారు?
ఇప్పటివరకు భారత్ నుంచి 116 మంది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.
అర్చరీ
- దీపికా కుమారి, ఉమెన్స్ రీకర్వ్ సింగిల్స్ ఆర్చరీ
- తరుణ్ దీప్ రాయ్, మెన్స్ రీకర్వ్ సింగిల్స్ ఆర్చరీ
- అతుల్ దాస్, మెన్స్ రీకర్వ్ సింగిల్స్ ఆర్చరీ
- ప్రవీణ్ జాదవ్, మెన్స్ రీకర్వ్ సింగిల్స్ ఆర్చరీ
- ముగ్గురు పురుష క్రీడాకారులు ఒలింపిక్స్‌లో ఒక బృందంగా పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అథ్లెటిక్స్
జావెలిన్ త్రో క్రీడాకారులు నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్ పతకాలు తీసుకొస్తారని ఇప్పటికే విశ్వాసం వ్యక్తంచేశారు.
టోక్యో ఒలింపిక్స్‌లో 20 మీ. రేస్ వాక్‌లో పాల్గొనేందుకు కేటీ ఇర్ఫాన్ మార్చి 2019లో అర్హత సాధించారు. టోక్యోలో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్ ఆయనే.
4x400 మిక్సిడ్ రేస్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించిన వారిలో ఏసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత మహమ్మద్ అనాస్ కూడా ఉన్నారు.
2020 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు వీరు మూడో స్థానాన్ని తెచ్చిపెట్టారు.
- కేటీ ఇర్ఫాన్, 20 మీ. మెన్స్ సింగిల్స్ రేస్ వాక్
- సందీప్ కుమార్, 20 మీ. మెన్స్ సింగిల్స్ రేస్ వాక్
- రాహుల్ రోహిల్లా, 20 మీ. మెన్స్ సింగిల్స్ రేస్ వాక్
- అవినాశ్ సాబ్లే, 3000 మీ. మెన్స్ సింగిల్స్ స్టీపెల్‌చేస్
- మురళీ శ్రీ శంకర్, మెన్స్ సింగిల్స్ లాంగ్ జంప్
- నీరజ్ చోప్రా, మెన్స్ సింగిల్స్ జావెలిన్ త్రో
- శివ్‌పాల్ సింగ్, మెన్స్ సింగిల్స్ జవెలిన్ త్రో
- కమల్‌ప్రీత్ కౌర్, ఉమెన్స్ సింగిల్స్ డిస్కస్ త్రో
- భావన జాట్, ఉమెన్స్ సింగిల్స్ 20 కి.మీ. రేస్ వాక్
- ప్రియాంకా గోస్వామి, ఉమెన్స్ సింగిల్స్ 20 కి.మీ. రేస్ వాక్

ఫొటో సోర్స్, Getty Images
బాక్సింగ్
- మేరీ కోమ్, (మహిళల 51 కేజీల విభాగం)
- వికాస్ కిషన్ (పురుషుల 69 కేజీల విభాగం)
- లోవ్లినా బోర్గోహైన్ (మహిళల 69 కేజీల విభాగం)
- ఆశిష్ కుమార్ (పురుషుల 75 కేజీల విభాగం)
- పూజా రాణి (మహిళల 75 కేజీల విభాగం)
- సిమ్రాన్‌జీత్ కౌర్ (మహిళల 60 కేజీల విభాగం)
- సతీశ్ కుమార్ (పురుషుల 91 కేజీల విభాగం)
- అమిత్ పనఘల్ (పురుషుల 52 కేజీల విభాగం)
- మనీశ్ కౌశిక్ (పురుషుల 63 కేజీల విభాగం)

ఫొటో సోర్స్, Getty Images
ఫెన్సింగ్
తొలిసారిగా ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్‌లో భారత తరఫున పాల్గొనేందుకు భవానీ దేవి అర్హత సాధించారు.
హంగరీలో జరిగిన బుడాపెస్ట్ సాబెర్ వరల్డ్ కప్‌లో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్ టికెట్ సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
హాకీ
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత్‌లోని ఇటు పురుషుల జట్టు, అటు మహిళల జట్టు.. రెండు జట్లూ అర్హత సాధించాయి.
16-16 మంది సభ్యులున్న ఈ జట్లు నవంబరు 2019లో అర్హత సాధించాయి.
వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు నాలుగో స్థానంలో ఉంది. మహిళల జట్టు మూడో స్థానంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
షూటింగ్
- అంజుమ్ ముగ్దిల్, 10 మీ. ఉమెన్స్ సింగిల్స్ ఎయిర్ రైఫిల్
- అపూర్వి చందేలా, 10 మీ. ఉమెన్స్ సింగిల్స్ ఎయిర్ రైఫిల్
- దివ్యాన్ష్ సింగ్ పన్వార్, 10 మీ. మెన్స్ సింగిల్స్ ఎయిర్ రైఫిల్
- దీపక్ కుమార్, 10 మీ. మెన్స్ సింగిల్స్ ఎయిర్ రైఫిల్
- తేజస్విని సావంత్, 50మీ. ఉమెన్స్ సింగిల్స్ 3 పొజిషన్స్ రైఫిల్
- సంజీవ్ రాజ్‌పుత్, 50 మీ. మెన్స్ సింగిల్స్ 3 పొజిషన్స్ రైఫిల్
- ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్, 50 మీ. మెన్స్ సింగిల్స్ పొజీషన్ రైఫిల్
- మను భాకెర్, 10 మీ. ఉమెన్స్ సింగిల్స్ ఎయిర్ పిస్టల్
- యశస్విని సింగ్ దేశ్వాల్, 10 మీ. ఉమెన్స్ సింగిల్స్ ఎయిర్ పిస్టల్
- సౌరభ్ చౌధరి, 10 మీ. మెన్స్ సింగిల్స్ ఎయిర్ పిస్టల్
- అభిషేక్ వర్మ, 10 మీ. మెన్స్ సింగిల్స్ ఎయిర్ పిస్టల్
- రాహి సర్ణోబత్, 25 మీ. ఉమెన్స్ సింగిల్స్ ఎయిర్ పిస్టల్
- చింకీ యాదవ్, 25 మీ. ఉమెన్స్ సింగిల్స్ ఎయిర్ పిస్టల్
- అంగద్ వీర్ సింగ్ బజ్వా, మెన్స్ సింగెల్స్ స్కీట్
- మిరాజ్ అహ్మద్ ఖాన్, మెన్స్ సింగిల్స్ స్కీట్

ఫొటో సోర్స్, Getty Images
టేబుల్ టెన్నిస్
- శరత్ కమల్
- జీ సాథియాన్
- సుతీరథ ముఖర్జీ
- మణికా బాత్రా
ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు శరత్ కమల్ అర్హత సాధించడం ఇది నాలుగోసారి.
శరత్ కమల్, మణికా బాత్రా మిక్సిడ్ డబుల్స్ విభాగంలోనూ పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Getty Images
రెజ్లింగ్
- వినేశ్ ఫోగట్, విమెన్స్ సింగిల్స్ ఫ్రీస్టైల్ (53కేజీలు)
- బజరంగ్ పూణియా, మెన్స్ సింగిల్స్ ఫ్రీస్టైల్ (65కేజీలు)
- రవికుమార్ దహియా, మెన్స్ సింగిల్స్ ఫ్రీస్టైల్ (57కేజీలు)
- దీపక్ పూణియా, మెన్స్ సింగిల్స్ ఫ్రీస్టైల్ (86కేజీలు)

ఫొటో సోర్స్, Getty Images
బ్యాడ్మింటన్
మహిళ సింగిల్స్‌కు పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌కు సాయి ప్రణీత్ అర్హత సాధించారు.
మెన్స్ డబుల్స్ విభాగంలో తొలిసారిగా సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పాల్గొనబోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈక్వెస్ట్రియన్
ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో పాల్గొనడం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
ఆసియన్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించిన ఫవాద్ మీర్జా భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు.
మరోవైపు మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 నడుమ కొత్త మార్పులు ఇవే..
కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు.
- అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్‌ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది.
- పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో ఆనందోత్సాహాలను వ్యక్తం చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
- అంతర్జాతీయ వాలంటీర్లు కూడా రావడానికి వీల్లేదు. అంటే భారత్ నుంచి వెళ్లే సహాయకులు, ఇతర సిబ్బందిని తగ్గించాల్సి వస్తుంది.
- జపాన్‌లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14 రోజుల క్వారంటైన్ పాటించాలి. నేరుగా వారు ట్రైనింగ్ శిబిరాల్లోకి వెళ్లాలి.
- క్రీడాకారులందరికీ ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కరోనా టెస్టు నిర్వహిస్తారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే, పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించరు.
- క్రీడాకారులంతా వ్యాక్సీన్లు తీసుకోవడం తప్పనిసరేమీ కాదు.
- పర్యటక ప్రాంతాలు, రెస్టారెంట్లు, బార్లను చూసేందుకు క్రీడాకారులకు అనుమతి లేదు.
- ఒలింపిక్స్ గేమ్స్‌కు కొన్ని రోజుల ముందే, టోక్యోలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇది ఒలింపిక్స్ సమయంలోనూ కొనసాగుతుంది.
- ఒలింపిక్స్ జులై 23న మొదలవుతాయి. ఆగస్టు 8 వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. ఆగస్టు 26 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని జపాన్ ప్రధాని ఇప్పటికే స్పష్టంచేశారు.
- జపాన్‌లో ఏప్రిల్ నెలలో కరోనావైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. అయితే, మొత్తంగా చూసుకుంటే జులైనాటికి ఇక్కడ 8 లక్షల వరకు కేసులు నమోదుఅయ్యాయి. మరణాల సంఖ్య 15,000కు చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








