దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు

దానిష్ సిద్దిఖీ

ఫొటో సోర్స్, DASNISH SIDDIQUI/REUTERS

ఫొటో క్యాప్షన్, దానిష్ సిద్దిఖీ

పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్‌లో ఆ దేశ బలగాలు, తాలిబన్‌ల మధ్య సాగుతున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

2010 నుంచి రాయిటర్స్ వార్తా ఏజెన్సీకి పనిచేస్తున్న సిద్దిఖీ అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలు.. రోహింజ్యా సంక్షోభం, హాంకాంగ్ నిరసనలు, నేపాల్ భూకంపం వంటివి కవర్ చేశారు.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సిద్దిఖీ ఇటీవల తీసిన చిత్రం ఇది. కాందహార్ ప్రాంతంలో రాత్రిపూట చేపట్టిన ఓ మిషన్‌లో పాల్గొన్న అఫ్గాన్ సైనికుడు

రోహింజ్యా సంక్షోభం రాయిటర్స్ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీకి 2018లో పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఆ డాక్యుమెంటరీ బృందంలో సిద్దిఖీ కూడా ఒకరు.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫోటోలలో కొన్ని మీకోసం..

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

సిద్దిఖీ తీసిన చివరి చిత్రాలలో ఒకదాంట్లో.. కాందహార్ ప్రావిన్స్‌లోని చెక్‌‌పోస్ట్ వద్ద తాలిబన్‌లపై కాల్పులు జరుపుతున్న అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్ సభ్యుడిని ఫొటో తీశారు.

కాందహార్‌‌లో అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్‌తో కలిసి ఆయన ఈ వారం ప్రారంభం నుంచి తన జర్నలిస్ట్ వృత్తిరీత్యా వెళ్తున్నారు.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

భారత్ నగరాలు, పల్లెలను కమ్మేసిన కరోనా సెకండ్ వేవ్‌లో ఆయన ఎన్నో ఫొటోలు తీశారు.

దిల్లీలోని అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా రోగుల ఫొటో ఆయన తీయగా ఏప్రిల్ 15న ప్రచురితమైంది.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

దిల్లీలోని నివాస ప్రాంతాల పక్కనే ఉన్న ఒక దహన వాటికలో కోవిడ్ మృతుల సామూహిక అంత్యక్రియల చిత్రాన్ని ఆయన తీశారు. కోవిడ్ తీవ్రత, పెద్ద సంఖ్యలో మరణాలకు అద్దం పట్టే ఈ చిత్రం వైరల్‌గా మారింది.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

కోవిడ్‌తో తండ్రి మరణించడంతో తల్లిని ఓదార్చుతున్న పిల్లల ఫొటో ఇది. ఇది సిద్దిఖీ కెమేరా పట్టుకున్న భావోద్వేగం.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

సెకండ్ వేవ్ సమయంలో సిద్దిఖీ దిల్లీ వంటి నగరాలకే కాదు పల్లె ప్రాంతాలు, కొండ ప్రాంతాలకూ వెళ్లారు. కోవిడ్‌ బారిన పడిన మహిళను ఆమె మేనల్లుడు చేతుల్లో మోసుకుంటూ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఈ చిత్రాన్ని సిద్దిఖీ ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాలలో తీశారు.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

2020 ఏప్రిల్‌లో భారత్‌లో లాక్‌డౌన్ విధించిన సమయంలో నగరాల నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు నడుచుకుంటూ సాగిపోయారు. ఉన్న కొద్దిపాటి వస్తువులు, పిల్లలను మోసుకుంటూ రోజంతా నడుస్తూ వెళ్తున్న అలాంటి కుటుంబం ఫొటో ఇది.

దానిష్ సిద్దిఖీ తీసిన ఫొటో

ఫొటో సోర్స్, Reuters

2017 ఆగస్ట్‌లో మియన్మార్ ఆర్మీ విరుచుకుపడడంతో రోహింజ్యాలు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వచ్చారు. ఒక చిన్న బోటులో సముద్రం మీదుగా బంగ్లాదేశ్ చేరుకున్న తరువాత తీరాన్ని తాకుతున్న మహిళ చిత్రాన్ని సిద్దిఖీ 2017 సెప్టెంబరులో తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)