చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’

ఫొటో సోర్స్, @GROMBRE
చిన్న వయసులో జుట్టు తెల్లబడడం ఇప్పుడు మామూలు విషయంగా మారిపోయింది. కానీ, ఇది ఒక వ్యాధి అని మీకు తెలుసా?
వైద్యుల భాషలో ఈ వ్యాధిని కెనాయిటిస్ అంటారు.
మీ వయసు 20 ఏళ్ల కంటే తక్కువ ఉందా? మీ జుట్టు తెల్లబడిపోయిందా? అయితే, మీరు కెనాయిటిస్ బాధితులే.
ఈ వ్యాధి వల్ల జుట్టును తెల్లగా చేసే పిగ్మెంట్‌కి సమస్యలు వస్తాయి.
ఈ వ్యాదికి ఎన్నో రకాల కారణాలు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
కొందరికి జన్యు సంబంధమైన కారణంతో రావచ్చు. మరికొందరికి కొన్ని పోషకాల లోపం వల్ల రావచ్చు.
హార్మోన్లలో అసమతుల్యత వల్ల, హిమోగ్లోబిన్ ప్రొటీన్ లోపంతో రావచ్చు.
ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా?
'కెనాయిటిస్ నుంచి బయటపడటం అంత సులువేం కాదు. ఒక్కసారి జుట్టు తెల్లబడటం మొదలుపెడితే, మిగతా వెంట్రుకలు తెల్లగా మారకుండా ఆపడం కూడా చాలా కష్టం. మార్కెట్లో కెనాయిటిస్ కోసం మందులు, షాంపూల్లాంటివి అందుబాటులో ఉంటాయి. కానీ వీటి వల్ల సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు 20-30శాతం మాత్రమే' అని డాక్టర్ అమరేంద్ర అంటున్నారు.
చిన్న వయసు నుంచే ఆహారంపైన దృష్టి పడితే ఈ సమస్యను చాలావరకూ నివారించే అవకాశం ఉందని డాక్టర్.దీపాలీ చెబుతున్నారు.
- ఆహారంలో బయోటిన్ (విటమిన్ బీ7) ఉండేలా చూసుకోవాలి.
- జుట్టుపైన ఎలాంటి రసాయనాలనూ ప్రయోగించకూడదు.
- రసాయనాలతో నిండిన యాంటీ డ్యాండ్రఫ్ షాంపూలు వారంలో రెండు సార్లకు మించి వాడకపోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా - ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- ఆరోగ్యం: హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది?
- ‘వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా?
- పొగతాగడం మానేయాలనుకుంటే... ఇలా ప్రయత్నించండి
- కోపం అంతగా ఎందుకొస్తుంది? దాన్ని అదుపు చేయడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









