పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా - ఇది ఆరోగ్యానికి చాలా మంచిది

డయిపర్

ఫొటో సోర్స్, iStock

పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

అమెరికాలోని ఓ పరిశోధనా సంస్థ అభిప్రాయం ప్రకారం... రోగనిరోధకశక్తిని పెంచేందుకు అవసరమైన ప్రొబయోటిక్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.

కొన్ని సంవత్సరాలుగా ప్రొబయోటిక్స్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. జీర్ణశక్తిని పెంపొందించే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది.

అరుగుదల సమస్యలుంటే ప్రొబయోటిక్స్ సమృద్ధిగా ఉండే పెరుగు వంటి పదార్థాలు తీసుకోవాలి.

వీడియో క్యాప్షన్, పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా?

పిల్లల మలం కూడా దీనికో మంచి పరిష్కారం అని అమెరికన్ బృందం చెబుతోంది. ఎందుకంటే పెద్దవయసువారిలో వచ్చే కేన్సర్, డయాబెటిస్ వంటివి పిల్లల్లో సాధారణంగా ఉండవు కదా.

34మంది ఆరోగ్యవంతులైన పిల్లల డైపర్లతో వీరు పరిశోధన చేశారు. దీనిలో ఉండే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో ఉపయోగపడే ఫ్యాటీ ఆమ్లాలను ఉత్పత్తి చేయడం వారు కనుగొన్నారు.

ప్రస్తుతం దీన్ని ఎలుకలపై మాత్రమే పరీక్షించారు.

ఈ మంచి బ్యాక్టీరియాను పాల రూపంలో తయారు చేయాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. అప్పుడు దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.

వీడియో క్యాప్షన్, వీడియో: పిల్లలను ఎత్తుకుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పగలమా!!

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)