అయోధ్య, రాముడుపై ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నేపాల్

ఫొటో సోర్స్, NurPhoto
శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఓలీ తన ప్రభుత్వ నివాసంలో జరిగిన కవి భానుభక్త్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్, నేపాల్ మధ్య పరిస్థితి ఇప్పటికే ఉద్రిక్తంగా ఉంది.
“అసలు అయోధ్య నేపాల్ బీర్‌గంజ్ దగ్గర ఒక గ్రామం. శ్రీరాముడు అక్కడే జన్మించాడు” అని కేపీ శర్మ ఓలీ అన్నారు.

‘ప్రధాని ఉద్దేశం అది కాదు’ - నేపాల్ విదేశాంగ శాఖ వివరణ
కాగా, ఓలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో నేపాల్ విదేశాంగ శాఖ ఈ అంశంపై వివరణ జారీ చేసింది.
నేపాలీ భాషలో రామాయణాన్ని రచించిన ఆదికవి భాను భక్త ఆచార్య 207వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా సోమవారం ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడారని, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయ అంశానికీ సంబంధించినవి కాదని తెలిపింది. అలాగే ఏ ఒక్కరి మనోభావాలనూ దెబ్బతీయాలనే ఉద్దేశం ఆయనకు లేదని తెలిపింది.
రాముడిపైన, ఆయన కాలానికి సంబంధించిన ప్రాంతాలపైన చాలా అపోహలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో రాముడు, రామాయణం కాలానికి సంబంధించిన విస్తృత సాంస్కృతిక, భౌగోళిక వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలన్న అంశాన్ని ఆయన ప్రముఖంగా చెప్పారని వివరించింది.
అయోధ్యను, దానికి ఉన్న సాంస్కృతిక విలువను తగ్గించే ఉద్దేశం ఓలీ వ్యాఖ్యలకు లేదని వెల్లడించింది.
బిబాహ పంచమి రోజున అయోధ్య నుంచి నేపాల్ లోని జనక్‌పూర్ వరకూ సంప్రదాయ యాత్ర జరుగుతుంటుందని, రామాయణ సర్క్యూట్‌లో భాగంగా అయోధ్య-జనక్‌పూర్ బస్సు సర్వీసును కూడా 2018లో ప్రారంభించామని నేపాల్ విదేశాంగ శాఖ గుర్తు చేసింది.
రెండు దేశాల మధ్య, ప్రజల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాల గౌరవాన్ని ఈ వాస్తవాలే సంకేతమని తెలిపింది.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా ప్రధాని కేపీ ఓలీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
“ఒక ప్రధాని ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదు. చూస్తుంటే, ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ప్రధాని ఓలీ భారత్-నేపాల్ సంబంధాలను నాశనం చేయాలని అనుకుంటున్నట్లుంది” అన్నారు.
భారత్, నేపాల్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితి ఉంది. మే 20న నేపాల్ తన కొత్త మ్యాప్ జారీ చేసింది. అందులో లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలను తమ ప్రాంతాలుగా చూపించింది.
ఈ మూడు ప్రాంతాలు ప్రస్తుతం భారత్‌లో ఉన్నాయి. కానీ అది తమ ప్రాంతం అని నేపాల్ చెబుతోంది.
కొన్ని రోజుల క్రితం భారతీయ మీడియా పాత్రపై కూడా నేపాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా భారతీయ చానళ్లు ప్రధాని కేపీఓలీ, చైనా రాయబారి హౌ యాంకీ గురించి సంచలన వార్తలు ప్రసారం చేశాయి. కొన్ని చానళ్లు ఓలీని 'హనీ ట్రాప్'లో ఇరికించారని కూడా స్టోరీలు నడిపాయి.
నేపాల్ ఆ వార్తలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని తమ దేశంలోని కేబుల్ ఆపరేటర్లకు చెప్పింది.
అయితే చైనా రాయబారి జోక్యంపై నేపాల్‌లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
నేపాల్‌లో విపక్షాల నుంచి స్థానిక మీడియా వరకూ దేశ రాజకీయాల్లో ఒక రాయబారి ఈ స్థాయిలో జోక్యం చేసుకోవడం గురించి ప్రశ్నిస్తున్నాయి. చైనా రాయబారి రాజకీయ సమావేశాలు గత నెలన్నరగా కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ సోషల్ మీడియాలో సెటైర్లు
మరోవైపు శ్రీరాముడు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని తన దేశంలోని నెటిజన్లకు కూడా టార్గెట్ అయ్యారు.
నేపాల్ సోషల్ మీడియాలో చాలా మంది ఈ వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తూ, ఆయన అలాంటి ప్రకటనలకు దూరంగా ఉండడం మంచిదని సలహా ఇస్తున్నారు.
శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని కేపీ ఓలీ సోమవారం అన్నారు.
“రామాయణంలో చెప్పిన అయోధ్య నిజానికి నేపాల్‌లోని బీర్‌గంజ్ దగ్గర ఉన్న ఒక గ్రామం. శ్రీరాముడు అక్కడే జన్మించాడు. రాముడు భారత రాకుమారుడు కాదు, నేపాల్ రాకుమారుడు” అన్నారు.
నేపాల్‌లో కొందరు ఆయన వ్యాఖ్యలను వెనకేసుకుని వచ్చినా, అలా అన్నందుకు ఓలీపై సెటైర్లు వేస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, HOU YANQI/TWITTER
ఎవరు ఏమని అన్నారంటే..
నేపాల్ మాజీ ప్రధాని బాబురాం భట్టరాయ్ ఓలీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“ఆదికవి ఓలీ రచించిన కలియుగ ఆధునిక రామాయణం వినండి. నేరుగా వైకుంఠ యాత్ర చేయండి” అని ట్వీట్ చేశారు.
నేపాల్ రచయిత మాజీ విదేశాంగ మంత్రి రమేశ్ నాథ్ పాండే కూడా ఈ వ్యాఖ్యలపై ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
“మతం రాజకీయాలు, దౌత్యాన్ని మించినది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. హాస్యాస్పదమైన ఇలాంటి ప్రకటనలు ఇబ్బంది కలిగిస్తాయి. అసలైన అయోధ్య బీర్‌గంజ్ దగ్గర ఉంటే, సరయూ నది ఎక్కడుంది” అన్నారు.
ఓలీ ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన మాజీ మీడియా సలహాదారు, నేపాల్ త్రిభువన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుందన్ ఆర్యల్ కూడా దీనిపై స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
“ఓలీ ఇలా అనేశారేంటి. ఆయన భారతీయ టీవీ చానళ్లతో పోటీపడాలని అనుకుంటున్నారా?’’ అన్నారు.
నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఉపాధ్యక్షుడు బిష్ణు రిజల్ ప్రధాని ఓలీ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
“తగిన ఆధారాలు, ప్రమాణాలు లేకుండానే, పురాణాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పండితుడు అయిపోవచ్చు అనుకోవడం ఒక పెద్ద భ్రమ. వ్యతిరేకతలను మరింత రెచ్చగొట్టేందుకు ప్రతిరోజూ కొత్త అంశాలను ఎలా జోడిస్తున్నారనేది రహస్యమే కాదు, దురదృష్టకరం కూడా” అన్నారు.
నేపాల్ సీనియర్ జర్నలిస్ట్ అమిత్ ఢకాల్ కూడా పీఎం ఓలీ వ్యాఖ్యలపై జోకులు వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
“శ్రీలంక ద్వీపం నేపాల్‌లోని కోశీలో ఉంది. అక్కడ హనుమాన్ నగర్ కూడా ఉంది. దానిని వానర సేన నిర్మించారేమో. అప్పుడు వాళ్లందరూ వంతెన కట్టడానికి కలిసుంటారు” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
నేపాల్ నేషనల్ ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ ఉపాధ్యక్షుడు స్వార్ణిమ్ వాగ్లే తన ట్విటర్‌లో “హే రామ్, పీఎం ఓలీ భారతీయ మీడియా కోసం మంచి మసాలా ఇచ్చారు” అన్నారు.
నేపాల్ రచయిత, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కనక్ మణి దీక్షిత్ కూడా దీనిపై ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
“శ్రీరాముడు ఎక్కడ జన్మించాడు, అయోధ్య ఎక్కడుంది అనే పురాణ అంశాలను వివాదాస్పదం చేయాలనుకోవడం ప్రధాని ఓలీ అవివేకం. ప్రస్తుత స్థితిపై భారత ప్రభుత్వంతో మాత్రమే అభిప్రాయ బేధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక వర్గం ప్రజల్లో కూడా అలాంటి భావం కలిగిస్తుంది” అన్నారు.
మరో జర్నలిస్ట్ ధరూబా హెచ్ అధికారి కూడా ఓలీ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
“ఓలీ పార్టీ పేరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్. కమ్యూనిజం మతాన్ని నమ్మదు. ఓలీ ప్రమాణ స్వీకారం చేసినపుడు కూడా శ్రీరాముడి పేరుతో అని చెప్పడానికి నిరాకరించారు. ప్రధాని మోదీ జనక్‌పూర్‌లో పూజలు చేసినపుడు, ఓలీ చేయలేదు. కానీ ఇప్పుడు ఓలీ రాముడు, అయోధ్య గురించి ఆలోచించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది” అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- అయోధ్య: ఇది నిజంగానే రామ జన్మస్థలమా? దీని చరిత్ర ఏమిటి?
- నేపాల్ కొత్త మ్యాప్‌కు గట్టిగా సమాధానం ఇచ్చిన భారత్.. ఈ వ్యవహారంపై నేపాల్ మీడియా ఏమంటోంది?
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)