స్పాంటేనియస్ సెక్స్ బాగుంటుందా... ప్లాన్ చేసుకుని చేసే శృంగారం మరింత బాగుంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమీ మ్యూజ్, కటారినా కోవాసెవిక్
- హోదా, బీబీసీ న్యూస్
సినిమాలు, టీవీల్లో సెక్స్ సన్నివేశాలు అప్పటికప్పుడు కలిగే ఆవేశంలా కనిపిస్తాయి. సెక్స్ చేయాలనే ఆలోచనతో, లేదా ముందే ప్లాన్ చేసుకుని చేసినట్టుగా అవి ఉండవు.
అలాంటి దృశ్యాలు అప్పటికప్పుడు జరిగే శృంగారం(స్పాంటేనియస్ సెక్స్) వల్ల సంతృప్తి కలుగుతుందనే భావనను కలిగిస్తున్నాయి.
మీరు ఎలాంటి సెక్స్‌ను ఇష్టపడతారని అమెరికా, కెనడాలో కొందరు జంటలను ప్రశ్నించినప్పుడు అలాంటి సమాధానమే వచ్చింది.
ముందుగా ప్లాన్ చేసుకుని సెక్స్ చేయడంలో కంటే, అప్పటికప్పుడు జరిగే సెక్స్‌లో ఎక్కువ సంతృప్తి పొందినట్టు పరిశీలనలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
స్పాంటేనియస్ సెక్స్‌పై అపోహలు
అప్పటికప్పుడు ఆకస్మికంగా జరిగే సెక్స్ ఎక్కువ సంతృప్తినిస్తుందా?
ఆకస్మికంగా జరిగే సెక్స్ మోహాన్ని తెలియజేసినప్పటికీ, దానిలో కొన్ని లోపాలున్నాయి.
కొత్తగా రిలేషన్‌షిప్‌లో ఉన్నవారిలో సెక్స్ చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఎలాంటి ప్లాన్ చేయకుండానే తరచూ సంభోగంలో పాల్గొంటారు. అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ సెక్స్ కోరికలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి.
ఎక్కువ కాలం కలిసి ఉన్న జంటలు తమ భాగస్వామిలో సెక్స్ కోరికలు కలిగే వరకూ ఎదురుచూస్తారు. అయితే, ఆ తర్వాత కొద్దిపాటి శృంగారంతోనే ముగిస్తారు.
సెక్స్ చేయడానికి ప్రణాళిక వేసుకోవడమనేది తక్కువగా సెక్స్ చేస్తుంటారనే భావన కలిగించినప్పటికీ, రోజువారీ ఇతరత్రా పనుల నేపథ్యంలో శృంగారం కోసం ప్లాన్ చేసుకోవడం అత్యంత అవసరం.
ఎప్పుడు సెక్స్ చేయబోతున్నామో ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల, దానికోసం సిద్ధమవడం, సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకోవడం, ఏకాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం వల్ల శృంగారంలో ఎక్కువ సంతృప్తి పొందే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యయనంలో ఏం తేలింది?
అమెరికా సంస్కృతి, అమెరికన్ల మనస్తత్వం, అక్కడి మీడియాలో స్పాంటేనియస్ సెక్స్ పట్ల సానుకూలత ఉన్నమాట వాస్తవమే అయినా, సెక్స్ కోసం ప్రణాళిక చేసుకోవడానికి, స్పాంటేనియస్ సెక్స్ చేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధ్యయనం చేసేందుకు పరిశోధన నిర్వహించారు.
కెనడాకి చెందిన యార్క్ యూనివర్సిటీ, సెక్సువల్ హెల్త్ అండ్ రిలేషన్‌షిప్స్ ల్యాబొరేటరీ బృందం ఈ పరిశోధన జరిపింది. అందులో భాగంగా అమెరికా, కెనడాకి చెందిన 303 మందిని, 102 జంటలపై అధ్యయనం చేసింది.
''నా భాగస్వామితో స్పాంటేనియస్ సెక్స్ ఎక్కువ సంతృప్తి కలిగించింది. నేను సెక్స్‌లో పాల్గొనబోతున్న సమయం ముందుగానే తెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.''
ఈ రెండు భావనలలో ఎక్కువ మంది దేనిని అంగీకరిస్తారో రేటింగ్ ఇవ్వాలని కోరారు.
ఇటీవల ప్లాన్ చేసుకుని సెక్స్‌లో పాల్గొన్నారా? ప్లాన్ చేసుకుని సెక్స్‌లో పాల్గొంటే మీకు ఏమనిపించింది? మీరు ఇటీవల మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నారా? మీరు మీ సెక్సువల్ రిలేషన్‌షిప్‌లో సంతృప్తిగా ఉన్నారా? వంటి ప్రశ్నలు అడిగి వివరాలను సేకరించింది.
అలాగే, మూడు వారాల పాటు జరిగే ఈ అధ్యయనంలో మీ రోజువారీ అనుభవాలను కూడా నమోదు చేసుకుంటామని వారికి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పాంటేనిటీ, సంతృప్తి
స్పాంటేనియస్ సెక్స్, సంతృప్తి పొందడం అనే రెండు విషయాలపై జరిపిన అధ్యయనంలో స్పాంటేనియస్ సెక్స్ సరైనదేనని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే, స్పాంటేనియస్ సెక్స్ ప్రత్యేకంగా సంతృప్తి కలిగింది లేదని మరికొందరు చెప్పారు.
స్పాంటేనియస్ సెక్స్ వల్ల ఎక్కువ సంతృప్తి కలుగుతుందని బలంగా నమ్ముతున్న వారు ఇటీవల స్పాంటేనియస్ సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ, ప్లాన్ చేసుకుని సెక్స్‌లో పాల్గొనడం కంటే ఎక్కువ సంతృప్తి కలిగినట్లు అనిపించలేదని ఒక అధ్యయనంలో తేలింది.
ప్లాన్ చేసుకుని సెక్స్ చేయడం కూడా తృప్తి కలిగించలేదని కొన్నిసార్లు తేలింది. అయితే, ప్లానింగ్ సెక్స్ అంత సంతృప్తిని కలిగించలేదని భావించే వారిలో అది కనిపించింది.
ప్లాన్ చేసుకుని సెక్స్ చేయడం కూడా అంత సంతృప్తిని కలిగించలేదని కొందరు అభిప్రాయపడ్డారు. చివరిసారి ప్లాన్ చేసుకుని సెక్స్‌లో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఇదే అభిప్రాయం చెప్పారు.
అయితే, ఇది ప్లాన్ చేసుకుని సెక్స్ చేయడం వల్ల ఎక్కువ సంతృప్తి కలుగుతుందని బలంగా నమ్మేవారి అభిప్రాయం కాదు.
ప్లాన్ చేసుకుని, లేదా ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు శృంగారంలో పాల్గొనడం వల్ల ఎక్కువ సంతృప్తి కలుగుతుందని నిర్ధారించలేమని రెండో అధ్యయనంలో తేలింది. 21 రోజులపాటు శృంగారంలో పాల్గొన్న జంటలను ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. స్పాంటేనియస్ సెక్స్ వల్ల ఎక్కువ సంతృప్తి కలుగుతుందని భావించే వారి నుంచి కూడా అదే భావన వ్యక్తమైంది.
స్పాంటేనియస్ సెక్స్, లేదా ప్లాన్ చేసుకుని సెక్స్ చేయడం వల్ల కలిగే లైంగిక ఆనందం గురించి తెలుసుకునేందుకు జరిపిన అధ్యయనంలో ఆసక్తికర సమాధానం వచ్చింది. స్పాంటేనియస్ సెక్స్‌లో అనుభూతి, కోరిక, మోహం వంటి భావాలు కలిగినట్టు చెప్పారు.
అయితే, ప్రణాళిక ప్రకారం సెక్స్ చేయడం కూడా, భాగస్వామితో సెక్స్ కోసం ఎదురుచూడడం, సెక్స్ చేయాలనే కోరికను పెంచుతుందని చెప్పారు.
ప్లాన్ చేసుకుని సెక్స్ చేయడం కొన్నిసార్లు ఒత్తిడికి దారితీసిందని, స్పాంటేనియస్ సెక్స్‌లో మంచి అనుభూతి కలిగిందని వారు చెప్పారు.
సెక్స్ ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మానసిక పరధ్యానాలను పక్కనబెట్టి, ఏకాంతంగా సంభోగానికి సిద్ధమయ్యేందుకు తగినంత సమయం దొరకలేదని కొందరు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మోహం అంటే ఏంటి?
మోహం, కోరిక వంటివి స్పాంటేనియస్ సెక్స్‌కి ప్రధాన కారణమని కొందరు చెప్పారు. రిలేషన్‌షిప్ తొలినాళ్లలో కలిగే భావనలా ఇది ఉంటుందన్నారు.
మీరు రిలేషన్‌షిప్ ప్రారంభ దశలో ఉన్నా, మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ప్లాన్ చేసుకునే సెక్స్ జరిగి ఉండే అవకాశం ఉంది.
భాగస్వామితో రొమాంటిక్‌గా గడిపేందుకు సరైన రోజును ఎంచుకోవడం, భాగస్వామిని దగ్గరికి తీసుకోవడం, సెక్స్ కోరికలు కలిగించేలా లోదుస్తులు ధరించడం వంటివన్నీ శృంగారం జరిపేందుకు చేసుకునే ప్రణాళికలో ఒక భాగం కావొచ్చు.
మరోవైపు, బాధ్యతలు, పని భారం, ఇతర సమస్యల వల్ల శృంగారంపై అయిష్టత కలిగే అవకాశం ఉందని తేలింది.
ప్రణాళికాబద్దమైన సెక్స్ ఎంత అవసరమో జంటలు తెలుసుకోవడం ద్వారా, శృంగారంలో సంతృప్తి పొందే అవకాశం ఉంటుందని, సెక్స్ చేయాలనే కోరికతో ఉండడం వల్ల అది సాధ్యమవుతుందని అధ్యయనంలో తేలింది.
భాగస్వాములకు తీరిక లేకపోవడం, పిల్లలు పుట్టడం వంటి సమయాల్లో స్పాంటేనియస్ సెక్స్ అనేది ఒక సవాల్ లాంటిది.

ఫొటో సోర్స్, Getty Images
జీవితంలో ప్లాన్ చేసినవే ఎక్కువ..
జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలా వరకూ ప్లాన్ చేసుకునే జరుగుతాయి. ఉదాహరణకు, అది ఇటీవల చేసిన పర్యటన కూడా కావొచ్చు. అందుకోసం ముందుగా ప్లాన్ చేసుకునే ఉంటాం. అయితే, అది కూడా ఆహ్లాదాన్ని కలిగించేది.
సెక్స్ అనేది మీకు, మీ భాగస్వామికి విలువైనది అయితే, సెక్స్ కోసం ప్లాన్ చేసుకోవడం మీ లైంగిక సంబంధానికి ప్రాధాన్యం ఇవ్వడంలో ఒక భాగం.
సెక్స్ కోసం ప్లాన్ చేసుకోవడమంటే షెడ్యూల్‌లో అదొక పని అని అర్థం కాదు.
అది మీ భాగస్వామికి దగ్గరయ్యే విషయం. మీ భావాలను పంచుకోవడం ద్వారా, లేదా పనిలో తక్కువ ఒత్తిడి ఉన్న సందర్భాల్లో శృంగారం చేసేందుకు సమయం కల్పించుకోవడం ద్వారా మీరు ఎప్పుడు సెక్స్ పట్ల ఆసక్తిగా ఉంటారో అర్ధం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది.
ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. పనివేళల్లో మార్పులొచ్చాయి. కాబట్టి మధ్యాహ్నం సమయంలోనూ మీరు సంతోషంగా గడిపే అవకాశం ఉంది.
మీకు, లేదా మీ భాగస్వామికి రాత్రి కంటే ఉదయం, లేదా మధ్యాహ్నం సెక్స్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉండొచ్చు. రాత్రిళ్లు భోజనం చేసి వెంటనే పడుకునే అలవాటు ఉన్నవాళ్లకి ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది.
భాగస్వామితో తమ బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు సెక్స్ ఒక మార్గమని ఎక్కువ మంది అభిప్రాయం. వీకెండ్స్, డేట్ మాదిరిగానే దీన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్లాన్ చేసుకుని కలిసే శృంగారంలో కూడా స్పాంటేనియస్ సెక్స్ తరహాలో సంతృప్తి పొందొచ్చు.
ఇవి కూడా చదవండి:
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది? 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో వివరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్: అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వివాదం ఏంటి, పేదలకు ఇళ్ల స్థలాలపై అభ్యంతరాలు ఎందుకు?
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- దేవుని దగ్గరకు తీసుకెళ్తామంటూ వందల మంది ప్రాణాలు తీసిన ముగ్గురి కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














