దావోస్‌లో రేవంత్ రెడ్డి: సీఎంకు ఇంగ్లిష్ మాట్లాడడం వచ్చి తీరాలా... తెలంగాణ ముఖ్యమంత్రిపై ట్రోలింగ్ ఎందుకు?

ఫొటో సోర్స్, Facebook/Anumula Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆంగ్ల భాషాపరిజ్ఞానం చుట్టూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఆయన ఇంగ్లిష్, హిందీ భాషానైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అంతర్జాతీయ వేదికలపై ఆయన సరైన ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణను ప్రపంచం ఎలా చూస్తుందనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు విపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు.
అదే సమయంలో, తెలంగాణలో ప్రభుత్వం నడపడానికి ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లిష్ భాషా? లేదంటే పరిపాలనా దక్షత, ఇతర సామర్థ్యాలా అనే కౌంటర్ వాదనలతో బీఆర్ఎస్ మద్దతుదారుల వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు.

ఫొటో సోర్స్, Telagnana CMO
దావోస్‌లో ఏం జరిగింది?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు హాజరై అక్కడ మీడియాతో మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్ నుంచి ఈ తరహా దాడి పెరిగింది.
కొందరు బీఆర్ఎస్ అభిమానులైతే గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) అసెంబ్లీలో, ఇతర సందర్భాల్లో ఇంగ్లిష్‌లో ప్రసంగించిన వీడియో క్లిప్పింగ్స్, రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ వీడియోలు పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
మరికొందరు కేసీఆర్ కుమారుడు, మాజీ మంత్రి కేటీ రామారావును, రేవంత్‌ను పోల్చుతూ వీడియోలు, కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక రేవంత్ మద్దతుదారులైతే ఆయన అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్‌తో సమావేశమైన ఫోటోలు, వివిధ దేశాల ప్రతినిధులు, వివిధ కంపెనీల సీఈవోలు, యజమానులతో జరిపిన సమావేశాలు వివరాలతో దావోస్ పర్యటనలో ఆయన ఏం సాధించారన్నది బలంగా ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల్లో 60 మందితో సమావేశమయ్యారని, వేల కోట్ల పెట్టుబడులు సాధించారని చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Telangana Congress
దావోస్‌లో రేవంత్ రెడ్డి తనను తాను నవ్వులపాలు చేసుకోవడమే కాకుండా ప్రపంచ వేదికపై అసంబద్ధమైన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రానికి అపకీర్తి తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు.
అంతర్జాతీయ వేదికపై ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి తెలుసుకోవాల్సింది అని ఆయన సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రేవంత్ రెడ్డి ‘రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్’కు బదులు ‘రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్’ అంటున్నారని, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు మరింత జాగ్రత్తగా ఉండాలని విజయ్ రెడ్డి యెరువ అనే యూజర్ సూచించారు.
గతంలో తెలంగాణ ఐటీ మంత్రిగా దావోస్ సదస్సుకు వెళ్లిన కేటీఆర్‌ను మిస్సవుతున్నామంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం'
ఎన్నికలలో ఓటమి పాలైన తరువాత బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కొత్త ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ అన్నారు.
దావోస్‌లో రేవంత్ రెడ్డి భారత్‌కు చెందిన ‘నేషనల్ చానల్స్’తో మాట్లాడింది కూడా ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి వంటి నాయకులు రేవంత్‌పై విమర్శలు ప్రారంభించారని,ఇప్పుడు దాసోజు శ్రవణ్ కూడా అదే పనిచేస్తున్నారని కిరణ్ కుమార్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డితో ఇండియా టుడే చానల్‌కు చెందిన రాహుల్ కన్వల్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అందులో ఆయన ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్ల గురించి చేసిన వ్యాఖ్యలు.. కేటీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలపై విమర్శలతో పాటు ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
సీఎన్‌బీసీ-టీవీ18 ప్రతినిధి తనతో మాట్లాడినప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ షేర్ చేస్తున్నాయి.
పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వానికి భిన్నంగా మీరేం చేయబోతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇన్వెస్టర్లు స్పోర్ట్స్ కార్ల వంటివారని, ప్రభుత్వం రోడ్డులాంటిదని, తమ ప్రభుత్వం స్పోర్ట్స్ కారు వెళ్లే దారిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తుందని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
'ఇంగ్లిష్ గురించి ఎందుకు?'
అయితే, పార్టీలతో సంబంధం లేని సాధారణ నెటిజన్లు కొందరు ఈ ధోరణిని తప్పు పడుతున్నారు.
రేవంత్ ఇంగ్లిష్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని వారు అంటున్నారు.
‘‘ఆయన ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేరు. అలా అని ఆయన పెట్టుబడులు పొందే అవకాశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం కాదు. తన ఉద్దేశాన్ని చాటాలని, తాను చెప్పదలచుకున్నది ఎలాగైనా చెప్పాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. పాజిటివ్‌గా ఆలోచించండి’’ అని కార్తీక్ రెడ్డి అనే ఓ యూజర్ ఎక్స్‌లో అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
తమ ముఖ్యమంత్రి ఇంగ్లిష్ మాట్లాడడంలో ఇబ్బంది పడుతున్నారంటూ తెలంగాణ నెటిజన్లు, విపక్ష నాయకులు సోషల్ మీడియాలో చర్చిస్తుండగా మహారాష్ట్రకు చెందిన నెటిజన్లు, అక్కడి విపక్షాలు ఇతర అంశాలపై దృష్టి పెట్టాయి.
దావోస్ సదస్సుకు భారత్ నుంచి వెళ్లిన ముఖ్యమంత్రులలో ఒకరు రేవంత్ రెడ్డి కాగా, మరొకరు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.

ఫొటో సోర్స్, CMO Maharashtra
మహారాష్ట్ర సీఎం విషయంలో ఏం జరిగింది?
మహారాష్ట్రలో ప్రజలు, నెటిజన్లు, విపక్షాలు ఆంగ్ల భాషా పరిజ్ఞానం లాంటి విషయాలపై దృష్టి పెట్టలేదు. సీఎం ఏక్‌నాథ్ షిండే తనతోపాటు పెద్ద సంఖ్యలో అధికారులను, పర్సనల్ సెక్రటరీలను తీసుకెళ్లడం, అందులో కొందరు కుటుంబాలతో వెళ్లడం వంటి విషయాలను ఫోకస్ చేసి విమర్శలు చేస్తున్నారు.
అవసరానికి మించి వీళ్లందరినీ తీసుకెళ్లి ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ విపక్ష నేత ఆదిత్య ఠాక్రె, ఇతరులు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
అంతేకానీ, అక్కడ తమ ముఖ్యమంత్రి ఇంగ్లిష్‌లో మాట్లాడారా? హిందీలో మాట్లాడారా? ఆయన ఇంగ్లిష్ ఎంత బాగుంది వంటి విషయాల జోలికి పోలేదు.
‘ఇన్వెస్టర్లు చూసేది ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాదు’
‘‘ఇన్వెస్టర్లు ముఖ్యమంత్రులు ఎలా మాట్లాడుతున్నారనేది చూసి పెట్టుబడులు పెట్టరు. ఆయా దేశాలు, రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది? అక్కడ తమ పరిశ్రమ లేదా వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా అన్నది చూస్తారు. అంతేకానీ, నాయకుల భాషా పరిజ్ఞానాన్ని చూడరు" అని సీనియర్ జర్నలిస్ట్ జింగా నాగరాజు బీబీసీతో అన్నారు.
ఇంగ్లిష్ మాట్లాడడమే ప్రాతిపదిక అయితే ప్రపంచంలోని ఇన్వెస్టర్లంతా అమెరికాకో, బ్రిటన్‌కో లేదంటే ఇంగ్లిష్ మాట్లాడే నాయకులున్న ఇతర దేశాలకో క్యూ కట్టాలి కదా అని ఆయన అన్నారు.
భారత దేశంలో నవీన్ పట్నాయిక్ వంటి ముఖ్యమంత్రులు కొందరు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతారని, అలా అని ఆ రాష్ట్రాలు పెట్టుబడుల సాధనలో అందరి కంటే ముందేమీ లేవన్నారు. పెట్టుబడుల సాధన వంటి విషయాలలో అధికారుల పాత్ర కూడా ఉంటుందన్నారు.
‘‘గతంలో హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, పెట్టుబడులు తీసుకొచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇంగ్లిష్‌లో అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడే నేత ఏమీ కాదు.
మొన్నటి తెలంగాణ ఎన్నికలలో ఇంగ్లిష్ బ్రహ్మాండంగా మాట్లాడే కొందరు నాయకులు ఓటమి పాలయ్యారు. గెలిచిన నేతలలో అస్సలు ఇంగ్లిష్ రానివారు ఉన్నారు’’ అని నాగరాజు గుర్తు చేశారు.
ప్రజలు నాయకుల భాషాపరిజ్ఞానం కంటే ఇతర విషయాలు చూస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
తాము ఓటమి పాలవడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇలాంటి విమర్శలు చేస్తుండవచ్చని ఆయన అన్నారు.
కొందరు ప్రపంచ నేతలకూ ఇంగ్లిష్ రాదని, వారు తమ భాషలోనే చర్చలు, ప్రసంగాలు చేస్తారనే విషయాన్ని నాగరాజు గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, G.KishanReddy/twitter
ఇండియాలో ఇంగ్లిష్ మాట్లాడే సీఎంలు ఎందరు?
భారత్‌లోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఎంత మంది మంచి ఇంగ్లిష్ మాట్లాడగలరు అంటే ఆ సంఖ్య పెద్ద ఎక్కువేం ఉండదు.
రాష్ట్రాలలో పాలన సాగించడం, కేంద్రంతో, అధికారులతో పాలనాపరమైన వ్యవహారాలు మాట్లాడడం వంటి అవసరాలకు సరిపడేలా చాలా మంది మాట్లాడుతారు.
అవసరమైతే ఇంగ్లిష్, హిందీ భాషల్లో నైపుణ్యం ఉన్న తమ మంత్రివర్గ సహచరుల సహకారమో, అధికారుల సహకారమో తీసుకుంటారు.
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొందరికి హిందీ పరిజ్ఞానం తక్కువ ఉంటుంది. అయినా, వారు కేంద్రంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తుంటారు.
ఉత్తరాదిలో హిందీ ప్రధాన భాషగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో కొందరు ఇంగ్లిష్ మాట్లాడలేరు.
ప్రపంచంలో వివిధ దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా ఉన్నవారిలోనూ కొందరు ఇంగ్లిష్‌లో మాట్లాడరు. అంతర్జాతీయ సదస్సులు, ఇతర దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్నప్పుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారు.
ఇవి కూడా చదవండి:
- 'ఇండియా ఔట్' నినాదం ఇచ్చిన మహమ్మద్ మయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచారు... భారత్‌పై దీని ప్రభావం ఎంత?
- ‘ప్రతి భారత సైనికుడూ మాల్దీవుల నుంచి వెళ్లిపోవాలి’ – బీబీసీ ఇంటర్వ్యూలో మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ
- మాల్దీవుల ఎన్నికలు - ఇండియా, చైనా: ఇంత చిన్న దేశంలో పట్టు కోసం అంత పోటీ ఎందుకు?
- Sri lanka crisis: పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు కూడా దివాలా అంచున ఉన్నాయా?
- Lalit Modi-Sushmita Sen: 'ఓపిక.. పట్టుదల.. నిలకడతో విజయం సాధించొచ్చు’ - సుష్మితా సేన్‌తో డేటింగ్ అంటూ లలిత్ మోదీ ట్వీట్‌పై సోషల్ మీడియాలో రియాక్షన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














