Lalit Modi-Sushmita Sen: 'ఓపిక.. పట్టుదల.. నిలకడతో విజయం సాధించొచ్చు’ - సుష్మితా సేన్‌తో డేటింగ్ అంటూ లలిత్ మోదీ ట్వీట్‌పై సోషల్ మీడియాలో రియాక్షన్లు

ఫొటో సోర్స్, Twitter/@LalitKModi
బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సుష్మితా సేన్‌తో కలిసి ఉన్న ఫొటోలను గురువారం లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తాను, సుష్మితా సేన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని... త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఆయన చెపుకొచ్చారు.
'నా బెటర్ పార్టనర్ సుష్మితా సేన్‌తో కలిసి మాల్దీవులు, సార్దినాల వంటి ప్రాంతాల్లో తిరిగి ఇప్పుడే లండన్‌కు తిరిగి వచ్చాం. జీవితంలో కొత్త అధ్యాయం. ప్రేమలో ఉన్నాం. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా పెళ్లి చేసుకుంటాం.' అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ తరువాత 'జస్ట్ ఫర్ క్లారిటీ. ఇంకా పెళ్లి చేసుకోలేదు. డేటింగ్‌లో మాత్రమే ఉన్నాం. ఏదో ఒకరోజు పెళ్లి కూడా జరగొచ్చు.' అని మరొక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తరచూ ఐపీల్‌లో కనిపించే సుష్మితా సేన్, గతంలో లలిత్ మోదీతో ఉన్న ఫొటోలు ఇప్పుడు మళ్లీ బయటకు వస్తున్నాయి. నాడు కూడా వీళ్లద్దిరి మధ్య బంధం గురించి రూమర్లు వచ్చాయి. కానీ ఈ విషయం మీద సుష్మితా సేన్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు.
లలిత్ మోదీతో పెళ్లి గురించి ఆమె ఎటువంటి ప్రకటన చేయలేదు. లలిత్ మోదీ ట్వీట్లకు ఆమె బదులు కూడా ఇవ్వలేదు.
ఈ వార్తలు చూసి తాను ఆశ్చర్యపోయాయని, సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ అన్నారు. 'చాలా ఆశ్చర్యపోయా. సంతోషంగా కూడా ఉంది. మా సిస్టర్‌తో మాట్లాడిన తరువాతే నేను దీనిపై స్పందిస్తా. దీని గురించి నాకేమీ తెలియదు. మా సిస్టర్ కూడా ఇంకా కన్ఫాం చేయలేదు. అందువల్ల ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను.' అంటూ ఇ-టైమ్స్‌తో మాట్లాడుతూ ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/Sushmita Sen
మాజీ మిస్ యూనివర్స్ అయిన సుష్మితా సేన్, మంచి పేరున్న బాలీవుడ్ నటి కూడా. ఆమె ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు.
కొంతకాలంగా రోహమన్ షాల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సుష్మితా సేన్, కొద్ది నెలల కిందటే బ్రేకప్ చెప్పారు. ఆమెకు కంటే అతను 15 సంవత్సరాలు చిన్న. డైరెక్టర్ ముద్సర్ అజీజ్, బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రం, వ్యాపారవేత్త సంజయ్ నారాంగ్, డైరెక్టర్ విక్రమ్ భట్ వంటి వాళ్లతోనూ గతంలో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
లలిత్ మోదీ భార్య మీనా మోదీ 2018లో క్యాన్సర్‌తో చనిపోయారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆర్థిక నేరాల ఆరోపణలతో కేసుల్లో చిక్కుకున్న లలిత్ మోదీ, భారత్ నుంచి పారిపోయి లండన్‌లో ఉంటున్నారు. గతంలో ఐపీఎల్‌కు చైర్మన్‌గా చేసిన మోదీ, రెండు జట్టుల వేలానికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనేది ఆరోపణ.

ఫొటో సోర్స్, Yogen Shah/The India Today Group via Getty Images
2010 సీజన్ తరువాత ఐపీఎల్ నుంచి ఆయనను బహిష్కరించారు.
లలిత్ మోదీ చేసిన తాజా ట్వీట్లతో ఆయన, సుష్మితా సేన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. వాళ్లకు సంబంధించిన పాత ట్వీట్లు, ఫొటోలను చాలా మంది యూజర్లు పోస్ట్ చేస్తున్నారు. 2013లో లలిత్ మోదీ చేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
ఒక ట్వీట్‌లో సుష్మితా సేన్‌ను ట్యాగ్ చేస్తూ 'ఓకే ఐ కమిట్' అంటూ మోదీ రాశారు. దానికి బదులుగా 'లలిత్ మోదీ మీరొక జెంటిల్‌మ్యాన్. హామీలను నిలబెట్టుకోలేక పోవచ్చు కానీ కమిట్‌మెంట్స్ మాత్రం గౌరవించాలి.' అని సుష్మితా సేన్ చెప్పుకొచ్చారు.
మరొక ట్వీట్‌లో సుష్మితా సేన్‌ను ట్యాగ్ చేస్తూ 'రిప్లై టు మై ఎస్‌ఎంఎస్' అని లలిత్ మోదీ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ట్వీట్ మీద ఇప్పుడు సోషల్ మీడియా యూజర్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
'ఓపిక... పట్టుదల... నిలకడ'తో విజయం సాధించొచ్చు అంటూ దర్శన్ పాఠక్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
'ఎంతో కాలంగా నేను ట్రై చేస్తోంది దీని కోసమే. షారుఖ్ ఖాన్ రిప్లై మై ఎస్‌ఎంఎస్' అంటూ స్నేహ అన్నవరపు అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఇవి కూడా చదవండి:
- గోదావరి 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటిగట్లు నిలుస్తాయా
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- మేడిన్ ఆంధ్రా జాజికాయ, జాపత్రి.. కాకినాడలో సుగంధ ద్రవ్యాలు పండిస్తున్న రైతు
- మహేంద్ర సింగ్ ధోని: ది బెస్ట్ ఫినిషర్ కెరీర్లో 5 బెస్ట్ ఇన్నింగ్స్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)