ViratKohli: విరాట్ కోహ్లీ కెరియర్ ప్రమాదంలో పడిందా, వెస్టిండీస్ వెళ్లే టీ20 జట్టులో ఎందుకు స్థానం దక్కలేదు?

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Visionhaus/Getty Images

    • రచయిత, చంద్రశేఖర్ లూథ్రా
    • హోదా, బీబీసీ కోసం

కొన్ని నెలల ముందువరకు భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ హవా నడిచేది. అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీ మంచి స్కోరు చేస్తుండటంతో ఆయన చేసే తప్పులను ఎవరూ పట్టించుకునేవారు కాదు.

వన్డే మ్యాచ్‌లలో 49 సెంచరీలు, టెస్టు మ్యాచ్‌లలో 51 సెంచరీల పేరుతో సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న రికార్డును కూడా కోహ్లీ బద్దలుకొట్టాడు. 2017లో టీమ్ హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేకు బదులుగా రవిశాస్త్రికి అవకాశం ఇవ్వాలని సూచించేంత స్థాయిలో కోహ్లీ ఆధిపత్యం కొనసాగింది. దాదాపు దశాబ్దంపాటు కోహ్లీకి తిరుగు లేకుండా నడిచింది.

పిచ్‌పై కోహ్లీ ఆగ్రహావేశాలతో దుందుడుకుగా వ్యవహరించినప్పటికీ విమర్శకులకు అతడి బ్యాట్ సమాధానం చెప్పేది. టెస్టు, వన్డే మ్యాచ్‌లలో అతడి 70 సెంచరీల రికార్డును అందుకోవడం అంత తేలికకాదు. అయితే, ఇటీవల కాలంలో కోహ్లీ బ్యాటుకు కాస్త తుప్పు పట్టినట్లు కనిపిస్తోంది. 2019 నవంబరు 22 తర్వాత కోహ్లీ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు.

గత మూడేళ్లలో కోహ్లీ వందకుపైగా ఇన్నింగ్స్ ఆడాడు. దీనిలో 17 టెస్టులు, 21 వన్డేలు, 25 టీ20లు, 37 ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో అతడు ఒక్క సెంచరీ కూడా లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, ALEX DAVIDSON

అసలేమైంది?

కోహ్లీ పూర్తిగా ఫామ్ కోల్పోలేదు. అయితే, కెప్టెన్సీ సమయంలో తను సాధించిన రికార్డుల స్థాయిని అతడు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ అతడు మంచి షాట్లు కొడుతున్నాడు. అయితే, వీటిలో స్థిరత్వం కొరవడుతోంది. క్రీజులో ముందులా నిలబడలేకపోతున్నాడు.

చివరగా కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత 71వ సెంచరీ ఆయనతో దోబూచులాడుతోంది. దీంతో కోహ్లీ శక్తి సామర్థ్యాలతోపాటు జట్టులో అతడికి స్థానంపై ప్రశ్నలు వస్తున్నాయి.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు ముందు లిసెస్టర్‌షైర్‌ కౌంటీపై వార్మ్ అప్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 33 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు తీశాడు. కానీ, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మాత్రం 11, 20 రన్లకే పరిమితం అయ్యాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రమే కాదు. ఐపీఎల్‌లోనూ కోహ్లీ భారీ పరుగులు సాధించలేదు. ఐపీఎల్ 16లో కోహ్లీ మొత్తం స్కోరు 341 మాత్రమే. స్ట్రైక్ రైట్ కూడా 116 కంటే తక్కువే ఉంది. కోహ్లీ అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కంటే ఇది చాలా తక్కువ.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

సమస్య ఎక్కడ?

చాలా రోజుల నుంచి కోహ్లీ భారీ స్కోర్ కొట్టడం లేదు. సింగిల్స్ కూడా అతడు తీయలేని పరిస్థితి అయితే లేదు.

కోహ్లీలో ఆత్మ విశ్వాసం తగ్గుతుందా? లేకపోతే బ్యాటింగ్‌పై అతడు శ్రద్ధ పెట్టలేకపోతున్నాడా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

అయితే, కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కోహ్లీ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో కోహ్లీ ఫ్రంట్ ఫూట్‌పై ఎక్కువగా ఆడుతున్నాడు. అందుకే రన్లు తీయడం కష్టం అవుతోందని విమర్శకులు అంటున్నారు. అదే సమయంలో అదృష్టం కూడా అతడికి కలిసి రావడం లేదని చెప్పాలి. అయితే, కోహ్లీ రన్లు బాగా కొట్టేటప్పుడు అతడి తప్పులను ఎవరూ పట్టించుకునేవారు కాదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తొలిసారి తన కెరియర్‌లో టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ మూడు స్థానాలు కిందకుజారి 13వ స్థానానికి పడిపోయాడు. దీంతో జట్టులో అతడికి చోటు ఇవ్వడంపై చాలా ప్రశ్నలు వస్తున్నాయి.

కోహ్లీ క్రమంగా విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్‌పై ప్రభావం పడుతోందని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 నుంచి తొలగించాలని డిమాండ్

తనపై వచ్చిన విమర్శలకు ఐపీఎల్‌ సాయంతో కోహ్లీ సమాధానం చెప్పాలని ప్రయత్నించాడు. కానీ, అక్కడా ఫలితం కనిపించలేదు. అతడి స్టైక్ రేట్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఇంటర్నేషనల్ టీ 20 మ్యాచ్‌లలో కొత్త ప్లేయర్లు కూడా అతడి కంటే మెరుగైన స్ట్రైక్ రేటు కనబరుస్తున్నారు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ మొదలయ్యేందుకు వంద రోజుల కంటే తక్కువే సమయం ఉంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఎదురయ్యే సవాళ్లకు కోహ్లీ వైఫల్యం కూడా తోడయ్యే ముప్పుందని, అందుకే అతడికి జట్టులో స్థానం కల్పించొద్దని విమర్శలు వస్తున్నాయి.

కోహ్లీకు బదులుగా సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హూడా లాంటి వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

టీ20 వరల్డ్ కప్‌కు ముందుగా వెస్టిండీస్, జింబాబ్వేలతో టీ-20 సిరీస్‌లతోపాటు ఆసియా కప్‌ కూడా ఉంది. తాజాగా వెస్టిండీస్ టీ20కు వెళ్లే జట్టులో కోహ్లీకు చోటు దక్కలేదు. మిగతా మ్యాచ్‌లలోనూ కోహ్లీకి చోటు దక్కకపోతే ఆయన కెరియర్ కాస్త ప్రమాదంలో పడినట్లే భావించాలి. ఎందుకంటే 27ఏళ్ల దీపక్ హుడా ఇటు ఆఫ్ స్పిన్నర్‌గా, అటు బ్యాటర్‌గానూ జట్టుకు ఉపయోగపడతాడని విశ్లేషకులు పదేపదే సూచిస్తున్నారు.

టీ-20 వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేసే సెలెక్టర్లు అన్ని విషయాలనూ పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు కొత్తకొత్త ఫార్మాట్లలో ఆడే బ్యాటర్లతో జట్లను కొత్తగా తీర్చిదిద్దుతున్నాయి. మరోవైపు భారత్‌లో మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి బ్యాటర్లు పాత స్టైల్‌లోనే రన్లు తీసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Stu Forster/Getty Images

దీపక్ హూడా, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ లాంటి వారితో జట్టులో మిడిల్ ఆర్డర్ బలపడుతుందని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.

గతంలోనూ ఇలానే పేలవ ప్రదర్శన వల్ల చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే జట్టులో స్థానం కోల్పోయారు. అయితే, కౌంటీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శనతో పుజారా మళ్లీ జట్టులో చోటు సంపాదించాడు. రహానేకు మాత్రం ఆ అవకాశం కూడా దక్కలేదు.

మరోవైపు కోహ్లీ పేలవ ప్రదర్శనతో శ్రేయాస్ అయ్యర్ లాంటి వారికి కూడా అవకాశం దక్కొచ్చని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఇంగ్లండ్‌పై మ్యాచ్‌ల రూపంలో వచ్చిన అవకాశాలను శ్రేయాస్ ఉపయోగించుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడు గొప్ప బ్యాటర్‌ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

శ్రేయాస్ అయ్యర్‌తోపాటు సంజు శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. మరోవైపు సురేశ్ కుమార్ యాదవ్ కూడా అదే వరుసలో ఉన్నాడు.

శ్రేయాస్ అయ్యర్

ఫొటో సోర్స్, Stu Forster/Getty Images

ఫొటో క్యాప్షన్, శ్రేయాస్ అయ్యర్

కోహ్లీ భవిష్యత్ ఏమిటి?

కోహ్లీ శక్తి సామర్థ్యాలను మనం ఒకసారి చూస్తే, ప్రస్తుత సంక్షోభం నుంచి అతడు బయటకు వస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. 18ఏళ్ల వయసులో దిల్లీ రంజీ జట్టులో కెరియర్ మొదలుపెట్టినప్పుడు కూడా అతడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

కర్నాటకపై మ్యాచ్‌కు ముందు రోజే అతడి తండ్రి మరణించారు. కానీ, మరుసటి రోజు ఉదయం గ్రౌండ్‌కు వచ్చి తన కెరియర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ.

కర్నాటక జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్ వేసినప్పటికీ కోహ్లీ 90 రన్లు తీశాడు. ఆ మూడు గంటల ఇన్నింగ్స్‌లో కోహ్లీ ప్రదర్శన ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది.

వీడియో క్యాప్షన్, క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

ఆ రోజుల్లో అంపైర్ తప్పిదాల వల్లో లేదా ఇతర కారణాల వల్లో కోహ్లీ సెంచరీ దగ్గరల్లో చేజారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా, అతడు సహనం కోల్పోయేవాడు కాదు. కానీ, ఇప్పుడు అలా లేదు.

గత 30 నెలల్లో కోహ్లీ భారీ స్కోరును కొట్టిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో కోహ్లీ కూడా ఒకరు. దీనికి అతడి గత రికార్డులే కారణం.

క్రికెట్‌లో ఎప్పుడూ గత రికార్డులకు ప్రస్తుతం ఆడే మ్యాచ్‌లకు సంబంధం ఉండదు. ఎప్పటికప్పుడు రన్లు తీస్తూనే ఉండాలి. నిజానికి గతంలో తను సాధించిన రికార్డులను ఇప్పుడు కోహ్లీనే అందుకోలేకపోతున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)