Mithali Raj: ‘క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్‌వా? అని అడిగేవారు’

ఫొటో సోర్స్, ANI

232: మిథాలీ ఆడిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్(ఓడీఐ)లు
7,805: ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్‌లలో మిథాలీ చేసిన పరుగులు
7: ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్‌లలో మిథాలీ చేసిన సెంచరీలు
12: మిథాలీ ఆడిన టెస్టు మ్యాచ్‌లు
699:మిథాలీ టెస్ట్ మ్యాచ్‌లలో సాధించిన పరుగులు
89: మిథాలీ కెరీర్‌లో ఆడిన టీ20లు
2,364: టీ20 ఫార్మాట్‌లో మిథాలీ రాజ్ చేసిన పరుగులు
10,868: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి మిథాలీ సాధించిన పరుగులు

23ఏళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం, 200 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్, ఇలా చెప్పుకుంటూపోతే మిథాలీ రాజ్ పేరిట చాలా రికార్డులు ఉన్నాయి.
క్రికెట్ అభిమానులు కూడా పట్టించుకోని స్థాయి నుంచి నేడు పత్రికల్లో పతాక శీర్షికల స్థాయికి మహిళా క్రికెట్‌ను తీసుకెళ్లడంలో మిథాలీ ప్రధాన పాత్ర పోషించారు. మిథాలీని భారత్‌లో మహిళా క్రికెట్‌కు ముఖచిత్రంగా క్రికెట్ నిపుణులు అభివర్ణిస్తుంటారు.
మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రస్థానం 26, ఏప్రిల్ 1999న మొదలైంది. 23ఏళ్ల పాటు ఆమె భిన్న ఫార్మాట్లలో ఆడారు. 8, జూన్ 2022న రిటైర్ అవుతున్నట్లు ఆమె ప్రకటించారు.
సచిన్ తెందుల్కర్, జయసూర్య, మియాందాద్‌లు ఆడినన్ని ఓడీఐలు మిథాలీ ఆడారు.

ఫొటో సోర్స్, ANI
1982 డిసెంబరు 3న మిథాలీ జన్మించారు. భారతనాట్యం డ్యాన్సర్ అయిన ఆమెకు మొదట్నుంచీ క్రికెట్ అంటే చాలా ఇష్టం.
ఒకానొక సమయంలో భారతనాట్యం లేదా క్రికెట్.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే, ఆమె క్రికెట్‌నే ఎంచుకున్నారు. 90ల్లో మహిళ క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో, ఆమె చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
‘‘క్రికెట్ వైపు అడుగులు వేసేలా మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. మొదట్నుంచీ నాకు వారి మద్దతు ఉంది. కానీ, మా తాతయ్య, నాన్నమ్మలకు క్రికెట్ ఆడటం నచ్చేదికాదు. నేను క్రికెట్ ఆడితే, నల్లగా అయిపోతానని, అప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారని వారు ఆందోళన పడేవారు. మరోవైపు క్రికెట్ వల్ల నేను కుటుంబ సభ్యుల శుభకార్యాలకు హాజరుకాలేకపోయేదాన్ని’’అని ఐదేళ్ల క్రితం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
మౌలిక సదుపాయాల నుంచి సామాజిక కట్టుబాట్ల వరకు చాలా సమస్యలు వేధిస్తున్న సమయంలోనే మహిళా క్రికెట్‌పై మిథాలీ తనదైన ముద్ర వేశారు.
‘‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు, మహిళల క్రికెట్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మేం క్రికెట్ కిట్లు పట్టుకుని వెళ్లినప్పుడు మీరు హాకీ ప్లేయర్లా? అని అందరూ అడిగేవారు. మేం క్రికెట్ ఆడతామని ఎవరూ అనుకునేవారు కాదు’’అని ఆమె బీబీసీతో చెప్పారు.
గ్రౌండ్‌లో మిథాలీ కొట్టిన సెంచరీలే భారత క్రికెట్ జట్టులో ఆమెకు చోటుకల్పించాయి. రిటైర్మెంట్ ప్రకటించే వారకు ఆమె పేరు పత్రికల్లో మార్మోగుతూనే ఉంది. 1999లో ఓడీఐలతో మొదలుపెట్టిన ఆమె 2002లో టెస్టు క్రికెట్ జట్టుకు కూడా ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాట్‌తో సమాధానం..
తనపై వచ్చిన విమర్శలకు మిథాలీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పేవారు.
మీకు ఇష్టమైన మేల్ క్రికెటర్ ఎవరని ఒకసారి ఆమెను అడిగారు. వెంటనే మీకు ఇష్టమైన ఫీమేల్ క్రికెటర్ ఎవరని ఎప్పుడైనా మేల్ క్రికెటర్లను అడిగారా అని ఆమె సమాధానం చెప్పారు.
16ఏళ్ల వయసులో 26 జూన్ 1999న మిథాలీ ఐర్లాండ్‌పై తొలి ఓడీఐ ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లోనే ఆమె 114 రన్లు కొట్టారు. 19ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌పై ఆమె 214 రన్లు కొట్టి రికార్డు సృష్టించారు.
2005లో వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత మహిళల జట్టు చేరుకున్నప్పుడు.. మిథాలీ ప్రధాన పాత్ర పోషించారు.
కాలికి గాయమైనప్పటికీ న్యూజీలాండ్‌పై ఆమె 91 రన్లు కొట్టారు.
విమర్శలు కూడా..
కెరియర్‌లో ముందుకు వెళ్తున్నప్పుడే మిథాలీకి విమర్శలు కూడా ఎదురయ్యాయి. కొత్త ప్లేయర్లకు జట్టులో ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెప్పేవారు.
మహిళ జట్టు మాజీ కోచ్‌తోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్‌తో వివాదం వల్ల కూడా ఆమె వార్తల్లో నిలిచారు. అయితే మిథాలీ ఎక్కువ ఫీల్డ్‌పైనే దృష్టి పెట్టేవారు.
2017లో బ్యాటింగ్‌కు ముందుగా గ్రౌండ్‌లో రూమీ పుస్తకం పట్టుకొని ఆమె కనిపించారు. ఆ మ్యాచ్‌లో ఆమె 71 రన్లు కొట్టారు. ఓడీఐ క్రికెట్‌లో ఏడు వరుస అర్ధశతకాలు కొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఆమె రికార్డు సృష్టించారు.
బౌలింగ్‌తోనూ మిథాలీ మెరుపులు మెరిపించేవారు. ఒక మ్యాచ్‌లో అయితే, ఆమె ఎనిమిది వికెట్లు తీశారు.
మిథాలీ కెరియర్‌ను చూస్తే, ఏదో కొత్తదనం మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది.
39ఏళ్ల మిథాలీ ఆరు ప్రపంచ కప్‌లు ఆడారు. 2005 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టుకు మిథాలీనే కెప్టెన్.
23 ఏళ్ల కెరియర్‌లో ఆమె కేవలం 12 టెస్టు మ్యాచ్‌లే ఆడారు. మహిళా క్రికెట్ పరిస్థితులను ఇది కళ్లకుకడుతోంది.
ఇవి కూడా చదవండి:
- బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు, అగ్నికీలలు.. 40 మందికి పైగా మృతి, గాయపడినవారితో నిండిపోయిన ఆసుపత్రులు
- ఆస్ట్రేలియా విమానంపై నిప్పులు కురిపించిన చైనా విమానం, దక్షిణ చైనా సముద్ర గగనతలంపై ప్రమాదకర విన్యాసం
- అఫ్గాన్ సైన్యానికి భారత్ శిక్షణ ఇవ్వాలని తాలిబాన్లు ఎందుకు కోరుకుంటున్నారు
- నైకా, మామాఎర్త్ వంటి స్టార్టప్స్ భారత్‌లో చర్మ సౌందర్య సాధనాల విప్లవానికి ఎలా నాంది పలికాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













