ICC మహిళల ప్రపంచకప్: చివర్లో ఉత్కంఠ... భారత్‌కు నిరాశ... 3 వికెట్లతో దక్షిణాఫ్రికా గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
ఐసీసీ ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
న్యూజీలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య విజయం చివరి బంతి వరకు దోబూచులాడింది. ఆఖర్లో భారత్ గెలిచేలా అనిపించింది. కానీ ఒక నోబాల్ కారణంగా భారత్ విజయానికి దూరం అయింది.
దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉంది.
దీప్తి శర్మ వేసిన తొలి బంతికి ఒక పరుగు రాగా, రెండో పరుగు చేసే క్రమంలో త్రిషా చెట్టి (7) రనౌట్ అయింది. ఆ తర్వాత వరుసగా రెండు బంతుల్లో రెండే పరుగులు వచ్చాయి. తర్వాతి బంతిని మిగ్నాన్ డు ప్రీజ్ లాంగాన్ దిశగా ఆడగా అక్కడ ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నారు. దీంతో అందరూ ఆమె అవుట్ అయిందని అనుకున్నారు. మిగ్నాన్ కూడా క్రీజు వదిలి పెవిలియన్ వైపు వెళ్లడం ప్రారంభించారు. కానీ అది నోబాల్‌గా తేలింది. దీంతో విజయ సమీకరణం రెండు బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఇక ఎలాంటి తడబాటు లేకుండా దక్షిణాఫ్రికా ఆ రెండు పరుగులు కూడా సాధించి విజయాన్ని అందుకుంది.
ఆకట్టుకున్న లారా వోల్వార్ట్
275 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లిజెల్లీ లీ (6) రనౌట్ అయ్యారు. హర్మన్‌ప్రీత్ వేగంగా స్పందించి బంతిని వికెట్లకు గిరాటేయడంతో 14 పరుగుల వద్దే దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన లారా గూడాల్ (69 బంతుల్లో 49; 4 ఫోర్లు), లారా వోల్వార్ట్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.
వేగంగా పరుగులు చేస్తూ మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 133 బంతుల్లో 125 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు.
వోల్వార్ట్ బౌండరీలతో చెలరేగారు. ఆమె 44 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. సెంచరీ దిశగా వెళ్తోన్న వోల్వార్ట్ వోల్వార్ట్ (79 బంతుల్లో 80; 11 ఫోర్లు) దూకుడుకు హర్మన్‌ప్రీత్ కళ్లెం వేశారు. హర్మన్ ప్రీత్ బౌలింగ్‌లో ఆమె బౌల్డయ్యారు అంతకుముందు ఓవర్లోనే లారా గూడాల్ కూడా అవుటయ్యారు.
ఆ తర్వాత సునె లూస్ (22), మరిజానే కాప్ (32) రాణించడంతో పాటు మిగ్నాన్ డు ప్రీజ్ (63 బంతుల్లో 52 నాటౌట్: 2 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ 274/7
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది.
ఈ కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీవర్మలతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో సెమీ ఫైనల్స్ చేరుకోవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతోంది.
ఈ కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధన, షెఫాలీవర్మలతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.
క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా గెలవడానికి 275 పరుగులు చేయాలి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఫామ్‌లో ఉన్న షెఫాలీవర్మ జట్టు స్కోరు 91 వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగారు. ఆమె 46 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేశారు. కేవలం 40 బంతుల్లోనే ఆమె అర్ధసెంచరీ చేశారు.
అనంతరం క్రీజులోకి వచ్చిన యాస్తిక భాటియా కేవలం 2 పరుగులకు అవుటయ్యారు.
మిథాలీ సహకారంతో స్మృతి మంధన ఇన్నింగ్స్ నడిపించారు. ఆమె 69 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 93 బంతుల్లో 80 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 176 పరుగుల వద్ద స్మృతి మంధన (84 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యారు.
ఆ తర్వాత హర్మన్ ప్రీత్, కెప్టెన్ మిథాలీరాజ్ సమన్వయంతో ఆడుతూ జట్టు స్కోరును 200 దాటించారు. ఇదే క్రమంలో 69 బంతుల్లో మిథాలీ అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నారు. ఆర్వాత నాలుగో వికెట్‌గా మిథాలీ (84 బంతుల్లో 68: 8 ఫోర్లు) వెనుదిరిగారు. పూజ వస్త్రకర్ (3), రిచా ఘోష్ (8) విఫలమయ్యారు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన హర్మన్ ప్రీత్ కౌర్ (57 బంతుల్లో 48; 4 ఫోర్లు) కొద్దిలో అర్ధసెంచరీని కోల్పోయారు.
ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో గెలిచి మూడింటిలో ఓడిన భారత్ ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఎలాంటి అడ్డంకులు లేకండా సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి తీరాలి.
టోర్నీ ప్రారంభం నుంచి భారత్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. కానీ గత 2 మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలు సాధించిన టీమిండియా ఆ ఫామ్‌ను ఇకముందూ కొనసాగించాలి.
మైదానంలో పరిస్థితి ఏంటి?
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు మిథాలీ రాజ్ సారథ్యం వహించారు. దక్షిణాఫ్రికా జట్టు సునె లూస్ నాయకత్వంలో ఆడింది.
బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ హేమంత్ కుష్వాహా మ్యాచ్ జరుగుతోన్న మైదానానికి వెళ్లారు. కోవిడ్ పాస్‌పోర్ట్ ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నట్లు ఆయన చెప్పారు. బహుశా ఈ కారణం వల్లే స్టేడియం లోపల భారీ సంఖ్యలో అభిమానులు కనబడలేదని అన్నారు.
టీమిండియాకు మద్దతుగా చాలామంది భారతీయ అభిమానులు స్టేడియానికి రాగా, దక్షిణాఫ్రికా మద్దతుదారులు చాలా కొద్ది మందే ఉన్నారని తెలిపారు.
దక్షిణాఫ్రికా, భారత్ మ్యాచ్ స్కోరు కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, HEMANT KUSHWAKA/BBC

ఫొటో సోర్స్, HEMANT KUSHWAHA/BBC
ఇవి కూడా చదవండి:
- ఎలక్ట్రిక్ బైక్ పేలి తండ్రి, కూతురు మృతి.. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎలా పేలతాయి? ప్రమాదాన్ని ముందే గుర్తించడం ఎలా?
- కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
- యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోయిందా? లేక వ్యూహం మార్చుకుంటోందా?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- శ్రీలంక ఆర్థిక సంక్షోభం: నాలుగు నెలల పసిబిడ్డతో సముద్రం దాటిన దంపతులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








