ICC అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్: 7 బంతుల్లోనే నేపాల్‌పై గెలిచిన యూఏఈ

యూఏఈ లెఫ్టార్మ్ సీమర్, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మహికా గౌర్... 2 మెయిడెన్ ఓవర్లు వేసి కేవలం 2 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది

ఫొటో సోర్స్, Icc

ఫొటో క్యాప్షన్, యూఏఈ లెఫ్టార్మ్ సీమర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మహికా గౌర్... 2 మెయిడెన్ ఓవర్లు వేసి కేవలం 2 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్‌ టోర్నీ క్రికెట్ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు కేవలం 7 బంతుల్లో విజయం సాధించింది.

నేపాల్ జట్టు విధించిన లక్ష్యాన్ని ఈ 7 బంతుల్లోనే ఛేదించి 10 వికెట్లతో యూఏఈ ఘనవిజయం సాధించింది.

ఇంతకీ యూఈఏకి నేపాల్ నిర్దేశించిన లక్ష్యం ఎంతనుకున్నారు? కేవలం 9 పరుగులు.

అండర్-19 మహిళల ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భాగంగా మలేసియాలో శనివారం నేపాల్, యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌటైంది.

మొత్తం 8.1 ఓవర్లు ఆడిన ఆ జట్టు ప్లేయర్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. ఆరుగురు డకౌట్‌గా వెనుదిరగగా, 3 పరుగులు చేసిన స్నేహ మహారా టాప్‌స్కోరర్.

యూఏఈకి చెందిన బౌలర్ మహికా గౌర్ 4 ఓవర్లలో కేవలం రెండే పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఇందుజా నందకుమార్ 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 1
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 1

అనంతరం యూఏఈ జట్టు 1.1 ఓవర్లలోనే 9 పరుగులు చేసి గెలుపొందింది. ఇందులో రెండు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

శుక్రవారం ఈ టోర్నీ ప్రారంభం కాగా, తొలిరోజు మ్యాచ్‌లో నేపాల్, ఖతర్‌పై 79 పరుగులు తేడాతో విజయం సాధించింది.

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. అనంతరం ఖతర్‌ను 38 పరుగులకే కట్టడి చేసింది.

ఒక జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌటైన ఘటనలు గతంలో కూడా జరిగాయి.

2017లో భారత్‌‌లోని ఒక రాష్ట్ర మహిళల జట్టు కేవలం 2 పరుగులకే ఆలౌటైంది. అండర్-19 మహిళల వన్డే సూపర్ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ 2 పరుగులే చేసింది.

అందులో ఒక పరుగును ఓపెనర్ సాధించగా, మరొక పరుగు ఎక్స్‌ట్రా ద్వారా లభించింది. ఆ మ్యాచ్‌లో 9 మంది డకౌట్ అయ్యారు.

2019లో కిబుకా మహిళల టి20 టోర్నమెంట్‌లో మాలి జట్టు మూడు అత్యల్ప స్కోర్లను నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 6, 10, 11 పరుగులకే ఆలౌటైంది.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి, 2
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది, 2

ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.

''మా అందరికీ ఇదొక అద్భుతమైన ఫీలింగ్. ఇది, తదుపరి 3 మ్యాచ్‌లకు సరిపడా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అన్ని మ్యాచ్‌లు గెలిచి అండర్-19 మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధించాలి అనుకున్నాం. మ్యాచ్‌కు ముందే మా కోచ్ నజీబ్‌తో మ్యాచ్ ప్రణాళిక గురించి చర్చించాం. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలి అనుకున్నాం. అనుకున్నది సాధించాం. అయితే ఇక్కడితోనే మా ఆట ఇంకా ముగియలేదు'' అని గౌర్ చెప్పారు.

''ఈ మ్యాచ్ కోసం చాలా ప్రణాళికలు వేసుకున్నాం. ఇది జట్టు సమష్టి విజయం. మా ఫీల్డింగ్ బాగుంది. మా ప్రణాళికలు 100 శాతం అమలు చేయగలిగాం'' అని ఇందుజా హర్షం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)