RRR: ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు

ఫొటో సోర్స్, Facebook/RRR
ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొందరు ట్విటర్ యూజర్లు దీన్ని 'గే రొమాన్స్'గా చూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య రొమాన్స్‌ను తాము ఎంతో ఎంజాయ్ చేశామంటూ కొందరు పాశ్చాత్య దేశాల ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు.
అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా విజయంపై అక్కసుతోనే ఇలా వ్యతిరేక కామెంట్లు కొందరు చేస్తున్నారంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి అభిమానులు ప్రతిస్పందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Facebook/RRR
ఆర్ఆర్ఆర్ మంచి యాక్షన్ మూవీ అని కొందరు మనసును దోచే గే సినిమా కూడా అంటూ కొందరు ట్విటర్ యూజర్లు పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో వార్తా సంస్థ ఏఎన్‌ఐ రాసిన కథనాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'ఆర్ఆర్ఆర్ సినిమాను పశ్చిమ దేశాలు గే చిత్రంగా చూస్తున్నారు. నేను అనుకున్నది నిజమే.' అంటూ ఆయన ట్విటర్‌లో కామెంట్ పెట్టారు.
గతంలో లెస్బియన్ సబ్జెక్ట్‌తో తీసిన డేంజర్ సినిమా విడుదలకు ముందు కూడా రాంగోపాల్ వర్మ ఆర్ఆర్ఆర్ సినిమాపై ఈ తరహా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తన లెస్బియన్ సినిమా పేరు 'డేంజరస్'ను వాడుతూ 'డేంజరస్ 2.0' అంటూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
అందులో ... ఆర్ఆర్ఆర్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్.. ఆ సినిమా దర్శకుడు రాజమౌళిలు తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఒకరినొకరు సరదాగా గిల్లిన, ఆటపట్టించిన దృశ్యాలున్నాయి.

ఫొటో సోర్స్, Facebook/RRR
కొందరు 'ఆర్ఆర్ఆర్' సినిమాను గే రొమాన్స్ చిత్రంగా చూస్తున్నామంటూ చెబుతుంటే మరికొందరు ఆర్ఆర్ఆర్ మూవీ స్వచ్ఛమైన స్నేహ బంధానికి నిదర్శనమని అంటున్నారు.
ఎల్‌జీబీటీ ప్రైడ్ మంత్ సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూడడం బాగుందని ఓ యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని పశ్చిమ దేశాల వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారంటూ మరికొందరు ట్వీట్లు చేశారు.
అద్భుతమైన యాక్షన్ మూవీ ఇది. కానీ, మనసు దోచే గే సినిమా అని కూడా నాకు ఎవరూ చెప్పలేదెందుకు? అని ఓ యూజర్ ట్వీట్ చేశారు.
దీనికి స్పందనగా మరో యూజర్... అన్నీ సెక్సువల్ ఓరియెంటేషన్ కోణంలోనే చూస్తారెందుకు? విన్ డీజిల్, పాల్ వాకర్ సినిమాలు, అవెంజర్ సినిమాల సంగతేంటి అంటూ ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
'ఆర్ఆర్ఆర్' సినిమా 'గే రొమాన్స్' అంటూ చాలా మంది ట్వీట్లు చేసిన విషయం వాస్తవమే కానీ వాటిలో కొన్ని అకౌంట్లు నిజమైనవా లేక నకిలీ ఖాతాలా అనే విషయంలో స్పష్టత లేదు.
కొందరు భారతీయ ట్విటర్ యూజర్లు కూడా 'ఆర్ఆర్ఆర్' గే రొమాన్స్ సినిమా అంటూ పోస్టులు పెడుతున్నారు.
మొత్తానికి ఇలా 'ఆర్ఆర్ఆర్' మూవీ సోషల్‌లో మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జూన్ 1న అమెరికాలో ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా విదేశీయులు కూడా ఈ సినిమాను చూస్తుండడంతో ఈ తరహా ట్వీట్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా బాగుంది అంటూ ట్వీట్లు చేస్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)