ఈ పండ్లు తింటే అంగస్తంభన సమస్య రాదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ ఫుడ్
- హోదా, .
బ్లాక్‌కరెంట్స్.. వీటినే ‘కాసిస్’ అంటారు. కొందరు ‘నల్ల ద్రాక్ష’గా పిలుస్తుంటారు. అయితే, నల్ల ద్రాక్ష, బ్లాక్ కరెంట్ రెండూ వేర్వేరు రకాల పండ్లు.
బ్లాక్‌కరెంట్స్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయి. బ్రిటన్‌లో ఈ పండ్లను ఎక్కువగా తింటారు.
ప్రస్తుతం భారత్‌లోనూ మార్కెట్లతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఈ పళ్లు దొరుకుతున్నాయి.
నారింజలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ‘విటమిన్ సీ’ వీటి నుంచి లభిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. భవిష్యత్‌లో కొన్ని రకాల ఔషధాల తయారీలోనూ వీటిని ఉపయోగించొచ్చు.
బ్లాక్‌కరెంట్స్ పొడి, చూర్ణాలు మెదడు పనితీరు, రక్తపోటు నియంత్రణపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? లాంటి అంశాలపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక ఆరోగ్యాన్ని మెరుపరచగలవా?
అంగ స్తంభన (ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్) సమస్య నుంచి బయటపడటంలో పురుషులకు ఈ పళ్లు సాయం చేస్తాయో లేదో తెలుసుకునేందుకు బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎడిన్ క్యాసిడీ ఓ పరిశోధన చేపట్టారు.
‘‘చాలా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కేసుల్లో రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఈ సమస్యకు బ్లాక్‌కరెంట్స్‌లోని ఆంథోసయనిన్లుతోపాటు కొన్ని ఫ్లేవనాయిడ్లు పరిష్కారం చూపగలవు. వీటి వల్ల రక్తనాళాలు కాస్త తెరచుకోవడంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది.’’ అని ఆమె చెప్పారు.
‘‘ఈ అధ్యయనంలో భాగంగా 25,000 మందిని పురుషుల ఆరోగ్యాన్ని పదేళ్లపాటు గమనించాం. దీంతో వారంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఈ పళ్లను తీసుకునేవారిలో మిగతవారితో పోల్చినప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే అవకాశం 19 శాతం తక్కువగా ఉంటుంది.’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా ఏం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?
రక్త సరఫరాను మెరుగుపరచడంతోపాటు ఆంథోసయనిన్లతో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
‘‘ఆరోగ్యంపై ఆంథోసయనిన్లు చూపే ప్రభావం మీద గత దశాబ్దంలో చాలా అధ్యయనాలు జరిగాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం, మేధో శక్తి మెరుగుపరచడానికి ఇవి తోడ్పడతాయని వీటిలో తేలింది. తాజాగా పార్కిన్సన్స్ రోగులకూ ఈ పళ్లు మేలు చేస్తాయని బయటపడింది.’’ అని ఎడిన్ చెప్పారు.
ఆరోగ్యంపై బ్లాక్‌కరెంట్లస్ చూపే ప్రభావం మీద చిచెస్టెర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మార్క్ లిలియమ్స్ కూడా పరిశోధన చేపట్టారు. ముఖ్యంగా ఈ పళ్ల పొడి, చూర్ణాలపై ఆయన పరిశోధనలు సాగాయి.ఆయనకు ఈ పళ్లంటే చాలా ఇష్టం కూడా.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇతర బెర్రీలతో పోలిస్తే, బ్లాక్‌కరెంట్స్‌తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనికి సూపర్‌ఫుడ్ అనే పదాన్ని ఉపయోగించను. కానీ, బెర్రీలన్నింటిలోనూ ఇవి చాలా మంచివి.’’ అని ఆయన అన్నారు.
‘‘వృద్ధుల్లో నరాలు బిగుసుకుపోయే సమస్యను ఈ బ్లాక్‌కరెంట్స్‌తో తగ్గించుకోవచ్చని జపాన్‌లోని నిప్పాన్ స్పోర్ట్ యూనివర్సిటీ నిపుణులతో కలిసి చేపట్టిన అధ్యయనంలో తేలింది.’’ అని ఆయన చెప్పారు.
‘‘రక్త నాళాలు బిగుసుకుపోతే.. అవి వ్యాకోచించడం, పెద్దవి కావడం కష్టం అవుతుంది. ఫలితంగా రక్తపోటుపై ప్రభావం పడుతుంది.’’ అని విలియం వివరించారు.
‘‘అధ్యయనంలో భాగంగా వృద్ధులకు ఏడు రోజులపాటు బ్లాక్‌కరెంట్స్ జ్యూస్ ఇచ్చాం. దీంతో వారిలో నరాలు బిగుసుకుపోయే సమస్య తగ్గినట్లు తర్వాత చేపట్టిన పరీక్షల్లో తేలింది.’’ అని ఆయన తెలిపారు.
పర్వతాలను అధిరోహించే వారికీ ఈ పళ్లు చాలా మేలు చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
‘‘పర్వాతరోహణ లేదా వ్యాయామం తర్వాత కండరాలకు అయ్యే గాయాలను బ్లాక్‌కరెంట్స్ పొడి త్వరగా మానేలా చేయలదు.’’ అని విలియమ్స్ చెప్పారు.
చెడు వాసన తగ్గుతుందా?
బ్లాక్‌కరెంట్స్ పొడి లేదా చూర్ణం తీసుకుంటే మన శరీరం నుంచి చెడు వాసన రావడం కూడా తగ్గుతుందని ఒక అధ్యయనంలో తేలింది.
‘’45 ఏళ్లకు పైబడిన వారి చర్మం నుంచి ఒకరకమైన గ్యాస్ విడుదల అవుతుంది. దీన్నే ‘ఓల్డ్ పీపుల్ స్మెల్’గా చెబుతారు. వయసు పైబడేకొద్దీ ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ వల్ల ఈ గ్యాస్ మరింత ఎక్కువగా వస్తుంది.’’ అని విలియం చెప్పారు.
‘‘ఈ అధ్యయనంలో 55 ఏళ్లకు పైబడిన 14 మంది పాల్గొన్నారు. ఏడు రోజులపాటు వీరు బ్లాక్‌కరెంట్స్ పొడి తీసుకోవడంతో ఆ గ్యాస్‌లు 25 శాతం వరకూ తగ్గినట్లు తేలింది.’’ అని ఆయన వివరించారు.
‘‘మిగతా బెర్రీలు ఈ విషయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో కూడా పరిశోధన చేపట్టాల్సి ఉంది.’’ అని ఆయన అన్నారు.
అన్నింటికీ సంజీవని కాదు
‘‘బ్లాక్‌కరెంట్స్ ధర కాస్త ఎక్కువే ఉంటుంది. అందరూ వీటిని కొనుగోలు చేయలేరు.’’ అని మార్క్ విలియమ్స్ అన్నారు.
అదే సమయంలో అన్ని సమస్యలకూ దీన్ని సంజీవనిగా చూడకూడదని ఆయన చెప్పారు.
‘‘కొంతమంది ఏ సమస్యనైనా బ్లాక్‌కరెంట్స్ తగ్గిస్తాయని చెబుతుంటారు. అలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.’’ అని ఆయన అన్నారు.
బ్లాక్‌కరెంట్స్ విషయంలో చాలా అధ్యయనాలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఈ విషయంలో లోతైన అధ్యయనాలు అవసరమని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది.. ఇప్పటికే కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న ఈ యాప్‌లో ఫీచర్స్ ఏమిటి
- ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















