సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన విషయం. ప్రకృతి దీన్ని ఎంత సంక్లిష్టంగా మార్చిందంటే, లోతుగా పరిశీలించిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది.
సెక్స్ పట్ల మనోభావాలు, నమ్మకాలు, ప్రతిచర్యలు ప్రతి జీవికీ వేరు వేరుగా ఉంటాయి. అది మనిషి అయినా, పక్షి అయినా, పాము అయినా.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో హైలాండ్స్‌లో పనిచేస్తున్నారు కీటక శాస్త్రవేత్త జీసస్ రివాస్.
దక్షిణ అమెరికాలో కనుగొన్న జెయింట్ అనకొండ పాము లైంగిక జీవితానికి సంబంధించిన షాకింగ్ సమాచారాన్ని జీసస్ పరిశోధన వెల్లడించింది.
ఈ అనకొండలో సెక్స్ తర్వాత, ఆడ మగని తింటుంది. ఆడ పాము సంభోగం సమయంలో మగ పాములపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆడది మగ పాముల సూచనలకు మాత్రమే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు భావించేవారు.
అయితే, అనకొండ గురించిన ఈ వింత సమాచారం వారికి షాకిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
సంభోగంలో స్త్రీ ఆధిపత్యం
ఆడ ప్రాణి పెరిగి పెద్దదైతే సంభోగం సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇతర జాతులలో మగవి పెద్ద పరిమాణంలో, ఎక్కువ శక్తిమంతంగా ఉంటాయి. కానీ, పాముల విషయంలో మాత్రం వేరేలా ఉంది.
అనకొండ జాతులలో ఆడ పాము, మగ దానికంటే కంటే ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి మగ దానిని ఆడది సులభంగా మింగగలదు.
బల్లులు, పక్షులు, క్షీరదాలలో సాధారణంగా ఆడ కంటే మగది పెద్దగా ఉంటుంది.
కానీ పాములలో ఆడ పరిమాణం పెద్దదిగా ఉండటం మగ దానికి అంత మంచిది కాదు.
సంభోగం సమయంలో మగ పాము తన తోకతో భాగస్వామిని నెట్టి ఆడ పాము జననాంగాల వద్దకు చేరుకుంటుంది. అందుకే సెక్స్ కోసం మగ పాము శరీర పరిమాణం ఆడ పాము కంటే పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆడ పామును మగవి ఎలా కనిపెడతాయి?
ఆడ పాము పెద్ద సైజు కారణంగా ఎక్కువ గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తుంది. అందువల్ల చిన్న మగ పాములు పెద్ద ఆడ పాములను సెక్స్ భాగస్వాములుగా కోరుకుంటాయి.
పాములు సరిగ్గా చూడలేవని అంటారు కదా, మరి మగ పాములు సెక్స్ కోసం పెద్ద ఆడ పాములను ఎలా కనిపెడతాయి?
పాము జాతులలో సంభోగం చేయాలనే కోరిక మొదట ఆడ పాము ద్వారా వ్యక్తమవుతుందని పరిశోధనలో కనుగొన్నారు.
ఆడ పాము చల్లని లేదా వేడి వాతావరణంలో నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు, అది దాని చర్మాన్ని తొలగిస్తుంది.
ఈ సమయంలో అది ఫెరోమోన్ అనే హార్మోన్‌ను కూడా విడుదల చేస్తుంది. దాని వాసనను మగ పాములు పసిగడతాయి.
అదే హార్మోన్ సహాయంతో మగ పాము ఆడ పాము పరిమాణాన్ని తెలుసుకుంటుంది.
మగ పాములు వయసులో ఉన్న ఆడ పాములను ఆకర్షించడానికి ప్రయత్నించవు, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. పెద్ద ఆడ పాము కనిపిస్తే మగ పాము త్వరగా దాని వైపు కదులుతుంది.
మగ పాములు అనేక ఆడ పాములతో సహజీవనం చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, కొత్త పరిశోధన ఫలితం దీనికి విరుద్ధంగా ఉంది.
అనకొండల ప్రేమ
మిగతావాటి కంటే మలేషియాలో కనిపించే 'ప్యారడైజ్ ఫ్లయింగ్ స్నేక్' కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తుందని బ్రిటన్‌లోని వాల్వర్ హాంప్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్ ఓషీయా కనుగొన్నారు.
చాలా వరకు మగవి ఆడ పాములను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి.
ఈ జాతికి చెందిన కిల్-బెల్లీడ్ విప్ స్నేక్‌లో, మగ పాములు ఒక జట్టుగా ఏర్పడి ఆడవాటిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి.
ఒకే చోట బహుళ భాగస్వాములతో సంభోగం చేయడం కొన్ని జాతుల పాములలో కూడా కనిపిస్తుంది.
ఆడ అనకొండ బురద లోపలికి వెళితే, మగ అనకొండలు దాన్ని చుట్టుముట్టడం ప్రారంభిస్తాయి,
దగ్గరికి వచ్చి దాన్ని తన వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. ఈ సంభోగం కాలం కొన్ని నెలల పాటు ఉంటుంది.
అయితే, జీసస్ రివాస్ వేరేలా చెబుతున్నారు. ఒకసారి ఒక మగ ఆకుపచ్చ అనకొండ ఆడదాన్ని వెంబడించడం ఆయన చూశారు.
ఆ సమయంలో ఇతర ఆడ అనకొండలు కూడా ఉన్నాయి. ఆ మగ అనకొండ వాటితో సహవాసం కూడా చేయగలదు.
అయినప్పటికీ, మగ పాము ఒకే ఆడ పాము పట్ల ఆసక్తి కలిగి ఉంది. అంటే, దానితో మగపాము ప్రేమలో పడి ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఒక ఆడ పాము కోసం వందల మగ పాములు
కెనడాలో కనిపించే గార్టర్ పాములు ఆడ పాములను ఆకర్షించడానికి తీవ్రమైన పోటీని ప్రదర్శిస్తాయి. వంద మగ పాములు ఒక ఆడ పాముని వెంటాడతాయి.
అక్కడి మానిటోబా అడవుల్లో పాముల సంభోగం సమయంలో ఇటువంటి దృశ్యం తరచుగా కనిపిస్తుంది.
అయితే, ఈ జాతి పాము అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో ఇలా చేయడం కనిపించదు. దీనర్థం లైంగిక ప్రవర్తన అనేది ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది.
ఉదాహరణకు, న్యూ మెక్సికోలో కనిపించే గార్టెర్ పాములు కెనడాలోని గార్టర్ పాముల వలె ప్రవర్తించవు.
ఈ పాముల 'స్వయంవరం'లో, సాధారణంగా ఆడది తన సహచర మగ పామును ఎన్నుకుంటుంది.
సంభోగం ప్రక్రియ అంతటా ఆడది ఎల్లప్పుడూ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. సహచరుడి ఎంపిక నుంచి సంభోగం కాలం వరకు నిర్ణయాధికారం ఆడపాముదే.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్‌లో సంతృప్తి చెందకపోతే ఏం చేస్తాయి?
మగ పాము సెక్స్‌లో సంతృప్తి కలిగించకపోతే, ఆడ పాము వెంటనే దాన్ని దూరంగా నెట్టివేసి మరొక భాగస్వామి కోసం చూస్తుంది.
తనకు ఏ మగపాము సరిపోతాడో ఆడ పాము ఎలా నిర్ణయిస్తుంది? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇంకా స్పష్టమైన సమాధానం కనుగొనలేదు.
ఇది మగ పాము సామర్థ్యం, కోరికపై ఆధారపడి ఉండవచ్చు. లేదా మగ పాము స్పర్శను బట్టి ఆడపాము దాని బలాన్ని అంచనా వేయవచ్చు.
ఒక ఆడ పాము అదే మగ పాముతో రెండోసారి జతకట్టాలని లేదు. ఆడ పాము వేర్వేరు మగ పాములతో సెక్స్ చేయడం కనిపిస్తుంది.
మరోవైపు, మగ పాము విధేయతతో ఉండగానే, ఆడది మరొక మగ పాముతో జతకట్టడానికి ఆసక్తిగా ఉంటుంది.
ఆడ పాము నిద్రిస్తున్నప్పుడు మగ పాము దాని చుట్టూ తిరుగుతుంది. ఆడ పాముతో సెక్స్ చేయాలనుకుంటే మగది దానికి విధేయంగా ఉంటుంది.
ఒకే ఆడపాము అనేక మగ పాములతో...
బహుశా ఆడ పాములకు సెక్స్ పట్ల బలమైన కోరిక ఉండవచ్చు లేదా అనేకమైన మగ పాములతో సంభోగం తర్వాత ఏ పాము పిల్లలు అందించడానికి అర్హమైందో నిర్ణయించుకోవడానికి అలా చేస్తూ ఉండవచ్చు.
కాగా, అన్నింటికన్నా సెక్స్ ఉద్దేశం తరువాతి తరానికి జన్మనివ్వడమే. శుక్రకణాలను కొన్ని రోజుల పాటు తన శరీరంలో భద్రపరుచుకునే సామర్థ్యం ఆడ పాములకు ఉంది.
బహుశా అందుకే ఆడపాము అనేక మగ పాములతో సంభోగంలో పాల్గొంటుంది. ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిస్తుంది.
ఆడ పాములు సెక్స్ తర్వాత ఫెరోమోన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. మగ పాముకు ఇక సంభోగం ఉండదనే సందేశం ఇది.
శాస్త్రవేత్తలు దీనిని 'మేటింగ్ ప్లగ్' అని పిలుస్తారు. అంటే ఆ సమయంలో ఆడపాము జననేంద్రియాలు మూసుకుపోతాయి.
కాబట్టి చాలావరకు మగ పాము కోరుకున్నప్పటికీ ఆడపాము జతకట్టదు. పిల్లలకు జన్మనివ్వదు. ఎందుకంటే మగపాము స్పెర్మ్ స్త్రీ జననేంద్రియాలలోకి ప్రవేశించడం కష్టం.
కానీ, ఈ 'మేటింగ్ ప్లగ్' ఎల్లప్పుడూ విజయవంతం కాదు. మగ పాము స్పెర్మ్ చొచ్చుకుపోయి నెమ్మదిగా ఆడ దాని అండాశయాలకు చేరుకుంటాయి.
అంటే మగ పాము కూడా తన జాతిని పెంచుకోవడానికి కృషి చేస్తుంది. ఆడ అనకొండ సంభోగం తర్వాత మగదాన్ని మింగేస్తుంది.
కాబట్టి సెక్స్ తర్వాత మగపాము వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సాలెపురుగులదీ అదే తీరు..
ఆడ అనకొండ సంభోగం తర్వాత మగ దాన్ని ఏ సమయంలో తింటుందో కచ్చితంగా తెలియదు. అంతేకాకుండా ఇది ప్రతిసారీ జరగదు.
కానీ, మగ పాము చనిపోవడం వల్ల ఆడ పాముకు పౌష్టికాహారం లభిస్తుంది. ఎందుకంటే గర్భం దాల్చిన ఏడు నెలల వరకు ఆడ పాము ఏమీ తినదు, తాగదు.
పాములు, సాలెపురుగుల లైంగిక విధానాలలో చాలా పోలికలు ఉంటాయి. సాలెపురుగులలో మగవి పెద్దవి. అయితే, ఆడవాటిని ఆకర్షించడానికి మగ సాలెపురుగల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.
సంభోగం సమయంలో ఆడ సాలెపురుగు ఆధిపత్యం చెలాయిస్తుంది. అంతేకాకుండా సంభోగం తర్వాత మగ సాలెపురుగును కూడా తింటుంది.
సాలెపురుగులు, పాములు ఒకే రకమైన జాతికి చెందినవి కావు. జీవ పరిణామ క్రమంలో లక్షల ఏళ్ళ కిందట అవి వేరయ్యాయి. అయినప్పటికీ, వాటి లైంగిక ప్రక్రియల్లో సారూప్యం ఎందుకు?
ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే, ముందే చెప్పినట్లు సెక్స్ అనేది ఈ సృష్టిలో అత్యంత సంక్లిష్టమైన అంశం.
ఇవి కూడా చదవండి
- యూసీసీ: ఇక మేనరికం వివాహాలపై నిషేధమేనా... ఉమ్మడి పౌర స్మృతి అమలైతే పెళ్లి, విడాకులు, ఆస్తి యాపంపకాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















