మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

88 ర‌కాలైన చిన్న చిన్న వ్యాపారాలు నెల‌కొల్ప‌డానికి ఈ రుణం అంద‌జేస్తారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 88 ర‌కాలైన చిన్న చిన్న వ్యాపారాలు నెల‌కొల్ప‌డానికి ఈ రుణం అంద‌జేస్తారు
    • రచయిత, ఎ.కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

మ‌హిళ‌లు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంది, 88 ర‌కాల చిన్న చిన్న వ్యాపారాలు నెల‌కొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కమే ‘ఉద్యోగిని’.

ఉద్యోగిని ప‌థ‌కం అంటే ఏమిటి, దీని కింద రుణం ఎలా పొందాలి, పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌లు ఏమిటి, ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి, ఏఏ వ్యాపారాలు చేయ‌డానికి రుణం ఇస్తారు?

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా, వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగి త‌మ‌ కాళ్ల‌పై తాము నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ‌హిళ‌లు త‌మ‌ కాళ్ల‌పై తాము నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ఇది

ఏమిటీ ఉద్యోగిని ప‌థ‌కం?

కేంద్ర ప్ర‌భుత్వం ఆత్మ‌నిర్భ‌ర్ కార్యక్రమం లక్ష్యాల్లో మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబన కోసం ఆర్థిక స‌హాయం అందించడమూ ఒకటి.

మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా, వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగి త‌మ‌ కాళ్ల‌పై తాము నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కమే ఉద్యోగిని.

దీన్ని మొద‌ట కర్ణాటక ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టినప్ప‌టికీ త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వం దీన్ని వుమెన్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దేశ‌మంత‌టా అమ‌లు చేస్తోంది.

ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబన‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప‌థ‌కం ద్వారా 48 వేల మంది మ‌హిళ‌లు ల‌బ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామిక‌వేత్త‌లుగా రాణిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు..

రుణ ప‌రిమితి రూ.3 ల‌క్ష‌లేనా?

కాదు. వైక‌ల్య‌మున్న మ‌హిళ‌లు, వితంతువులకు రుణ ప‌రిమితి లేదు. వారు నెల‌కొల్పే వ్యాపారం, వారి అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఇంకా ఎక్కువ రుణం క‌ల్పిస్తారు.

వ‌డ్డీ ఎంత?

వైక‌ల్యం ఉన్న‌వారు, వితంతువులు, ద‌ళిత మ‌హిళ‌ల‌కు పూర్తిగా వ‌డ్డీ లేని రుణం క‌ల్పిస్తారు. మిగిలిన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు 10 శాతం నుంచీ 12 శాతం వ‌డ్డీ మీద రుణం ఇస్తారు.

ఈ వ‌డ్డీ అనేది ఆ మ‌హిళ రుణం పొందే బ్యాంకు నిబంధ‌న‌ల‌ను బ‌ట్టి ఉంటుంది.

రుణంలో రాయితీ ఎంత?

కుటుంబ వార్షికాదాాయాన్ని బట్టి 30 శాతం వరకూ రాయితీ క‌ల్పిస్తారు.

గ‌తంలో ఏదైనా రుణాలు తీసుకుని స‌రిగ్గా తిరిగి చెల్లించ‌కుండా ఉన్న‌ట్ల‌యితే రుణం ఇవ్వ‌రు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ‌తంలో ఏదైనా రుణాలు తీసుకుని స‌రిగ్గా తిరిగి చెల్లించ‌కుండా ఉన్న‌ట్ల‌యితే రుణం ఇవ్వ‌రు

ఎవ‌రు అర్హులు?

18 సంవ‌త్స‌రాలు నిండిన 55 సంవ‌త్స‌రాల వ‌య‌సులోపు మ‌హిళ‌లంద‌రూ అర్హులే.

ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే మ‌హిళలు త‌మ క్రెడిట్ స్కోరు బ‌లంగా ఉండేలా చూసుకోవాలి.

గ‌తంలో ఏదైనా రుణాలు తీసుకుని స‌రిగ్గా తిరిగి చెల్లించ‌కుండా ఉన్న‌ట్ల‌యితే రుణం ఇవ్వ‌రు.

సిబిల్ స్కోరు బాగా ఉండేట‌ట్లు చూసుకోవాలి.

ఏమేం ప‌త్రాలు స‌మ‌ర్పించాలి?

  • పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జ‌త చేయాలి
  • ద‌ర‌ఖాస్తు చేస్తున్న మ‌హిళ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం
  • దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారు రేష‌న్ కార్డు కాపీని జ‌త‌ప‌ర‌చాలి.
  • ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • బ్యాంకు ఖాతా పాసు పుస్త‌కం
వీడియో క్యాప్షన్, 88ఏళ్ల వయసులోను చలాకీగా పనిచేస్తూ స్పూర్తిగా నిలుస్తున్న బామ్మ

ఎవ‌ర్ని సంప్ర‌దించాలి?

ఈ ప‌థ‌కం కింద రుణం పొంద‌డానికి మ‌హిళ‌లు త‌మ ప్రాంతంలోని బ్యాంకుల‌ను సంప్ర‌దించాలి.

బ‌జాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు కూడా ఈ రుణాన్ని కల్పిస్తున్నాయి.

మరిన్ని వివ‌రాల‌కు సంప్ర‌దించాల్సిన చిరునామా:

Udyogini

D-17

Basement, Saket,

New Delhi - 110017

ఫోన్ నంబరు: 011-45781125

ఈమెయిల్ : [email protected]

వీడియో క్యాప్షన్, పాకెట్ మనీ కోసం ఉద్యోగాలు చేయడం అన్న కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే భారత్‌లో కూడా పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)