‘అందరూ నా వక్షోజాలే చూస్తుంటే ఇబ్బందిగా ఉండేది.. ఆపరేషన్ చేయించుకుని తగ్గించుకోవాల్సి వచ్చింది’

వక్షోజాలు

ఫొటో సోర్స్, NICOLE POOLE

    • రచయిత, మేగన్ లాటెన్, ప్రియా రాయ్
    • హోదా, బీబీసీ

పెద్ద రొమ్ములను కలిగి ఉండటం అంటే ఏమిటో బీబీసీ ఇంటర్వ్యూలో వివరించేటప్పుడు సిగ్గు, నొప్పి అనే రెండు పదాలు వాడారు కొందరు మహిళలు.

అందులో జాకీ అడెడేజీ ఒకరు. బ్రిటన్‌లో పెద్ద రొమ్ములు ఉన్నవారిని ఆటపట్టిస్తుంటారని ఆమె చెప్పారు.

తన రొమ్ములు పెద్దగా ఉండడంతో వాటిని దాచుకోవాలని ఆమె తరచూ ప్రయత్నించేవారు.

‘నేను 11 ఏళ్ల వయసులో అప్పటికే హైపర్ సెక్సువలైజ్ అయ్యాను. నేను పాఠశాలకు వెళ్తున్నప్పుడు మగవాళ్లు నన్ను చూసి పెదవులు చప్పరించుకుంటూ వెళ్లడం నాకు గుర్తుంది’ అని ఆమె చెప్పారు.

ఆ తరువాత ‘’నా సహోద్యోగులు నన్ను సెక్స్ వస్తువులా చూసేవారు’’ అని తెలిపారు.

మహిళల సమస్యలు

ఫొటో సోర్స్, KATIE SYLVESTER

పరిష్కారం ఎలా దొరికింది?

ఈ సమస్యకు పరిష్కారం అన్వేషిస్తూనే వయసుతో పాటు తన శరీరాన్ని అంగీకరించడం నేర్చుకున్నానని "మై బిగ్ బూబ్స్: అన్ టోల్డ్" అనే డాక్యుమెంటరీలో జాకీ చెప్పారు.

పరిస్థితి మరింత పెద్దదవుతుంటే చాలామంది మహిళలు సర్జరీలకు ఆసక్తి చూపించేవారు. అప్పుడు అంతా సాధారణంగా ఉండేది.

బ్రిటన్‌లో ఎక్కువగా జరిగే కాస్మొటిక్ సర్జరీలలో రెండో స్థానంలో ఉన్న సర్జరీ ‘రొమ్ముల పరిమాణం తగ్గించుకునేందుకు చేయించుకునే శస్త్రచికిత్సే’నని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఈస్తటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ (బీఏఏపీఎస్) నివేదించింది.

మహిళల సమస్యలు

ఫొటో సోర్స్, ACME PRODUCTIONS

నిరుడు 5,270 మంది ఇలాంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అంతకుముందు ఏడాది కంటే ఇది 120 శాతం ఎక్కువ.

పెద్ద రొమ్ములను కలిగి ఉండటం "మానసికంగా ఎంత కుంగదీస్తుందో" ప్రజలు గుర్తించరని జాకీ అంటున్నారు.

‘రొమ్ములు పెద్దగా ఉన్నపుడు చాలామంది అదేదో తమ ఆస్తి అన్నట్లుగా చూస్తారు’ అన్నారామె. మతాచారాలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో పెరగడం వల్ల జాకీ మరికొన్ని ఇతర ఒత్తిళ్లకూ లోనయ్యారు.

"నువ్వు క్లాసీగా ఉండాలి. నల్లజాతి మహిళగా ఎల్లప్పుడూ వీలైనంత సానుకూలంగా కనిపించాలని కోరుకుంటారు. నా రొమ్ములు సానుకూలంగా కనిపించడం లేదని నేను తరచుగా అనుకునేదానిని" అని ఆమె తెలిపారు.

అంబర్​

ఫొటో సోర్స్, AMBER

‘నొప్పి భరించలేక ఆపరేషన్ చేయించుకున్నాను’

26 ఏళ్ల బ్రిటిష్ యువతి అంబర్‌దీ ఇదే పరిస్థితి. 2022 ప్రారంభంలో శస్త్రచికిత్స చేయించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు.

రొమ్ముల సైజ్ కారణంగా కొన్నేళ్లుగా నొప్పితో బాధపడుతున్న అంబర్ ఆపరేషన్ కోసం ఊహించిన దానికంటే ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది.

"నేను పాఠశాలలో ఉన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాను. కానీ నేను నా కుమార్తెకు పాలిచ్చిన తర్వాత నొప్పి పెరిగింది " అని ఆమె చెప్పారు.

ఆపరేషన్ కోసం అంబర్ అభ్యర్థనను బ్రిటన్ ప్రజారోగ్య వ్యవస్థ పదేపదే తిరస్కరించింది.

"నేను, నా భర్త చాలాసేపు మాట్లాడుకున్నాం. రుణం కోసం దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారామె.

"ఆర్థిక భారమే అయినప్పటికీ ఆపరేషన్ చేయించుకోవాలన్నది నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం" అని ఆమె అన్నారు.

రచెల్​

ఫొటో సోర్స్, RACHAEL

చూసే దృష్టి మారాలి

రొమ్ముల పరిమాణం తగ్గించుకోవడమనేది దాని పనితీరు, కాస్మొటిక్ ప్రయోజనాలతో కూడిన ప్రభావవంతమైన ప్రక్రియ అని బీఏఏపీఎస్ వైస్ ప్రెసిడెంట్ నోరా నుజెంట్ అంటున్నారు.

"ఇది శారీరక సౌలభ్యం, ప్రాక్టికాలిటీల పరంగా దుస్తులు సరిపోయేలా చేయడం వంటి విషయాలలో కూడా సహాయపడుతుంది" అని ఆమె అంటున్నారు.

"చాలా కాలంగా శస్త్రచికిత్స అనేది ఒక రహస్యంతో ముడిపడి ఉంది. రొమ్ము తగ్గింపు అనేది అందరి విషయంలో సౌందర్య సాధన మార్గం కానప్పటికీ, అది ఆ కోవలోకి వచ్చి చేరింది. కాబట్టి ప్రజలు దాని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఇది చాలా ఓపెన్‌" అని నోరా తెలిపారు.

ఎక్కువ మంది మహిళలు ఈ ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపడంతో జాకీ డాక్యుమెంటరీ ప్రజలను మరింత సానుభూతితో ఉండేలా చేయొచ్చు.

"పెద్ద రొమ్ములతో ఉన్న స్త్రీల పట్ల మరింత కనికరం చూపాలని నేను కోరుకుంటున్నా. పెద్ద రొమ్ములున్న స్త్రీ వీధిలో వెళుతుంటే, ఆమె తన పనేదో తాను చేసుకుంటుంది అని జనం అనుకోవాలి. ఆమెను అలా ఒంటరిగా వదిలేయాలి’’ అని నోరా అన్నారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)