బీట్‌రూట్‌తో 5 లాభాలు

రెడ్ బీట్‌రూట్

ఫొటో సోర్స్, Getty Images

బచ్చలికూర, పాలకూర కుటుంబానికి చెందిన బీట్‌రూట్ ఆకులు, గడ్డలు రెండూ కూడా ఆరోగ్యానికి మంచిది.

దీని ఆకులు కాస్త చేదుగా అనిపించినప్పటికీ, రూట్ మాత్రం తియ్యగా ఉంటుంది.

బీట్‌రూట్‌లు ఏడాదంతా దొరుకుతూనే ఉంటాయి. కూరలకు వాడే తెల్లటి, పసుపు వంటి బీట్స్ కూడా ప్రజలకు మార్కెట్లో దొరుకుతుంటాయి. ఎర్రటి బీట్స్ క్యాన్సర్‌పై పోరాడే బీటాసైనిన్ అనే సమ్మేళనాన్ని అధికంగా కలిగి ఉంటుంది.

బీట్‌రూట్: ఫైబర్ అధికం

  • బీటాసైనిన్ ఉండటం వల్ల దీనిలో క్యాన్సర్‌తో పోరాడే పోషకాలుంటాయి.
  • అత్యధిక నైట్రేట్ కాన్సట్రేషన్‌తో రక్తపోటును ఇది తగ్గిస్తుంది.
  • శరీరంలో ఎనర్జీ స్థాయులకు ఇది సపోర్ట్ చేస్తోంది. వ్యాయామం ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
  • అత్యధిక ఫైబర్ కంటెంట్ ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.

బీట్‌రూట్‌: పోషక విలువలు

36 కిలో కేలరీలు

7 గ్రాముల ప్రొటీన్

1 గ్రాము కొవ్వు

6 గ్రాముల కార్బోహైడ్రేట్స్

5 గ్రాముల ఫైబర్

380 గ్రాముల పొటాషియం

150 ఎంసీజీ ఫోలెట్

బీట్‌రూట్

ఫొటో సోర్స్, Getty Images

బీట్‌రూట్: ఐదు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు

యాంటీ క్యాన్సర్ కారకాలు

బీట్‌రూట్‌‌లో సమృద్ధిగా లభించే, పర్పుల్ క్రింప్సన్ రంగులో ఉండే బీటాసైనిన్, శక్తివంతమైనది. బ్లాడర్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిర్మూలించేందుకు సహకరిస్తుంది.

రక్తపోటు తగ్గిస్తుంది

నైట్రేట్స్ వంటి సహజసిద్ధమైన పోషకాలను బీట్‌రూట్ కలిగి ఉంటుంది. ఇవి గుండెకు ఎంతో మంచివి. రక్త నాళాలను కాస్త రిలాక్స్ చేయడం ద్వారా రక్తసరఫరాను మెరుగుపరిచేందుకు ఈ నైట్రేట్స్ సాయం చేస్తాయి.

ధమనుల దృఢత్వాన్ని ఇది పెంచుతుంది. రక్త పోటును తగ్గించడం ద్వారా గుండె సమస్యలు, గుండె పోటుల నుంచి తప్పించుకోవచ్చు.

వ్యాయామం ఫలితాలు మెరుగ్గా ఉంటాయి

పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ డేవిడ్ వైర్ తన విజయ రహస్యం బీట్‌రూట్ జ్యూస్ అని తెలిపిన తర్వాత ఈ జ్యూస్ బాగా పాపులారిటీ పొందింది. వ్యాయామాల పర్‌ఫార్మెన్స్ మెరుగుపరిచేందుకు , శరీరంలో ఎనర్జీ స్థాయులను పెంచుకునేందుకు అథ్లెట్స్ బీట్‌రూట్ జ్యూస్‌ను తమ డ్రింక్స్‌లో చేర్చుకుంటున్నారని తాజా అధ్యయనాలు గుర్తించాయి.

ఈ జ్యూస్ కండరాల రికవరీకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, కండరాలు రిలాక్స్ అయినప్పుడు, బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్ కండరాల కణాల్లో ఆక్సిజన్‌ను పెంచేందుకు సాయపడతాయి. అంతేకాక, మన ఆహారంలో బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల, మనకు అవసరమైన ఎనర్జీ వస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

గ్లుటామైన్ ఎక్కువగా లభించే వాటిల్లో బీట్‌రూట్ ఒకటి. మన ఆరోగ్యానికి, జీర్ణక్రియ వ్యవస్థకు అమినో యాసిడ్ అత్యంత అవసరం. ఫైబర్ కూడా దీనిలో సమృద్ధిగా లభిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ

ఎర్రటి బీట్‌రూట్‌లు 10 అత్యంత శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూరగాయల్లో ఒకటి. బీట్‌రూట్‌ను ఎర్రటి రంగులో ఉంచేందుకు ఉపయోగపడే బెటాలైన్ సమ్మేళనాలు అత్యధిక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. దీని వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. వయసుతో వచ్చే జబ్బులు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌లపై పోరాడేందుకు ఇవి సాయపడతాయి.

బీట్ జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

బీట్‌రూట్: అందరికీ సురక్షితమేనా?

కొంత మంది వ్యక్తులకు బీట్‌రూట్ తిన్న తర్వాత వారి మూత్రం లేదా మలం ఎరుపు లేదా గులాబి రంగులో వస్తుంది. దీన్నే బిటురియా అంటారు. ఇది హానికరం కాదు.

ఆక్సలేట్ అనే సహజ సిద్ధమైన రసాయనాలను అత్యధిక స్థాయిలో ఈ రూట్స్ కలిగి ఉంటాయి. అయితే, ఆక్సలేట్‌ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే వారు, బీట్‌రూట్ వంటి ఆక్సలేట్ ఆహారాన్ని తినడం మానుకోవాలి.

మొత్తంగా బీట్‌రూట్ మంచిదేనా?

బీట్‌రూట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేందుకు ఇది సాయపడుతుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. యాంటీ క్యాన్సర్ కారకాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. అదనంగా ఫోలెట్ అధికంగా లభించే ఈ కూరగాయను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కండరాలు రికవరీ అవుతాయి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)