ఇలాంటి మనిషిని ఎక్కడైనా చూశారా? ఈమెకు నొప్పంటే ఏమిటో తెలియదు

మహిళ

ఫొటో సోర్స్, MEAN PA

ఆమెకు నొప్పి అంటే ఏమిటో తెలియదు. నొప్పి అంటే తెలియని వ్యక్తి ప్రపంచంలో ఆమె ఒక్కరేనేమోనని పరిశోధకులు చెబుతున్నారు.

ఒవెన్‌లో చేతులు కాలినా, ఏదో మాంసం కాలిన వాసన వస్తేగానీ ఆ విషయం ఆమెకు తెలియదు.

ఆమె పేరు జో కామెరాన్.

రెండు రకాల జన్యు మ్యుటేషన్ల కారణంగా ఆమెకు నొప్పి అంటే దాదాపుగా తెలియదు.

కామెరాన్‌ చేతికి 2013లో శస్త్రచికిత్స జరిగింది. అప్పటికి ఆమె వయసు 65 ఏళ్లు. అప్పటి నుంచి పదేళ్లుగా జన్యు పరమైన తేడాలను అర్థం చేసుకునేందుకు నిపుణుల బృందం పరిశోధన చేస్తోంది.

''ఆర్థరైటిస్ వల్ల నా చేతికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు మత్తు వైద్యులతో మాట్లాడాను. ఇది చాలా నొప్పిని కలిగించే శస్త్రచికిత్స అని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత కూడా ఆ నొప్పి ఉంటుందన్నారు'' అని ఆమె బీబీసీకి చెప్పారు.

''అలా ఏమీ ఉండదు. నాకు నొప్పి పుట్టదని నేను చెప్పాను.''

''శస్త్రచికిత్స తర్వాత ఆమె నా వద్దకు వచ్చారు. నొప్పి పుట్టకుండా ఉండేందుకు మీరు ఏమీ తీసుకోలేదు. ఇది సాధారణ విషయం కాదు'' అని ఆమె అన్నారని కామెరాన్ చెప్పారు.

ఆ తర్వాత ఆమెను యూనివర్సిటీ కాలేజ్ లండన్(యూసీఎల్)‌కి చెందిన జన్యు శాస్త్రవేత్తల వద్దకు వెళ్లాల్సిందిగా మత్తు వైద్యురాలు సూచించారు. జన్యు శాస్త్రవేత్తల బృందం ఆమె డీఎన్‌ఏపై పరిశోధనలు జరిపేందుకు కణజాలం, రక్తనమూనాలను సేకరించింది.

కుటుంబం

ఫొటో సోర్స్, JO CAMERON

ఫాహ్ - ఔట్ జన్యు మ్యుటేషన్ అంటే ఏంటి?

జంక్ డీఎన్‌ఏలోని జన్యువుల సమూహంలో ఫా - ఔట్ జన్యువు ఒకటి. సంతానోత్పత్తి, వయసు పైబడడం, రోగాలు రావడంలో ఈ జన్యువు పాత్రపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

నొప్పి కలగకపోవడానికి కారణమైన జన్యువులను పరిశోధకులు గుర్తించారు. నొప్పి, డిప్రెషన్ వంటి వాటిని నియంత్రించేందుకు సహాయపడే జన్యువులను కనుగొన్నారు.

నొప్పి, మానసిక స్థితి, జ్ఞాపక శక్తికి కారణమైన ఫాహ్ జన్యువులో కలిగే ఫాహ్ - ఔట్ మ్యుటేషన్ నొప్పి, బాధ లాంటి లక్షణాలను తగ్గించేస్తుందని గుర్తించారు.

ఈ మ్యుటేషన్ ఫాహ్ ఎంజైమ్‌లు తగ్గిపోవడానికి కూడా కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

అది నమ్మశక్యంకాని విషయం

కామెరాన్‌‌లోని ఫాహ్ జన్యువుల్లో ఎంజైమ్‌లు అంత ప్రభావవంతంగా పనిచేయని మరో మ్యుటేషన్ కూడా ఉన్నట్లు గుర్తించారు.

ఎంజైమ్ అనేది ప్రొటీన్ తయారు చేసే జీవ కణాలను ఉత్పత్తి చేస్తుంది. అది మనుషుల్లో ఆనందానికి కారణమైన అనండమైన్‌ అనే కణాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే, కామెరాన్‌లో అవి సరిగ్గా పనిచేయడం లేదని పరిశోధకులు గుర్తించారు.

కామెరాన్‌లో నొప్పి లేకుండా ఉండే రెండు మ్యుటేషన్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.

''జో కామెరాన్‌ జన్యువుల్లో రెండు మ్యుటేషన్లు ఎలాగో అనుసంధానమై ఉన్నాయి. ఆ కణాలు గాయాలను 20 నుంచి 30 శాతం వేగంగా నయం చేయగలవు. అది నమ్మశక్యం కాని విషయమే. కానీ, ఆమెకు నయం కావడమే దానికి నిదర్శనం'' అని యూసీఎల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆండ్రీ ఒకొరాకొవ్ చెప్పారు.

ఆయన న్యూరాలజీ జర్నల్ బ్రెయిన్‌లో ప్రచురితమైన అధ్యయనానికి సహకరించిన సీనియర్ రచయిత కూడా.

''ఈ మ్యుటేషన్ ఫాహ్ - ఔట్ జన్యువులో కొంత భాగాన్ని తొలగించడంతోపాటు పనిచేయకుండా చేస్తుంది. కామెరాన్‌లోని ఫాహ్ జన్యువుల్లో మరో మ్యుటేషన్ కూడా ఉంది. ప్రపంచంలో రెండు మ్యుటేషన్లు కలిగి ఉన్న మరొకరు ఉన్నారో లేరో కూడా తెలియదు'' అని ఆండ్రీ ఒకొరాకొవ్ చెప్పారు.

నొప్పి

ఫొటో సోర్స్, Getty Images

నొప్పి తెలియకపోతే ఏమవుతుంది?

హానికరమైన, ప్రాణాంతక సంఘటనల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి నొప్పి చాలా అవసరం. నొప్పి అనుభూతి చెందకపోవడం వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

ఒవెన్‌లో చేతులు కాలినా.. ఏదో మాంసం కాలిన వాసన వస్తేగానీ ఆ విషయం ఆమెకి తెలియదు.

తనలో ఏదో మార్పు ఉందని కామెరాన్‌కి అంతకుముందు తెలియదు. నొప్పి నివారణ కోసం ఆమె ఎప్పుడూ ఎలాంటి ఔషధాలు తీసుకోలేదు.

''జన్యు మ్యుటేషన్ల కారణంగా నొప్పి తెలియని ఇతర రోగులపై కూడా పరీక్షలు జరిపాం. తీవ్రగాయాలు అయినప్పుడు కొన్నిసార్లు వాళ్లు నొప్పిని అనుభవించారు. కాబట్టి నొప్పిని అనుభవించగలగడం మంచిదే.

మరీ తీవ్రమైన నొప్పి కలిగినప్పుడు దాన్ని ఆపేందుకు దానిని అనుభూతి చెందడమనేది ఉపయోగపడుతుంది.'' అని యూసీఎల్‌లో జన్యుశాస్త్ర ప్రొఫెసర్ జేమ్స్ కాక్స్ చెప్పారు. బ్రెయిన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన రచయిత కూడా.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)