ఎల్ నినో- లా నినా: హఠాత్తుగా భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు...కారణం ఇవేనా

వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images

మే నెలలో వర్షాలు, అక్టోబర్ దాటుతున్నా ఉక్కపోత.. గత కొన్నేళ్లుగా ఇలాంటి అకాల వాతావరణ పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ప్రపంచమంతటా భారీ వర్షాలు, తుపాన్లు, భీకరమైన ఎండలు, వడగాలులు నమోదవుతున్నాయి.

ఎండలు మండిపోవలసిన తరుణంలో దేశరాజధాని దిల్లీలో చిరుజల్లులు, అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి.

రుతుపవనాలు రాకముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పెనుగాలుగు, వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

2022లో యూరప్ ఎండలతో మండిపోయిందని, పోర్చుగల్, స్పెయిన్‌ లాంటి దేశాలలో వడగాలుల కారణంగా అనేకమంది చనిపోయారని, కార్చిచ్చులతో అడవులు తగలబడిపోయాయని వార్తలు వచ్చాయి.

ఇక 2023 ఇంకా మండిపోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

దీనికి కారణం ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్ఓ) అనే వ్యవస్థ.

దీనిలో రెండు వ్యతిరేక శక్తులు పనిచేస్తుంటాయి. వాటిని ఎల్ నినో, లా నినా అంటారు. రెండూ ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని గణనీయంగా మారుస్తాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఎల్ నినో, లా నినా

లా నినా, ఎల్ నినో అంటే ఏంటి?

గత కొన్నేళ్లుగా ప్రపంచం లా నినా పీరియడ్‌లో ఉంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. చలి గాలులు ఎక్కువగా వీస్తాయి.

లా నినా కారణంగా కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో భారీ వానలు కురిశాయి.

లా నినా వలన పసిఫిక్ మహాసముద్రం పైన భూమధ్యరేఖ వెంబడి వీచే గాలులు, అంటే తూర్పున దక్షిణ అమెరికా నుంచి పశ్చిమాన ఆసియా వైపు వీచే గాలులు సాధారణం కంటే బలంగా ఉంటాయి.

ఈ గాలులు దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపుకు వెచ్చటి నీటిని తీసుకొస్తాయి. దాంతో, సముద్రమట్టాలు పెరుగుతాయి. అవతల అమెరికా వైపు చల్లటి నీరు ఉపరితలం పైకి వస్తుంది.

ఎల్ నినో దశలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. వెచ్చటి నీరు అమెరికా వైపుకు చేరుతుంది. ఆసియా వైపు చల్లటి నీరు సముద్ర ఉపరితలం మీదకు వస్తుంది.

ఈ విషయాన్ని మొట్టమొదట 1600లలో పెరువియన్ మత్స్యకారులు గమనించారు. డిసెంబర్‌లో అమెరికా సమీపంలోని సముద్రాలలో వెచ్చటి నీరు చేరడం చూశారు. ఈ స్థితికి స్పానిష్‌లో "ఎల్ నినో డి నావిడాడ్" అని పేరు పెట్టారు. అంటే క్రైస్ట్ చైల్డ్ (దేవుని బిడ్డ) అని అర్థం.

ఒక రకంగా లా నినా అతివృష్టి, ఎల్ నినో అనావృష్టి అనుకోవచ్చు.

ఎల్ నినో, లా నినా
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఎల్ నినో, లా నినా వాతావరణాన్ని ఎలా మారుస్తాయి?

అన్ని ఎల్ నినో లేదా లా నినో దశలు ఒకేలా ఉండవు. వాటిలో కొన్ని కామన్‌గా ఉంటాయి. అవేంటంటే..

ఉష్ణోగ్రతలు:

ప్రపంచ ఉష్ణోగ్రతలు ఎల్ నినో పీరియడ్‌లో దాదాపు 0.2C పెరుగుతాయి. లా నినా సమయంలో 0.2C తగ్గుతాయి.

ఎల్ నినో దశలో వెచ్చటి నీరు మరింతగా వ్యాపిస్తుంది. ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. ఇది వాతావరణంలోకి మరింత వేడిని విడుదల చేస్తుంది. దానివల్ల తేమ, వెచ్చని గాలులు పెరుగుతాయి.

2016 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. అది ఎల్ నినో సంవత్సరం.

2020-2022 మధ్యలో ఉత్తరార్ధగోళంలో వరుసగా మూడు లా నినా దశలు వచ్చాయి. అయినప్పటికీ, 2022 వరుసగా ఐదవ వేడి సంవత్సరంగా నమోదైందని యూరోపియన్ యూనియన్ (ఈయూ) వాతావరణ పర్యవేక్షణ విభాగం తెలిపింది.

"గత మూడు సంవత్సరాలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలలో నమోదైంది. ఇదే కాలంలో మూడు లా నినా దశలు వచ్చాయి కాబట్టి, కొంత అదుపులో పెరిగాయి. లేదంటే ఇంతకన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయి ఉండేవి" అని బ్రిటన్ వాతావరణ శాఖలోని విభాగం మెట్ ఆఫీస్‌కు చెందిన ప్రొఫెసర్ ఆడం స్కైఫ్ వివరించారు.

ఉష్ణోగ్రత 0.2C పెరగడం అంటే, ప్రపంచ ఉష్ణోగ్రత 20 శాతం పెరిగినట్టు లెక్క.

లా నినా ఈ ఏడాది చివరికి ముగుస్తుందని మెట్ ఆఫీస్ అంచనా వేస్తోంది. అంటే లా నినా లేకుండా ఎల్ నినో కొనసాగుతుంది. దీనివల్ల "ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని" మెట్ ఆఫీస్ చెబుతోంది.

వర్షాపాతంలో మార్పులు

ఎల్ నినో ఉన్నప్పుడు సముద్రంలో వెచ్చటి నీరు తూర్పు వైపుకూ, దక్షిణం వైపుకూ ప్రవహిస్తుంది.

దక్షిణ అమెరికా, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతాలలో వర్షాలు పడతాయి. ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాలు పొడిగానే ఉంటాయి.

ఆసియా, ఆస్ట్రేలియా, మధ్య, దక్షిణ ఆఫ్రికాలలో వర్షాలు లేక, కరువు పరిస్థితులు నెలకొంటాయి.

లా నినా ఉన్నప్పుడు దీని విరుద్ధంగా జరుగుతుంది. దక్షిణ అమెరికా, కెనడా, ఆసియాలలో భారీ వర్షాలు పడతాయి.

2022 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇదంతా లా నినా ప్రభావమే.

తుపానులు

లా నినా వలన అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కువ తుపాన్లు ఏర్పడతాయి. దీనివల్ల అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయి.

మరోవైపు, పసిఫిక్ మహాసముద్రంలో తుపాన్లు తక్కువగా ఉంటాయి.

ఎల్ నినో సమయంలో అటు నుంచి ఇటు జరుగుతుంది.

2022 డిసెంబర్‌లో పసిఫిక్ మహాసముద్రం క్క మ్యాప్.. లా నినా వలన ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువహా ఉన్నాయని తెలుస్తోంది
ఫొటో క్యాప్షన్, 2022 డిసెంబర్‌లో పసిఫిక్ మహాసముద్రం క్క మ్యాప్.. లా నినా వలన ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువహా ఉన్నాయని తెలుస్తోంది

ఎంత తరచుగా ఎల నినో, లా నినా వస్తుంటాయి?

ఎల్ నినో, లా నినా ఘటనలు రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయి. సాధారణంగా తొమ్మిది నుంచి 12 నెలల వరకు ఉంటాయి.

అవి కూడా ఒకదాని తరువాత ఇంకొకటి వస్తాయి అనుకోడానికి వీల్లేదు. ఎల్ నినో కంటే లా నినా ఘటనలు తక్కువగా సంభవిస్తాయి.

వీటి వల్ల మనకేంటి ముప్పు?

ఎల్ నినో, లా నినా వలన జరిగే విపరీతాలు ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఆహారం, ఇంధన వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి.

2014-16లో వచ్చిన్ ఎల్ నినో కారణంగా కెనడా, ఆసియాలలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని వల్ల పంట నష్టం, ఆరు కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజల ఆహార భద్రత దెబ్బతిందని ఐరాసలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ లెక్క వేసింది.

ఎల్ నినో కారణంగా అమెరికా వైపు చల్లటి నీరు పైకి వస్తుంది. అంటే, సముద్రంలో పోషకాలు తక్కువగా పైకి వస్తాయి. సముద్ర జీవులకు సరైన ఆహారం అందదు. దక్షిణ అమెరికాలో ఫిషింగ్ దెబ్బతింటుంది.

ఎల్ నినో, లా నినా

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణ మార్పులు ఎల్ నినో, లా నినా ఘటనలను ప్రభావితం చేస్తాయా?

1850-1950 మధ్య వచ్చిన ఎల్ నినో, లా నినా దశల కంటే 1950ల తరువాత వచ్చిన ఎల్ నినో, లా నినా దశలు తీవ్రంగా ఉన్నాయని ఐరాస క్లైమేట్ శాస్త్రవేత్తలు (ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) తెలిపారు.

అయితే, చెట్ల వలయాలు, పగడాలు, అవక్షేపాల రికార్డులను పరిశీలిస్తే, 1400ల నుంచి ఈ ఘటనల తరచుదనం, బలంలో వైవిధ్యాలు ఉన్నాయని తెలుస్తోంది.

వాతావరణ మార్పులు ఎల్ నినో, లా నినాలను ప్రభావితం చేశాయని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవని ఐపీసీసీ తేల్చింది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)