ఫోగాట్ సిస్టర్స్ ఫొటోలను మార్ఫింగ్ చేశారా.. పోలీస్ వ్యాన్‌లో ఏం జరిగింది?

జర్నలిస్ట్ మన్‌దీప్ పునియా ట్వీట్ చేసిన చిత్రంలో వినేశ్, సంగీత సీరియస్‌గా కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, జర్నలిస్ట్ మన్‌దీప్ పునియా ట్వీట్ చేసిన చిత్రంలో వినేశ్, సంగీత సీరియస్‌గా కనిపిస్తున్నారు
    • రచయిత, వినీత్ ఖరే, శృతి మేనన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లర్లను మే 28న పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు వినేశ్ ఫోగాట్ ఒక సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని మన్‌దీప్ పునియా అనే జర్నలిస్ట్ అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అందులో వినేశ్ ఫోగాట్, సంగీత ఫోగాట్ బస్సులో కూర్చుని ఉన్నారు. వారితో పాటు ముగ్గురు పోలీసులు, మరో నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఫోగాట్ అక్కచెల్లెళ్లిద్దరూ కెమెరా వంక తీక్షణంగా చూస్తున్నారు.

అచ్చంగా అలాంటిదే మరొక సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో బయటికొచ్చింది. అందులో ఫోగాట్ సిస్టర్స్ నవ్వుతూ కనిపించారు. ఇద్దరికీ సొట్ట బుగ్గలు కనిపిస్తున్నాయి.

అదే బస్సు, అదే వ్యక్తులు, అదే పోజు. వాళ్ల నవ్వు ఒక్కటే వ్యత్యాసం.

ఆ రోజే మధ్యాహ్నం 2 గంటలకు ‘రియల్ బాబా బనారస్’ అనే అకౌంట్ నుంచి ఈ ఫొటో ట్విటర్‌లో షేర్ అయింది.

ఈ రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఫోగాట్ సిస్టర్స్ నవ్వుతూ ఉన్న ఫొటోను చాలామంది షేర్ చేశారు. రెజ్లర్లు తమ పోరాటాన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదంటూ ఆ ఫొటోకు వ్యాఖ్యానాలు చేశారు.

"వీళ్లు ఇప్పుడు టూల్ కిట్‌లో ఒక భాగమయ్యారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.

నిరసనల్లో భాగం పంచుకుంటున్న రెజ్లర్ బజరంగ్ పునియా ట్వీట్ చేస్తూ, ఫోగాట్ సిస్టర్స్ నవ్వుతున్న ఫొటో ఫేక్ అని, "ఐటీ సెల్ స్వయంగా ఈ నకిలీ చిత్రాన్ని వ్యాప్తి చేస్తోందని" ఆరోపించారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటోను మార్చిందెవరు?

అసలు ఫొటోను ఎవరు టాంపరింగ్ చేశారనే దానిపై స్పష్టత లేదు.

వినేశ్, సంగీత ఫోగట్‌ల అసలు చిత్రానికి నవ్వు జోడించారని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ బూమ్ లైవ్ తెలిపింది.

మేం కూడా FaceApp అనే యాప్ వాడి, ఫొటో గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాం. ఈ యాప్ సహాయంతో ఫొటోల్లోని మనుషుల ముఖకవళికలను మార్చవచ్చు.

మరికొన్ని ఇతర ఫేస్ ఎడిటింగ్ యాప్‌లను ఉపయోగించాం. కానీ, ఫేస్‌యాప్ సాయంతో మార్చిన ఫొటో, ఫోగాట్ సిస్టర్స్ నవ్వుతున్న ఫొటోకు దగ్గరగా వచ్చింది.

వినేశ్ ఫోగట్, సంగీత ఫోగట్, బజరంగ్ పునియాలతో ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదు.

కానీ, సంగీత నుంచి బీబీసీకి అందిన మెసేజ్‌లో "సెల్ఫీ ఎందుకు తీసుకున్నామంటే... రెజ్లర్లలో అనిశ్చితి, భయం ఉన్నాయి. వాళ్లను ఎక్కడికి తీసుకెళుతున్నారు, వారితో పాటు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇచ్చారన్న ఆందోళన ఉంది" అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

వినేశ్, సంగీతల అసలు ఫొటో బయటకు రాకపోతే, ఈ నవ్వుతున్న ఫొటోనే అందరూ నమ్మే అవకాశం ఉందని ఫాక్ట్ చెకర్ పంకజ్ జైన్ అన్నారు.

"ఇది భవిష్యత్తు ఫేక్ వార్తలకు ఆరంభం. నకిలీ చిత్రాలను సాధారణ ప్రజలు కూడా కనిపెట్టగలరు. కానీ ఇప్పుడు ఇది దుర్లభంగా మారుతోంది" అన్నారు పంకజ్ జైన్.

ఓపెన్ సోర్స్ ఇన్వెస్టిగేటర్, సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెజిలియన్స్‌కు చెందిన బెంజమిన్ స్ట్రిక్ చాలాకాలంగా భారతదేశంలో నకిలీ వార్తల వ్యాప్తిపై దృష్టి సారిస్తున్నారు. నెల రోజులుగా కొనసాగుతున్న రెజ్లర్ల నిరసనలను కూడా గమనిస్తున్నారు. ఫోగాట్ సిస్టర్ల సెల్ఫీ రెండు వెర్షన్లనూ చూశారు.

ఫొటో టాంపరింగ్ చేసిన విధానాన్ని చూసి ఆయన అదిరిపడ్డారు. భయపడ్డారు కూడా.

ఫొటోలో వినేశ్, సంగీతల పెదవులపై ఒకేరకమైన నవ్వు ఉంది. పళ్లన్నీ కనిపించేలా నవ్వుతున్నారు. దానిబట్టి ఈ ఫొటో నకిలీదని చెప్పవచ్చని బెంజమిన్ స్ట్రిక్ అన్నారు.

వినేశ్, సంగీతల పాత ఫొటోలు మేం పరిశీలించాం. వారిద్దరికీ బుగ్గపై సొట్టలు(డింపుల్స్) లేవు.

ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టుకోవడం ద్వారా ఏది అసలు, ఏది నకిలీ అనేది గుర్తించవచ్చు. కానీ, మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు వస్తున్నాయి. నిజం ఏదో, నకిలి ఏదో కనిపెట్టడం కష్టంగా మారవచ్చు.

"చాలా క్లిష్టంగా మార్పులు చేసి ఉంటే, ఏది నిజమైనదో, ఏది నకిలీదో కచ్చితంగా కనిపెట్టలేమని" బ్రిటన్‌లో లాంకాస్టర్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధనలు చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సోఫీ నైటింగేల్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేక్ న్యూస్‌పై భయాలు

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇక్కడ డేటా చాలా చౌకగా దొరుకుతుంది. అనేక ఇతర దేశాల మాదిరిగానే ఇక్కడా ఫేక్ న్యూస్ సవాలుగా మారింది.

నిజమని నమ్మించేలా ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్ వీడియోలు తయారవుతున్నాయి. రాను రాను ఫేక్ న్యూస్ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది.

డీప్‌ఫేక్ అనేది వీడియోలో వ్యక్తులు చేయని పనులను చేసినట్లుగా, మాట్లాడని మాటలు మాట్లాడినినట్టుగా మార్చి చూపించే ఒక టెక్నిక్.

అసలు వీడియోలను తలపించేలా తయారవుతున్న నకిలీ వీడియోలను సృష్టించడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ఉచితంగా లేదా చాలా చౌకగా లభ్యమవుతోంది. ఇది అన్నిటికన్నా పెద్ద భయం.

"చాలా అప్లికేషన్‌లు ఉచితంగా లభ్యమవుతున్నాయి. లేదా నెలకు నాలుగైదు వందల్లో దొరుకుతాయి. కొన్నిటికి సంవత్సరానికి సుమారు నాలుగు వేలు కడితే చాలు. వీటితో అద్భుతమైన డీప్‌ఫేక్ వీడియోలను చేయవచ్చు లేదా ఫొటోలను తారుమారుచేయవచ్చు" అని బెంజమిన్ స్ట్రిక్ చెప్పారు.

వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ నకిలీ వీడియోలు సులభంగా సామాన్యులకు చేరుతున్నాయి.

ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నవారితో పాటు సోషల్ మీడియా కూడా దీనికి బాధ్యత వహించాలని కొందరు వాదిస్తున్నారు. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

నకిలీ కంటెంట్ వ్యాప్తికి సోషల్ మీడియా చాలా శక్తివంతమైన మాధ్యమం. ఈ ప్లాట్‌ఫారమ్‌లపై ఫేక్ న్యూస్ రాకుండా చూసుకోవాలని కంపెనీలపై ఒత్తిడి తేవడానికి అవసరమైన చట్టాలు కఠినంగా లేవు" అని సోఫీ నైటింగేల్ అన్నారు.

భారతదేశంలో కృత్రిమ మేధస్సు సహాయంతో నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తోందని, ఈ బిల్లు మొదటి ముసాయిదా జూన్ మొదటి వారంలో రానుందని మీడియాలో నివేదికలు వచ్చాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు

వైద్యరంగం మొదలైన వాటి అభివృద్ధికి కృత్రిమ మేధస్సు ఎంతో ఉపయోగపడుతుంది కానీ, దానివల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. యంత్రం మనిషి మేధస్సును దాటేస్తుందా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

"యంత్రాలు మనుషులను నియత్రించకూడదు. అలాంటి పరిస్థితి రాకూడదు. దీనివల్ల చాలా అనర్థం కలుగుతుంది" అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు ప్రొఫెసర్ శంకర్ పాల్ అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల ఉనికికి అతిపెద్ద ముప్పు అని బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా అన్నారు.

అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధస్సు వ్యవస్థల అభివృద్ధిపై ఆరు నెలల నిషేధం విధించాలని ఎలాన్ మస్క్ సహా సాంకేతిక రంగంలోని పలువురు నిపుణులు ఒక బహిరంగ లేఖలో ప్రస్తావించారు.

ఇది కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏదైనా ఒక గ్లోబల్ ఏజెన్సీ లేదా అమెరికా నియంత్రించాలని చాట్‌జీపీటీ చీఫ్ ఇటీవల అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్న భయం ప్రపంచం నలుమూలల నుంచి వ్యక్తమవుతోంది.

2020లో, భారతీయ జనతా పార్టీ స్వప్రయోజనాలకు కృత్రిమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై చాలా చర్చ జరిగింది.

ఇటీవల గుజరాత్‌లో రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని పోలీసులు ఆందోళన చెందినట్లు నివేదికలు వచ్చాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్టుకు సంబంధించిన నకిలీ చిత్రాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే లాభాలు, నష్టాలపై పశ్చిమ దేశాల్లో చర్చ జరుగుతోంది. మరి, భారతదేశంలో అలాంటి అవగాహన ఉందా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాలపై పశ్చిమ దేశాల్లో ఉన్నంత అవగాహన భారతదేశంలో కనిపించట్లేదని బెంజమిన్ స్ట్రిక్ అన్నారు.

"లాభ నష్టాలపై సమాజంలో అవగాహన పెంపొందించాలి. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అని నిర్ణయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది" అని డాక్టర్ సోఫీ నైటింగేల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)