మోదీ తొమ్మిదేళ్ల పాలన: ఇవీ మా 9 విజయాలన్న బీజేపీ.. 9 ప్రశ్నలతో కాంగ్రెస్ విమర్శలు

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, REUTERS, ANI

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయి.

ఈ సందర్భంగా బీజేపీ, మోదీ ప్రభుత్వ ‘విజయాలను’ గుర్తు చేసేందుకు ప్రయత్నించగా, విపక్షాల నుంచి ఎదురుదాడి మొదలైంది.

2014 మే నెలలో పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

రెండు రోజుల కిందట మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల విజయాలను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్‌పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ 9 ప్రశ్నలు వేసింది.

కాంగ్రెస్ పార్టీ ఈ ప్రశ్నలను సోషల్ మీడియాకే పరిమితం చేయలేదు. దేశంలోని వివిధ నగరాలలో విలేఖరుల సమావేశాలు నిర్వహించి బీజేపీపై ఈ ప్రశ్నలు కురిపించింది.

ప్రజల తరఫున తమ గొంతు వినిపిస్తూనే ఉంటామని కాంగ్రెస్ శనివారం చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం విఫలమైన 9 అంశాలను 28 నగరాలలో విలేఖరుల సమావేశాలు నిర్వహించి ప్రజలకు తెలియజేశాం.

ప్రజల కోసం, రాజ్యాంగం కోసం మేం పోరాడుతూనే ఉంటాం, ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చేస్తాం’ అని ఆ ట్వీట్‌లో కాంగ్రెస్ చెప్పింది.

కాంగ్రెస్ వేసిన 9 ప్రశ్నలు

- ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది? ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారెందుకు?

- వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఎందుకు ఇవ్వడం లేదు?

- మీ స్నేహితుడు అదానీకి ప్రయోజనం కలిగించేలా ప్రజల కష్టార్జితాన్ని ఎందుకు ఎల్ఐసీ, ఎస్బీఐలలో పెట్టుబడి పెడుతున్నారు? కొందరు దేశం విడిచి పారిపోవడానికి ఎందుకు మీరు అనుమతిస్తున్నారు?

- మహిళలు, దళితులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, మైనార్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?

- 2020లో మీరు చైనాకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ దేశం భారత్ ప్రాదేశిక భూభాగాలను ఎందుకు ఆక్రమిస్తోంది?

- ఎన్నికలలో ప్రయోజనాల కోసం మీరు ఉద్దేశపూర్వకంగానే విద్వేష రాజకీయాలు చేస్తున్నారెందుకు?

- గత తొమ్మిదేళ్లలో రాజ్యాంగ విలువలను, గణతంత్ర సంస్థలను ఎందుకు నీరుగార్చారు? ప్రతిపక్షాల పట్ల విద్వేష ధోరణి ఎందుకు?

- పేదలు, గిరిజనుల కోసం ఉద్దేశించిన పథకాలకు బడ్జెట్ తగ్గించి వాటిని నీరుగారుస్తున్నారెందుకు?

- కోవిడ్ కారణంగా 40 లక్షల మందికిపైగా మరణించినా వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎందుకు పరిహారం ఇవ్వడం లేదు? హఠాత్తుగా లాక్ డౌన్ ఎందుకు విధించారు?

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

అంతేకాదు, బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో చేసిన 9 వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఈ అంశంపై కాంగ్రెస్ ట్విటర్‌లో ఒక చిత్రం పోస్ట్ చేసింది.

“బీజేపీ నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి వ్యక్తి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని, 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని, బుల్లెట్ రైళ్లను ప్రారంభిస్తామని, అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తామని, ప్రతి కుటుంబానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ హామీలను నెరవేర్చలేకపోయింది’ అని మోదీ ఫొటోతో ఉన్న ఆ చిత్రంలో కాంగ్రెస్ విమర్శించింది.

మోదీ

ఫొటో సోర్స్, ANI

బీజేపీ ప్రతి విమర్శలు

కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేసింది.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా తొమ్మిదేళ్లు, తొమ్మిది అద్భుతాలు అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనను, ప్రస్తుత ఎన్డీయే పాలనను పోల్చుతూ బీజేపీ తమ విజయాల గురించి మాట్లాడింది.

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని, మోదీ ప్రారంభించరాదని చెప్తూ కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నాయి.

బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత రెండు లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయిందని, వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోతుందని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

బీజేపీ ఏం చెప్పింది?

- యూపీఏ కాలంలో సగటు ద్రవ్యోల్బణ రేటు 8.7 శాతం కాగా ఎన్డీయే కాలంలో 4.8 శాతం.

ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2017-23 మధ్య 6.67 కోట్ల ఉద్యోగాలు సృష్టించాం. దుర్బర పేదరికంలో ఉన్న 41 కోట్ల మంది ఆర్థిక స్థాయిని పెంచాం.

కాంగ్రెస్ తన మిత్రులకు బొగ్గు గనుల లైసెన్సులు ఇవ్వగా ఎన్డీయే ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను అమలు చేసింది.

- వరి పంటకు కనీస మద్దతు ధర కింద యూపీఏ హయాంలో రూ. 3.09 లక్షల కోట్లు చెల్లించగా ఎన్డీఏ హయాంలో రూ. 10.64 లక్షల కోట్లు ఇచ్చారు. గత 9 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయింది.

- ఎల్ఐసీ లాభం ఒక్క ఏడాదిలోనే 27 రెట్లు పెరిగింది. ఎస్‌బీఐ కూడా ఒక త్రైమాసికంలో భారీ లాభాలు నమోదు చేసింది.

- యూపీఏ, నెహ్రూ కాలాలలోనే చైనా భారత గడ్డపై అడుగుపెట్టింది. ఎన్డీయే హయాంలో మాత్రం భారత్ చైనా ముందు తలవంచలేదు.

- కాంగ్రెస్, విద్వేష రాజకీయాలు పర్యాయపదాలు. అందుకే ఆ పార్టీ దేశంలోని అనేక ప్రాంతాలలో తుడిచిపెట్టుకుపోయింది.

- ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదాను వ్యతిరేకించిన కాంగ్రెస్, తొలి గిరిజన మహిళా అధ్యక్షురాలినీ అవమానించింది. ట్రిపుల్ తలాక్‌ బిల్లునూ కాంగ్రెస్ వ్యతిరేకించింది.

- కాంగ్రెస్ లాయర్ చెప్పినట్లు తీర్పు రాయడానికి అంగీకరించని సీజేఐని అభిశంసిస్తామంటూ బెదిరించారు.

కాంగ్రెస్ ఆర్టికల్ 356‌ను 90 సార్లు ప్రయోగించింది. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించింది. ఎన్డీయే ఇలాంటి ధోరణికి ముగింపు పలికింది.

- నిధులు దారి మళ్లకుండా సంక్షేమ పథకాలను అందించడానికి ఎన్డీయే పేరుగాంచింది. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహారం అందించడానికి డీబీటీ ద్వారా 28 లక్షల కోట్లు బదిలీ చేశాం. ఈ రికార్డుకు ఎవరూ సరిరాలేరు.

- కోవిడ్ మహమ్మారి సమయంలో, కోవిడ్ నిర్వహణలో భారత ప్రభుత్వ పనిని ప్రపంచం ప్రశంసించింది. కానీ, కాంగ్రెస్ పార్టీ భయాన్ని వ్యాప్తి చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

మిగతా పార్టీలు ఏమంటున్నాయి?

బీజేపీ చెప్పుకొంటున్న విజయాలపై మరికొన్ని పార్టీలూ స్పందించాయి.

గత తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రోజూ మార్పులు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.

ప్రభుత్వం చరిత్రను మారుస్తోందని, స్వరూపాన్ని మారుస్తోందని, విద్యాభ్యాస విధానాన్ని మారుస్తోందని, మతాన్ని మారుస్తోందని, నోట్లను మారుస్తోందని, అన్నీ మార్చేస్తున్న బీజేపీయే ఏదో ఒక రోజు మారిపోతుందని ఆమె అన్నారు.

గత తొమ్మిదేళ్లలో దేశంలో ప్రజావ్యతిరేక, ప్రజలను ఇబ్బంది పెట్టే విధానాలు తీసుకొచ్చారని, అవన్నీ విఫలమయ్యాయని ఆమె అన్నారు.

గత తొమ్మిదేళ్లలో పార్లమెంటులో అడిగిన ఏ ప్రశ్నకూ ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోయారని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓ బ్రయాన్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

బీజేపీపై బీఆర్ఎస్ పార్టీ నేతలూ విమర్శలు చేశారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం 99 విపత్తులకు కారణమైందని బీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి ట్వీట్ చేశారు.

మోదీ ప్రభుత్వ కాలంలో 9 విపత్తులంటూ ఆయన కొన్నిటిని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆతిషి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనాన్ని రాశారు.

రాష్ట్రాల చేతుల్లోంచి అధికారాలు లాక్కోవడంలో మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో అపఖ్యాతి మూటకట్టుకుందని ఆమె అందులో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)