కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చుట్టూ వివాదాలు... నిలువునా చీలిన ప్రతిపక్షాలు

పార్లమెంట్ కొత్త భవనం

ఫొటో సోర్స్, centralvista.gov.in/

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం చుట్టూ వివాదం రాజుకుంది.

ప్రారంభించేందుకు ఎంచుకున్న తేదీ, ప్రారంభించే నేత విషయంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాదు, కాంగ్రెస్ సహా 19 విపక్షాలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి కూడా.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలోని పార్టీలతో పాటు ఎన్డీయేలోని ప్రధాన పార్టీతో బీజేపీకి అనుకూలంగా సాగుతున్న రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాయి.

కొన్ని తటస్థ పార్టీలు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం విషయంలో ఎలాంటి వివాదాలకు పోకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాయి.

సావర్కర్

ఫొటో సోర్స్, SAVARKARSMARAK.COM

సావర్కర్ జయంతి రోజున...

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి మే 28వ తేదీని ఎంచుకున్నారు. అదే రోజు హిందూత్వ వాదిగా పేరున్న వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి కావడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా కొన్ని ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేశాయి.

సావర్కర్ జయంతి రోజున ఈ భవనాన్ని ప్రారంభించడమంటే అది జాతి నేతలను పూర్తిగా అగౌరవపరచడమేనని కాంగ్రెస్ విమర్శించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

సావర్కర్ జయంతి రోజున పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించనుండడం గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్ తదితరులందరినీ విస్మరించడమేనని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అందించిన భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తవుతున్న 2023 నవంబర్ 26న ఈ కొత్త భవనాన్ని ప్రారంభిస్తే బాగుండేందని, అలా కాకుండా సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కొద్ది రోజుల కిందట జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Getty Images

‘రాష్ట్రపతి లేకుండా’

పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, అలాంటిది ఆమెకు ఆహ్వానం కూడా లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఎలా ప్రారంభిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పార్లమెంట్ అనేది భారత గణతంత్రానికి అత్యున్నత చట్టసభ అని, దానికి అత్యున్నత రాజ్యాంగ అధికారి భారత రాష్ట్రపతి అని గుర్తు చేస్తూ అలాంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ కొత్త భవనం ప్రారంభోత్సవానికి కనీసం ఆహ్వానించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ కేవలం ఎన్నికల కారణాలతోనే ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్మును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతిగా ఎంపిక చేసినట్లుందని విమర్శించారు.

ఇంతకుముందు ఈ కొత్త భవనానికి శంకుస్థాపన చేసినప్పుడు కూడా అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదని ఖర్గే తన ట్వీట్‌లో విమర్శించారు.

దీనికి సమాధానంగా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు గతంలో పార్లమెంట్ అనుబంధ భవనాలు, పార్లమెంటులోని వివిధ విభాగాలను ప్రధానులే ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

1975లో పార్లమెంట్ అనుబంధ భవనాలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీయే ప్రారంభించారని, ఆ తరువాత 1987లో పార్లమెంట్ లైబ్రరీని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ప్రారంభించారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మీడియాతో చెప్పారు.

అంతేకాదు.. మీ ప్రభుత్వాలకు(కాంగ్రెస్) అధినేతలుగా ఉన్న నాయకులు పార్లమెంటు భవనాలను ప్రారంభించడం తప్పు కానప్పుడు తమ ప్రభుత్వ(బీజేపీ) అధినేత ప్రారంభించడం తప్పెలా అవుతుందని పురి ప్రశ్నించారు.

‘ఉప రాష్ట్రపతినీ ఆహ్వానించలేదు’

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

అయితే, మంత్రి హర్దీప్ పురి వాస్తవాలను దాచిపెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ఆరోపించారు.

పార్లమెంట్ ఉప భవనాలకు, లైబ్రరీలను ప్రారంభించడానికి.. పూర్తిగా కొత్త భవనాన్ని ప్రారంభించడానికి తేడా ఉందని ఆయన అన్నారు.

ఈ ప్రారంభోత్సవానికి రాజ్యసభ చైర్మన్ అయిన ఉప రాష్ట్రపతిని కూడా ఆహ్వానించలేదని మనీశ్ తివారీ అన్నారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

గతంలో ఎవరు ప్రారంభించారు?

పార్లమెంట్ ఉప భవనాలు:

మంత్రి హర్దీప్ సింగ్ పురీ చెప్పినట్లు 1975లో పార్లమెంటు ఉప భవనాలను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీయే ప్రారంభించారు.

1970 ఆగస్ట్ 3న అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి ఈ ఉప భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పూర్తయిన తరువాత 1975 అక్టోబర్ 24న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ భవనాలను ప్రారంభించారు.

పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌:

ఇక ఆ తరువాత పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌ను 1987లో రాజీవ్ గాంధీ శంకుస్థాపన చేసినట్లు మంత్రి హర్దీప్ సింగ్ పురీ చెప్పారు. అయితే.. ‘సంసదీయ్ జ్ఞానపీఠ్’గా పిలిచే ఈ బిల్డింగ్‌కు 1987 ఆగస్ట్ 15న రాజీవ్ గాంధీ శంకుస్థాపన చేసినప్పటికీ నిర్మాణం మొదలుకాలేదు.

ఆ తరువాత 1994 ఏప్రిల్ 17న అప్పటి లోక్‌సభ స్పీకర్ శివరాజ్ పాటిల్ ఈ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.

అనంతరం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తవడంతో 2002 మే 7న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ దీన్ని ప్రారంభించారు.

ఉప భవనాల ఎక్స్‌టెన్సన్:

ఇందిరాగాంధీ ప్రారంభించిన పార్లమెంట్ ఉప భవనాలకు ఎక్స్‌టెన్సన్‌ కూడా అనంతర కాలంలో నిర్మించాల్సి వచ్చింది. 2009 మే 5న అప్పటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీలు దీనికి పునాది రాయి వేశారు.

2016లో ఈ నిర్మాణం పూర్తయిన తరువాత 2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. అప్పటి ‌లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురైల సమక్షంలో ప్రధాని ఈ ఎక్స్‌టెన్సన్‌ను ప్రారంభించారు.

(ఆధారం: లోక్‌సభ సెక్రటేరియట్)

సోనియా గాంధీ

ఎవరు హాజరవుతున్నారు? ఎవరు కావడం లేదు?

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు కాబట్టి తాము హాజరుకాబోమంటూ కాంగ్రెస్ సహా 19 పార్టీలు బుధవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్న పార్టీల పేర్లను అందులో పేర్కొన్నారు.

పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించే అధికారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మాత్రమే ఉందని, ఇది విస్మరించి ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నందున తామంతా ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే వర్గం), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్‌ (మణి), విడుదలై చిరుతైగళ్ కచ్చి, రాష్ట్రీయ లోక్ దళ్, జనతాదళ్(యు), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్‌జేడీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే బుధవారం ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

ఇవే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఒక వీడియో విడుదల చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

కాగా విపక్షాల ప్రకటనపై బీజేపీ సహా ఎన్‌డీఏలోని 14 పార్టీలు స్పందించాయి. కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా విపక్షాలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను వదిలేస్తున్నాయని ఆరోపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి ఈ పార్టీలు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించి విపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో కోరాయి.

బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ శిందే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, జననాయక్ జనతా పార్టీ, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ, అప్నాదళ్(సోనేలాల్ వర్గం), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-మహారాష్ట్ర, తమిళ్ మానిల కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, ఐఎంకేఎంకే, ఏజేఎస్‌యూ-ఝార్ఖండ్, మిజో నేషనల్ ఫ్రంట్‌లు ఈ మేరకు ప్రకటించాయి.

ఈ 14 పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నాయి.

ఇవి కాకుండా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్‌లు కూడా హాజరవుతున్నట్లు తెలిపాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

ద్రౌపది ముర్ముపై పోటీ పెట్టినప్పుడు ఈ గౌరవం ఏమైంది: మాయావతి

మరోవైపు బీఎస్పీ అధినేత మాయావతి కూడా కొత్త పార్లమెంటు ప్రారంభాన్ని స్వాగతించారు.

తనకు ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు.

అయితే, ముందే నిర్ణయమైన కొన్ని కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉన్నందున తాను రాలేనని చెప్తూ అభినందనలు తెలిపారు.

అదే సమయంలో విపక్షాల తీరును ఆమె తప్పు పట్టారు. రాష్ట్రపతి ప్రారంభించడం లేదు కాబట్టి బహిష్కరిస్తామని కొన్ని పార్టీలు అనడం సరికాదని, ఈ ప్రారంభోత్సవానికి ఆదివాసీ మహిళల గౌరవానికి ముడిపెట్టడం తగదని అన్నారు.

ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన సమయంలో ఆమెపై పోటీ పెట్టినప్పుడు ఈ విషయం ఆలోచిస్తే బాగుండేదని అన్నారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/TRSPARTYONLINE

వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ ఏం చేస్తున్నాయి

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పింది. అంతేకాదు, కార్యక్రమాన్ని బహిష్కరించడం సరికాదని మిగతాపార్టీలకూ సూచించింది.

ఏపీలోని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పింది. ఆ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ హాజరవుతున్నారు.

మరోవైపు తెలంగాణలోని అధికార పార్టీ బీఆర్ఎస్ ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. గురువారం నిర్ణయిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/APCM

జగన్ ఏమన్నారంటే..

పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడం సరైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదని, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అన్ని పార్టీలూ రావాలని ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 8

‘‘సువిశాలమైన, అద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు’’ అంటూ ప్రారంభించిన ఆయన ఈ కార్యక్రమానికి అందరూ వస్తే బాగుంటుందని, తమ పార్టీ ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి హాజరవుతోందని అన్నారు.

ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ జాతి ఆత్మను ప్రతిబింబిస్తుందని, ఇది దేశ ప్రజలందరికీ, అన్ని పార్టీలకూ చెందిందని చెప్తూ ఇలాంటి కార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదని అన్నారు.

కొత్త లోక్ సభ

ఫొటో సోర్స్, centralvista.gov.in/

పార్లమెంట్ కొత్త భవనం ప్రత్యేకతలు ఇవీ..

మొత్తం 65 వేల చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో నిర్మించిన ఈ కొత్త భవనంలోని లోక్‌సభలో ప్రస్తుతం 888 మంది సభ్యులు కూర్చునే వీలుంది.

రాజ్యసభలో 384 మంది కూర్చునే వీలుంది.

ఉభయ సభలు సమావేశం కావడానికి లోక్‌సభ హాల్‌లోనే మొత్తం 1272 సీట్లను ఏర్పాటు చేసుకునే వీలుంది.

సభ్యులు కూర్చునే సీట్లకు డిజిటల్ అనువాద పరికరాలు అనుసంధానం చేసి ఉంటాయి. ప్రతి సీటు దగ్గర మల్టీమీడియా డిస్‌ప్లే ఉంటుంది.

సువిశాలమైన కమిటీ హాల్స్ ఉన్నాయి. ఇందులో అత్యాధునిక ఆడియో విజువల్ సిస్టమ్స్ ఏర్పాటుచేశారు.

డిజేబుల్డ్ పీపుల్ తమంతట తామే తిరగగలిగేలా ఈ కొత్త భవనంలో ఏర్పాట్లు ఉన్నాయి.

(ఆధారం: centralvista.gov.in)

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)